త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLC Nellikanti Satyam | ఆర్టీసీ కార్మికుల సమ్మె న్యాయబద్ధమైనది: ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

MLC Nellikanti Satyam | రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె (RTC Strike) న్యాయబద్ధమైనదని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం (MLC Nellikanti Satyam) అన్నారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.

G

Telangana | Published On Apr 22, 2026, 11.05 am IST

MLC Nellikanti Satyam | ఆర్టీసీ కార్మికుల సమ్మె న్యాయబద్ధమైనది: ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
Advertisement

MLC Nellikanti Satyam | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె (RTC Strike) న్యాయబద్ధమైనదని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం (MLC Nellikanti Satyam) అన్నారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, ఉద్యోగ భద్రత, వేతన సవరణ, ఖాళీ పోస్టుల భర్తీ, కార్మికులకు సంబంధించిన సంక్షేమ అంశాలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించడంలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. కరోనా కాలంలో కూడా ప్రాణాలను పణంగా పెట్టి సేవలందించిన కార్మికుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదని హిత‌వుప‌లికారు. కార్మికుల సమ్మెను అణ‌చివేయడానికి ప్రయత్నించడం కాకుండా, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి సూచించారు. సీపీఐ ఎల్లప్పుడూ కార్మిక వర్గాల పక్షాన నిలుస్తుందని, ఆర్టీసీ కార్మికుల న్యాయమైన పోరాటానికి పూర్తి మద్దతు కొనసాగిస్తామని స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement