Jeevan Reddy | పార్టీ మారడం ఖాయం.. కారణం ఎమ్మెల్యే సంజయే : జీవన్ రెడ్డి
Jeevan Reddy | కాంగ్రెస్ పార్టీని వీడడం ఖాయమని, అందుకు కారణం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌నే అని మాజీ మంత్రి, సీనియర్ నేత జీవన్ రెడ్డి తేల్చిచెప్పారు. పార్టీ ఎందుకు మారాల్సి వస్తుంది అనే విషయాలపై జీవన్ రెడ్డి సోమవారం మీడియాకు వివరణ ఇచ్చారు.
ఫ్లెక్సీలే కాదు.. అన్నీ మారుతయ్
ఆయన ఏ పార్టీలో ఉన్నాడో తెలుసా..?
నామినేటెడ్ పోస్టుల్లో జోక్యం చేసుకోవడమా..?
అభిమానం చంపుకుని కొనసాగడం సాధ్యమేనా..?
Jeevan Reddy | త్రినేత్ర.న్యూస్ : కాంగ్రెస్ పార్టీని వీడడం ఖాయమని, అందుకు కారణం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌నే అని మాజీ మంత్రి, సీనియర్ నేత జీవన్ రెడ్డి తేల్చిచెప్పారు. పార్టీ ఎందుకు మారాల్సి వస్తుంది అనే విషయాలపై జీవన్ రెడ్డి సోమవారం మీడియాకు వివరణ ఇచ్చారు.
జీవన్ రెడ్డితో కలిసి పని చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొనడం చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ముందు ఆయన ఏ పార్టీలో ఉన్నాడో తెలుసా..? అని అడుగుతున్నాను. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పార్టీ ఫిరాయించలేదు.. బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారని స్పీకర్ తీర్పు ఇస్తారు. ఈయనేమో నాతో కలిసి పని చేయడానికి అభ్యంతరం లేదంటూ నాకు ఆఫర్ ఇస్తున్నాడు. నేను ఏ పార్టీలో ఉన్నానని అనుకుంటున్నాడో నాకు తెల్వదు. జీవన్ రెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోవాలని ఎవరు కోరుకుంటలేరు అని అంటున్నడు. నాలుగు దశాబ్దాలుగా అనుబంధం ఉన్న పార్టీ నుంచి విడిపోవాలని ఎవరు కూడా కోరుకోరు. ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరు..? అని అడుగుతున్నా. ఆయన నాకు ఆఫర్ ఇస్తున్నాడు కలిసి పని చేయడానికి. ఆయన ఏ పార్టీనో.. ఎక్కడున్నాడో ఆయనకే తెలియదు. నియోజకవర్గం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రితో కలిసి పనిచేయడం అంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమా..? గతంలో నేను కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రులతో కలిసి పని చేశాను. కేసీఆర్‌తో కూడా కలిసి పని చేశాను. నామినేటెడ్ పోస్టుల్లో జోక్యం చేసుకోవడం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు లభించాల్సిన హక్కులను ఎమ్మెల్యే సంజయ్ కాలరాస్తున్నారని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు.
నేను పార్టీ నుంచి వెళ్లిపోవడానికి కారణం నువ్వు కాదా...? ఆ ఆలోచన ఏర్పడడానికి కారణం నువ్వు కాదా..? ఎంత ఇబ్బంది ఉంటే పార్టీ మార్పుపై ఆలోచిస్తున్నానో అర్థం చేసుకోవాలి. నువ్వొచ్చి మాకు చిచ్చు పెట్టకుండా ఉంటే ఈ సమస్య ఉత్పన్నమయ్యేదా..? నాపై చేసేవన్నీ చేసి ఇప్పుడు శ్రీరంగ నీతులు చెప్తున్నారు. నాకు గౌరవం లభించనప్పుడు కచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటాను. కేడర్ సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుంటున్నాం. రాజకీయాల్లో గౌరవం లేనప్పుడు అభిమానం చంపుకుని కొనసాగడం సాధ్యమేనా..? నేను కాంగ్రెస్ పార్టీని వీడితే ఫ్లెక్సీలు ఏంటి.. అన్నీ మారుతాయని జీవన్ రెడ్డి తేల్చిచెప్పారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



