Damodara Rajanarsimha | మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే ఘన విజయం: మంత్రి దామోదర
Damodara Rajanarsimha | మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) కాంగ్రెస్ పార్టీదే (Congress) ఘన విజయమని మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Rajanarsimha) అన్నారు. సామాన్యుడిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో ప్రజా వైద్యాన్ని బలోపేతం చేస్తున్నామని తెలిపారు.
Damodara Rajanarsimha | త్రినేత్ర.న్యూస్: మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) కాంగ్రెస్ పార్టీదే (Congress) ఘన విజయమని మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Rajanarsimha) అన్నారు. సామాన్యుడిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో ప్రజా వైద్యాన్ని బలోపేతం చేస్తున్నామని తెలిపారు. అందోల్-జోగిపేట మున్సిపాలిటీని విద్య, వైద్య కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా అందోల్-జోగిపేట మున్సిపాలిటీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డులలో సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి.. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఏ వార్డుకు వెళ్లినా ప్రజల నుంచి మంచి స్పందన ఉందని చెప్పారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి చేరాలా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేస్తున్నామని తెలిపారు. అందోల్‌లో 150 బెడ్‌ల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఆధునిక ఆసుపత్రి, ఎన్సీడీ క్లినిక్స్, ట్రామా కేర్ సెంటర్, వడ్డీ లేని రుణాలు, విద్యా, వైద్య రంగాల్లో పెను మార్పులు, ఉచిత బస్సు, గృహలక్ష్మి, జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కాలేజీ, పాలిటెక్నిక్ కళాశాలలు, ఏకీకృత పాఠశాల నిర్మాణం, రేషన్ కార్డులు, ఉద్యోగాల నియామకాలు, నర్సింగ్ కాలేజీ , హాస్టళ్ల నిర్మాణం, కేజీబీవీలు, మోడల్ స్కూల్, స్కిల్ డవలప్‌మెంట్ సెంటర్, మహిళా పాలిటెక్నిక్ ఇలా అన్ని రంగాలలోనూ అందోల్-జోగిపేటను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు.
రాబోయే రోజుల్లో జోగిపేటలో మహిళలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం కనిపిస్తుందని చెప్పారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని సాధిస్తుందని మంత్రి వెల్లడించారు. మున్సిపాలిటీలలో ఏ వార్డుకు వెళ్లిన ప్రజల నుంచి మంచి స్పందన ఉందని, వారి సమస్యలు, కష్టాలు విని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అందరికీ ఉచిత వైద్యం అందేలా వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నామని వెల్లడించారు. జోగిపేటలోని ప్రాంతీయ దవాఖానలో మెరుగైన సేవలు అందించేలా కృషి చేస్తున్నామన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






