త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Curry leaves | క‌రివేపాకు ధ‌ర‌కు రెక్క‌లు.. కిలో రూ. 120పైనే

Curry leaves | ట‌మాటా( Tomato ) ధ‌ర త‌గ్గిన‌ప్ప‌టికీ, మిగ‌తా కూర‌గాయ‌ల ధ‌ర‌లు ఆకాశాన్నాంటుతున్నాయి. ఆకు కూర‌ల( Green Leaves ) ధ‌ర‌లు కూడా భారీగా పెరిగాయి. మరి ముఖ్యంగా క‌రివేపాకు( Curry leaves )కు భారీ డిమాండ్ ఉంది.

S

Telangana | Published On Feb 28, 2026, 10.01 am IST

Curry leaves | క‌రివేపాకు ధ‌ర‌కు రెక్క‌లు.. కిలో రూ. 120పైనే
Advertisement

Curry leaves | త్రినేత్ర‌.న్యూస్ : ఎండ‌లు ముదురుతుండ‌డంతో కూర‌గాయ‌ల( Vegetables ) ధ‌ర‌ల‌కు రెక్క‌లొచ్చాయి. ట‌మాటా( Tomato ) ధ‌ర త‌గ్గిన‌ప్ప‌టికీ, మిగ‌తా కూర‌గాయ‌ల ధ‌ర‌లు ఆకాశాన్నాంటుతున్నాయి. ఆకు కూర‌ల( Green Leaves ) ధ‌ర‌లు కూడా భారీగా పెరిగాయి. మరి ముఖ్యంగా క‌రివేపాకు( Curry leaves )కు భారీ డిమాండ్ ఉంది.

హైద‌రాబాద్ మార్కెట్లో( Hyderabad Market ) కిలో క‌రివేపాకు ధ‌ర రూ. 100 నుంచి రూ. 120 ప‌లుకుతోంది. వీక్లి మార్కెట్‌లో క‌రివేపాకు ధ‌ర రూ. 10 ప‌లుకుతోంది. చిన్న క‌ట్ట‌కు కూడా రూ. 10 వ‌సూలు చేస్తున్నారు. ఐదు రూపాయాల‌కు ఇవ్వండంటే కిలో క‌రివేపాకు రూ. 100 పెట్టి కొనుగోలు చేస్తున్నామ‌ని రుస‌రుస‌లాడుతున్నారు. అయితే రెండు నెల‌ల క్రితం కిలో క‌రివేపాకు ధ‌ర రూ. 50 నుంచి రూ. 60 ఉండ‌గా.. ప్ర‌స్తుతం ఆ ధ‌ర రెట్టింపు అయింది. దీంతో నాలుగైదు క‌రివేపాకు కొమ్మ‌ల‌కు కూడా రూ. 10 వ‌సూలు చేస్తున్నారు. మొత్తంగా ఎండ‌ల‌కు ఆకులు రాలిపోవడంతో నగరానికి కరివేపాకు దిగుమతి భారీగా తగ్గిపోయింది.

అరకొరగా వచ్చే దిగుమతులతో ధరలకు రెక్కలొచ్చాయి. గుడిమల్కాపూర్, మాదన్నపేట్, బోయిన్‌పల్లి, మీరాలంమండి, శంషాబాద్‌ తదితర హోల్‌సేల్‌ మార్కెట్లలో కిలో రూ.80–100 వరకు పలుకుతుండగా.. వారాంతపు సంతలు, ఇతర లోకల్‌ మార్కెట్లలో కిలో రూ.100–120 ధర పలుకుతోంది. నెల రోజుల్లో ధరలు తగ్గుముఖం పట్టే అవకాశముందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement
Advertisement