Pending Bills | మన ఊరు మన బడి బిల్లులు చెల్లించలేదని.. ప్రభుత్వ పాఠశాలకు తాళం వేసిన కాంట్రాక్టర్
Pending Bills | ‘మనఊరు- మనబడి’ బిల్లులు చెల్లించకపోవడంతో (Pending Bills) ప్రభుత్వ పాఠశాల భవనానికి కాంట్రాక్టర్ తాళం వేశాడు. నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండల కేంద్రంలో ‘మనఊరు- మనబడి’ కార్యక్రమంలో భాగంగా సురేశ్ అనే కాంట్రాక్టర్ పాఠశాల భవనాన్ని నిర్మించారు.
త్రినేత్ర.న్యూస్: ‘మనఊరు- మనబడి’ బిల్లులు చెల్లించకపోవడంతో (Pending Bills) ప్రభుత్వ పాఠశాల భవనానికి కాంట్రాక్టర్ తాళం వేశాడు. నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండల కేంద్రంలో ‘మనఊరు- మనబడి’ కార్యక్రమంలో భాగంగా సురేశ్ అనే కాంట్రాక్టర్ పాఠశాల భవనాన్ని నిర్మించారు. రెండేండ్లు గడుస్తున్నా ప్రభుత్వం బిల్లులు విడుదల చేయడం లేదన్నారు. అప్పుగా తెచ్చిన లక్షల రూపాయలకు వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నామని, ప్రభుత్వం కాంట్రాక్టర్లను వేధిస్తున్నదని చెప్పారు. ఇప్పటికైన సర్కార్ తమ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు.

కాగా, శనివారం కూడా పెండింగ్ బిల్లుల కోసం మహబూబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలకు కాంట్రాక్టర్ ధారాసింగ్ తాళం వేశారు. 2022లో చిన్నగూడూరు ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు ‘మనఊరు -మనబడి’ కింద ఎంపికయ్యాయని, రూ.4.50 లక్షలతో అభివృద్ధి పనులు పనులు చేశామని ధారాసింగ్ చెప్పారు. పనులు పూర్తిచేసి మూడేండ్లు కావస్తున్నా నేటికీ బిల్లులు రాకపోవడంతో తాళం వేశామన్నారు. అధికారులు తక్షణమే స్పందించి బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు.
[video width="848" height="480" mp4="https://axdxht1orlhu.compat.objectstorage.ap-hyderabad-1.oraclecloud.com/static.trinethra/wp-content/uploads/2026/01/WhatsApp-Video-2026-01-19-at-11.00.20-AM-1.mp4"][/video]
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకున్నది. మనఊరు- మనబడి బిల్లులులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ లింగాపురం ప్రభుత్వ పాఠశాలకు ఎస్‌ఎంసీ మాజీ చైర్మన్ నామిడ్ల సురేశ్ తాళంవేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడుస్తున్నా బిల్లులు ఇంతవరకు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బిల్లులు చెల్లించాలని, లేదంటే నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
సంబంధిత వార్తలు

Telangana | రిటైర్డ్ ఉద్యోగులకు శుభవార్త.. బకాయిలు విడుదల
ఏప్రిల్ 29, 2026

PRC, Pending bills | జూన్ 2 నాటికి పీఆర్సీ అమలు చేయాలి: జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, వొడ్నాల రాజశేఖర్
ఏప్రిల్ 17, 2026

TG Employees JAC | దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి: టీజీఈ జేఏసీ
ఏప్రిల్ 17, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



