త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jeevan Reddy | కాంగ్రెస్ పార్టీకి జీవ‌న్ రెడ్డి రాజీనామా..? ఉగాది త‌ర్వాత బీఆర్ఎస్‌లోకి..!

Jeevan Reddy | కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ త‌గిలే అవ‌కాశం ఉంది. సీనియ‌ర్ల‌ను కాద‌ని.. పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డిన ఎమ్మెల్యేల‌కు అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తుండ‌డంతో.. ఆ పార్టీలోనే కుంప‌ట్లు మొద‌ల‌య్యాయి.

S

Telangana | Published On Mar 14, 2026, 4.06 pm IST

Jeevan Reddy | కాంగ్రెస్ పార్టీకి జీవ‌న్ రెడ్డి రాజీనామా..? ఉగాది త‌ర్వాత బీఆర్ఎస్‌లోకి..!
Advertisement

Jeevan Reddy | త్రినేత్ర‌.న్యూస్ : కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ త‌గిలే అవ‌కాశం ఉంది. సీనియ‌ర్ల‌ను కాద‌ని.. పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డిన ఎమ్మెల్యేల‌కు అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తుండ‌డంతో.. ఆ పార్టీలోనే కుంప‌ట్లు మొద‌ల‌య్యాయి. జ‌గిత్యాల ఎమ్మెల్యే డాక్ట‌ర్ సంజ‌య్ కాంగ్రెస్ పార్టీలో చేర‌డాన్ని మొద‌ట్నుంచి తీవ్రంగా వ్య‌తిరేకిస్తూ వ‌స్తున్న మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం.

ఈ నెల 20వ తేదీ లోపు కాంగ్రెస్ పార్టీకి జీవ‌న్ రెడ్డి రాజీనామా చేయ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. 20 త‌ర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స‌మ‌క్షంలో జీవ‌న్ రెడ్డి గులాబీ కండువా క‌ప్పుకోనున్న‌ట్లు తెలుస్తోంది. గౌర‌వం లేని చోట కొన‌సాగ‌డంపై ఇంకెంత కాలం ఉండాల‌ని జీవ‌న్ రెడ్డి ఆలోచిస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ట‌చ్‌లోకి వెళ్లిన జీవ‌న్ రెడ్డి.. పార్టీ మారేందుకు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో గౌర‌వం, స‌ముచిత స్థానం లేద‌ని జీవ‌న్ రెడ్డి ప‌లు సంద‌ర్భాల్లో అస‌హ‌నం, అసంతృప్తి, ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే.

Advertisement
Advertisement