త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Lava Blaze Duo 3 | రూ.16,999కే డ్యుయల్ స్క్రీన్ స్మార్ట్‌ఫోన్.. లావా బ్లేజ్ డ్యుయో 3 విడుద‌ల‌..

Lava Blaze Duo 3 | దేశీయ మొబైల్స్‌ తయారీ సంస్థ లావా తన తాజా స్మార్ట్‌ఫోన్ Lava Blaze Duo 3 ని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. బ‌డ్జెట్ ధ‌ర క‌లిగిన స్మార్ట్ ఫోన్ శ్రేణిలో సెకండ‌రీ డిస్‌ప్లే ఉన్న దేశంలోని తొలి స్మార్ట్‌ ఫోన్ ఇదేనని ఆ కంపెనీ ప్రకటించింది. రూ.16,999 ధరతో విడుదలైన ఈ ఫోన్ అమెజాన్‌లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది.

S

Technology | Published On Jan 19, 2026, 1.23 pm IST

Lava Blaze Duo 3 | రూ.16,999కే డ్యుయల్ స్క్రీన్ స్మార్ట్‌ఫోన్.. లావా బ్లేజ్ డ్యుయో 3 విడుద‌ల‌..
Advertisement

Lava Blaze Duo 3 | దేశీయ మొబైల్స్‌ తయారీ సంస్థ లావా తన తాజా స్మార్ట్‌ఫోన్ Lava Blaze Duo 3 ని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. బ‌డ్జెట్ ధ‌ర క‌లిగిన స్మార్ట్ ఫోన్ శ్రేణిలో సెకండ‌రీ డిస్‌ప్లే ఉన్న దేశంలోని తొలి స్మార్ట్‌ ఫోన్ ఇదేనని ఆ కంపెనీ ప్రకటించింది. రూ.16,999 ధరతో విడుదలైన ఈ ఫోన్ అమెజాన్‌లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. Blaze Duo 3లో ప్రధాన ఆకర్షణగా వెనుక భాగంలో ఉన్న 1.6 ఇంచుల AMOLED డిస్‌ప్లే ని చెప్ప‌వ‌చ్చు. ఈ సెకండరీ స్క్రీన్ ద్వారా ఫోన్ నోటిఫికేషన్లు చూడొచ్చు, మ్యూజిక్ కంట్రోల్ చేయొచ్చు, ప్రత్యేక యానిమేషన్లు వీక్షించొచ్చు, ఫోన్ అన్‌లాక్ చేయకుండానే అవసరమైన సమాచారం పొందొచ్చు. అంతేకాకుండా 50MP మెయిన్‌ కెమెరాతో హై-క్వాలిటీ సెల్ఫీలు తీయడానికి ఈ స్క్రీన్‌ను వ్యూ ఫైండర్‌గా కూడా ఉపయోగించవచ్చు.

సెకండరీ డిస్‌ప్లే స‌హాయంతో ఈజీగా సెల్ఫీలు..

ముందుభాగంలో 6.67 ఇంచుల FHD+ AMOLED డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్‌తో అందించారు. ఇది గేమింగ్, వీడియో స్ట్రీమింగ్‌కు స్మూత్ అనుభూతిని అందిస్తుంది. ఈ ఫోన్‌లో MediaTek Dimensity 7060 చిప్‌సెట్ ను ఇచ్చారు. అలాగే 6GB RAM కూడా ఉంది. మ‌రో 6GB RAMను అద‌నంగా వ‌ర్చువ‌ల్‌గా పెంచుకునే వీలు కూడా క‌ల్పించారు. దీని వ‌ల్ల ఫోన్ వేగంగా ప‌నిచేస్తుంది. ఎలాంటి ల్యాగ్ ఉండ‌దు. ఇక ఈ ఫోన్‌లో 128GB స్టోరేజ్ ల‌భిస్తుంది. మల్టీటాస్కింగ్‌కు ఈ ఫోన్ అద్భుతంగా ప‌నిచేస్తుంద‌ని లావా తెలిపింది. ఇక ఈ ఫోన్ కు వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరాను ఇచ్చారు. ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరాను ఇచ్చారు. సెకండరీ AMOLED స్క్రీన్ సహాయంతో ప్రధాన కెమెరాతోనే హై క్వాలిటీ సెల్ఫీల‌ను తీసుకోవచ్చు. అందువ‌ల్ల సెల్ఫీ ప్రియుల‌కు ఈ ఫోన్ ఎంతో అద్భుత‌మైన ప‌నితీరును అందిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

భారీ బ్యాట‌రీ..

ఈ ఫోన్‌లో 5000mAh బ్యాటరీ ఉండ‌గా, దీనికి 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను ఇస్తున్నారు. అందువ‌ల్ల ఫోన్‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవ‌చ్చు. అలాగే ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. స్టీరియో స్పీకర్లను ఇచ్చారు. IR బ్లాస్టర్, USB టైప్-C పోర్ట్, IP64 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్ల‌ను కూడా అందిస్తున్నారు. ఇక ఈ ఫోన్ కేవ‌లం 7.55mm మందంతో చాలా స్లిమ్ డిజైన్ ను క‌లిగి ఉంటుంది. క‌నుక ఫోన్ కు అద్భుత‌మైన ప్రీమియం లుక్ వ‌చ్చింది. ఈ ఫోన్‌ను మూన్‌లైట్ బ్లాక్‌, ఇంపీరియ‌ల్ గోల్డ్ క‌ల‌ర్ల‌లో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 15 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ను ఇచ్చారు. దీనికి ఒక్క అప్‌డేట్ (ఆండ్రాయిడ్ 16)ను మాత్ర‌మే అందిస్తామ‌ని కంపెనీ తెలిపింది. కానీ 2 ఏళ్ల వ‌ర‌కు సెక్యూరిటీ అప్ డేట్స్‌ను మాత్రం అందిస్తారు. ఇక ఈ ఫోన్‌లో ఎలాంటి బ్లోట్ వేర్ లేద‌ని, పూర్తిగా క్లీన్ ఆండ్రాయిడ్ ఓఎస్ ల‌భిస్తుంద‌ని లావా తెలియ‌జేసింది. అలాగే ఈ ఫోన్‌లో 5జి స‌దుపాయాన్ని కూడా ఇచ్చారు.

Lava Blaze Duo 3 స్మార్ట్ ఫోన్ ధ‌ర రూ.16,999 ఉండగా, అమెజాన్ లో ఈ ఫోన్‌ను విక్ర‌యిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా లావా ఇంటర్నేషనల్ ప్రొడక్ట్ హెడ్ సుమిత్ సింగ్ మాట్లాడుతూ, యువత అవసరాలను దృష్టిలో ఉంచుకుని డ్యుయల్ స్క్రీన్ ఫీచర్ క‌లిగిన ఫోన్‌ను సరసమైన ధరలో అందిస్తున్నట్లు తెలిపారు. Blaze Duo 3 డిజైన్, స‌దుపాయాలు ఆధునిక టెక్నాలజీని పోలి ఉంటాయ‌ని అన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement