త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cheriyal Municipality | కానిస్టేబుల్ స‌స్పెన్ష‌న్.. బీఆర్ఎస్ త‌ర‌పున భార్య గెలుపు

Cheriyal Municipality | మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లో ఓ మ‌హిళ బీఆర్ఎస్ త‌ర‌పున పోటీ చేసింద‌ని చెప్పి.. కానిస్టేబుల్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్న ఆమె భ‌ర్త‌ను స‌స్పెండ్ చేశారు. అయినా కూడా ఆమె కాంగ్రెస్ అభ్య‌ర్థిపై గెలుపొందింది. 223 ఓట్ల మెజార్టీతో ఆమె విజ‌యం సాధించింది.

S

Telangana | Published On Feb 13, 2026, 9.38 pm IST

Cheriyal Municipality | కానిస్టేబుల్ స‌స్పెన్ష‌న్.. బీఆర్ఎస్ త‌ర‌పున భార్య గెలుపు
Advertisement

Cheriyal Municipality | త్రినేత్ర‌.న్యూస్ : మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లో ఓ మ‌హిళ బీఆర్ఎస్ త‌ర‌పున పోటీ చేసింద‌ని చెప్పి.. కానిస్టేబుల్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్న ఆమె భ‌ర్త‌ను స‌స్పెండ్ చేశారు. అయినా కూడా ఆమె కాంగ్రెస్ అభ్య‌ర్థిపై గెలుపొందింది. 223 ఓట్ల మెజార్టీతో ఆమె విజ‌యం సాధించింది.

చేర్యాల మున్సిపాలిటీలో రెండో వార్డు నుంచి బీఆర్ఎస్ త‌ర‌పున క‌మ‌లాపురం గీతాంజ‌లి నామినేష‌న్ దాఖ‌లు చేశారు. అయితే గీతాంజ‌లి భ‌ర్త ర‌మేశ్‌.. కొముర‌వెల్లి పోలీసు స్టేష‌న్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు. ర‌మేశ్ త‌న భ‌ర్త‌కు మ‌ద్ద‌తుగా ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నార‌ని చెప్పి.. కాంగ్రెస్ నేత‌ల ఒత్తిడితో అత‌న్ని విధుల నుంచి స‌స్పెండ్ చేశారు పోలీసు ఉన్న‌తాధికారులు.

త‌ప్పుడు స‌మాచారంతోనే త‌న‌ను విధుల నుంచి తొల‌గించార‌ని ర‌మేశ్ పేర్కొన్నాడు. కాంగ్రెస్ ఒత్తిళ్ల‌కు, బెదిరింపుల‌కు భ‌య‌ప‌డ‌కుండా.. గీతాంజ‌లి ఎన్నిక‌ల బ‌రిలో నిలిచి గెలిచింది.

గీతాంజ‌లి చేత నామినేష‌న్ ఉప‌సంహ‌రింప‌జేస్తే.. రూ. కోటి వ‌ర‌కు ఇస్తామ‌ని కాంగ్రెస్ నేత‌లు ర‌మేశ్‌ను ఒత్తిడికి గురి చేశారు. అయినా కూడా ర‌మేశ్‌, త‌న భార్య గీతాంజ‌లి ఎలాంటి ప్ర‌లోభాల‌కు గురి కాలేదు. ఇక గీతాంజ‌లి.. కాంగ్రెస్ అభ్య‌ర్థి మ‌త్స్య‌ల తేజ సంజీవ‌య్య‌పై 223 ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించింది గీతాంజ‌లి. చేర్యాల మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డుల‌కు గానూ.. బీఆర్ఎస్ ఏడు వార్డుల్లో, కాంగ్రెస్ ఐదు వార్డుల్లో గెలుపొందింది.

ఈ మున్సిపాలిటీలో ఎక్స్ అఫిషియో సభ్యుడి మ‌ద్ద‌తుతో చైర్‌ప‌ర్స‌న్, వైస్ చైర్‌ప‌ర్స‌న్ పద‌వుల‌ను బీఆర్ఎస్ పాఆర్టీ ద‌క్కించుకోనుంది. జ‌న‌గామ ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి కీల‌కంగా వ్య‌వ‌హ‌రించి, గెలుపున‌కు కార‌ణ‌మ‌య్యారు.

Advertisement
Advertisement