Rgv | టాలీవుడ్ హీరోతో ఆర్‌జీవీ బాలీవుడ్ మూవీ – ఎన్నాళ్లకెన్నాళ్లకు?
సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టబోతున్నాడు రామ్‌గోపాల్ వర్మ. అండర్ వరల్డ్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా చేయబోతున్నాడు. పోలీస్ కంపెనీ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో టాలీవుడ్ హీరో లీడ్ యాక్టర్‌గా నటిస్తున్నాడు.
Entertainment | Published On Aug 10, 2026, 7.53 pm IST
Rgv | రామ్‌గోపాల్ వర్మ ఒకప్పుడు ట్రెండ్‌సెట్టర్ డైరెక్టర్. కానీ ఇదంతా గతం. ఇప్పుడు అతడితో సినిమా చేసేందుకు స్టార్స్ ఆసక్తిని చూపడం లేదు. పరాజయాలతో ఆర్‌జీవీ పనైపోయిందంటూ విమర్శలు వస్తున్నాయి. రామ్‌గోపాల్ వర్మ ఓ మంచి సినిమా చేసి చాలా కాలమే అయ్యింది. ఈ మధ్య కాలంలో చాలానే సినిమాలను అనౌన్స్‌చేశాడు. కానీ ఏది కూడా సెట్స్‌పైకి రాలేదు. మరికొన్ని షూటింగ్ మధ్యలోనే ఆగిపోయాయి.
మళ్లీ మెగాఫోన్...
లాంగ్ గ్యాప్ తర్వాత ఆర్‌జీవీ మళ్లీ మెగాఫోన్ పట్టబోతున్నాడు. తనకు అచ్చొచ్చిన అండర్ వరల్డ్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లోనే ఓ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాలో తెలుగు హీరో లీడ్ రోల్‌లో కనిపించబోతున్నాడు.
పోలీస్ కంప్లైంట్...
ఆర్‌జీవీ కొత్త మూవీకి పోలీస్ కంపెనీ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాలో హర్షవర్ధన్ రాణే హీరోగా కనిపించబోతున్నాడు. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరుతెచ్చుకున్న ముంబై పోలీస్ ఆఫీసర్ దయా నాయక్ జీవితం ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. ఈ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతుంది. టీ సిరీస్ సంస్థ పోలీస్ కంపెనీ సినిమాను నిర్మించబోతుంది.
అబ్ తక్ చప్పన్...
దయానాయక్ జీవితం ఆధారంగా గతంలో వర్మ అబ్ తక్ చప్పన్ సినిమాను తెరకెక్కించారు. మరోసారి అతడి జీవితం ఆధారంగా సినిమాను రూపొందించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
తకిట తకిట...
నాగార్జున నిర్మించిన తకిట తకిట సినిమాతో హీరోగా హర్షవర్ధన్ రాణే కెరీర్ మొదలుపెట్టాడు. అవును, ప్రేమ ఇష్క్ కాదల్, మాయ, గీతాంజలితో పాటు హీరోగా పలు సినిమాల చేశాడు. ఫిదా, బెంగాల్ టైగర్‌తో పాటు మరొకొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపించాడు.
My NEXT film’s NAME being produced by T SERIES is ..
POLICE COMPANY
With the tag line
“It Is More Dangerous Than D Company “
The police is an institution, and an underworld company is a money making organisation..
But when an institution is given extra powers, it…— Ram Gopal Varma (@RGVzoomin) August 10, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Tollywood | మణిరత్నం, రామ్‌గోపాల్ వర్మ కలిసి కథను అందించిన ఒకే ఒక తెలుగు మూవీ ఏదో తెలుసా?
జులై 30, 2026

RGV on NEET | విద్యావ్యవస్థను చంపేయండి.. అసలు నీట్‌కు ఎందుకు ప్రిపేర్ అవుతున్నారు?: ఆర్‌జీవీ సంచలన పోస్ట్
జులై 28, 2026

RGV Tweet on Donald Trump | ట్రంప్ వల్లే ప్రజాస్వామ్యానికి ముప్పు.. అందరికీ ఓటు హక్కు ఉండకూడదు: RGV సెన్సేషనల్ ట్వీట్!
జూన్ 9, 2026
తాజావార్తలు
- ●Anchor Charmila | యాంకర్ చర్మిలా కొత్త ఫొటోలపై ఓ లుక్కేయండి!
- ●OTT | ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - తెలుగులో స్ట్రీమింగ్ - ప్రేమకు కులం అడ్డుగా నిలిస్తే!
- ●Ex Minister Laxma Reddy | కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని మరోసారి రుజువైంది : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
- ●Special Intensive Revision Telangana | తెలంగాణ ఎస్ఐఆర్ : 73 లక్షల మంది లిస్ట్ నుంచి ఔట్.. టాప్‌లో యాదాద్రి, లాస్ట్‌లో హైదరాబాద్
- ●Protest | ఎస్సీ హోదా వచ్చే వరకు పోరాటం ఆగదు.. జంతర్ మంతర్‌లో దళిత క్రైస్తవుల ధర్నా..
- ●Bigg Boss Thanuja | కుకు విత్ జాతిరత్నాలు విన్నర్‌గా తనూజ - ప్రైజ్‌మనీ ఎంతంటే?

Anchor Charmila | యాంకర్ చర్మిలా కొత్త ఫొటోలపై ఓ లుక్కేయండి!

OTT | ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - తెలుగులో స్ట్రీమింగ్ - ప్రేమకు కులం అడ్డుగా నిలిస్తే!

Ex Minister Laxma Reddy | కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని మరోసారి రుజువైంది : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి

Special Intensive Revision Telangana | తెలంగాణ ఎస్ఐఆర్ : 73 లక్షల మంది లిస్ట్ నుంచి ఔట్.. టాప్‌లో యాదాద్రి, లాస్ట్‌లో హైదరాబాద్



