త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dulquer Salmaan | దుల్క‌ర్ స‌ల్మాన్ సినిమాలో హీరోయిన్‌గా అచ్చ తెలుగు బ్యూటీ

టాలీవుడ్‌లోకి మ‌రో అచ్చ తెలుగు బ్యూటీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా న‌టిస్తోన్న ఆకాశంలో ఒక తార సినిమాలో క‌థానాయిక‌గా సాత్విక వీర‌వ‌ల్లి ఎంపికైంది. ప‌వ‌న్ సాదినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ కాబోతుంది.

N

Entertainment | Published On Jan 19, 2026, 12.59 pm IST

Dulquer Salmaan | దుల్క‌ర్ స‌ల్మాన్ సినిమాలో హీరోయిన్‌గా అచ్చ తెలుగు బ్యూటీ
Advertisement

Dulquer Salmaan |  టాలీవుడ్‌లో ప‌రాయి భాష‌ల హీరోయిన్ల‌దే డామినేష‌న్ క‌నిపిస్తుంటుంది. క‌న్న‌డ‌, హిందీ, మ‌ల‌యాళ ముద్దుగుమ్మ‌లు తెలుగులో టాప్ హీరోయిన్లుగా కొన‌సాగుతోన్నారు. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో అచ్చ తెలుగు అమ్మాయిల‌కు ఛాన్స్‌లు రావ‌డం క‌ష్ట‌మ‌ని అంటుంటారు.కానీ మ‌ల‌యాళ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ మాత్రం  తెలుగు హీరోయిన్ల‌తోనే ఎక్కువ‌గా సినిమాలు చేస్తున్నారు. రీతూ వ‌ర్మ, శ్రేయా ధ‌న్వంత‌రి, శోభిత ధూళిపాళ వంటి తెలుగు అమ్మాయిల‌కు త‌న సినిమాల్లో ఛాన్స్‌లు ఇచ్చారు. తాజాగా మ‌రో ప‌ద‌హార‌ణాల‌ తెలుగు బ్యూటీతో సినిమా చేయ‌బోతున్నారు దుల్క‌ర్ స‌ల్మాన్‌. సీతారామం, ల‌క్కీ భాస్క‌ర్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్ త‌ర్వాత ఆకాశంలో ఒక తార పేరుతో టాలీవుడ్‌లో మ‌రో ఓ సినిమా చేస్తున్నారు దుల్క‌ర్ స‌ల్మాన్‌. ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాకు ప‌వ‌న్ సాదినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

సాత్విక వీర‌వ‌ల్లి...

ఆకాశంలో ఒక తార మూవీలో హీరోయిన్‌గా ర‌ష్మిక మంద‌న్న‌, పూజా హెగ్డేతో పాలు ప‌లువురు స్టార్స్ పేర్లు వినిపించాయి. వారంద‌రిని కాద‌ని ఓ తెలుగు అమ్మాయి బంప‌రాఫ‌ర్‌ను ద‌క్కించుకుంది. ఈ సినిమాతో సాత్విక వీర‌వ‌ల్లి హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. ఆమె ఫ‌స్ట్ లుక్‌ను సోమ‌వారం మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో లంగా ఓణీ ధ‌రించి ప‌ల్లెటూరి యువ‌తిగా నాచుర‌ల్ లుక్‌తో సాత్విక ఆక‌ట్టుకుంటోంది.

ఆకాశంలోకి ఎలా వెళ్లాలి...

ఫ‌స్ట్ లుక్‌తో పాటు ఓ వీడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు. "నేను ఆకాశంలోకి ఎలా వెళ్లాలి" అంటూ ఓ చిన్నారి అమాయ‌కంగా అడిగే ప్ర‌శ్న‌తో ఈ గ్లింప్స్ మొద‌లైంది. "రోడ్డు కూడా స‌రిగ్గా లేని ఊరు నుంచి ఆకాశానికి నిచ్చ‌నేసేశావా...ముందు ఊరు పొలిమేర దాటి చూపించు" అంటూ ఓ వ్య‌క్తి చెప్పే డైలాగ్ ఆక‌ట్టుకుంటోంది. త‌న క‌ల‌ను అన్వేషిస్తూ ఓ యువ‌తి సాగించే జ‌ర్నీని ఈ గ్లింప్స్‌లో ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. ఈ గ్లింప్స్ లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌, విజువ‌ల్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. ఆకాశంలో ఒక తార మూవీకి జీవీ ప్ర‌కాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. స‌మ్మ‌ర్‌లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

 

 

 

 

Advertisement

తాజావార్తలు

Advertisement