త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Municipal Elections | మున్సిపల్ ఎన్నికల్లో 39.8 శాతం ప్రజల ఓట్లు దక్కించుకున్న కాంగ్రెస్

Municipal Elections | తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఏడు మున్సిపల్ కార్పొరేషన్, 116 మున్సిపాలిటీలలోని 2,981 వార్డులకు జరిగిన ఎన్నికల్లో మూడు కార్పొరేషన్లు, 66 మున్సిపాలిటీ గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీ.. పోల్ అయి, చెల్లుబాటైన ఓట్లలో కేవలం 39.8 శాతం ప్రజల ఓట్లు మాత్రమే దక్కించుకోగలిగింది.

A

Telangana | Published On Feb 14, 2026, 7.29 pm IST

Municipal Elections | మున్సిపల్ ఎన్నికల్లో 39.8 శాతం ప్రజల ఓట్లు దక్కించుకున్న కాంగ్రెస్
Advertisement

28.75 శాతంతో సరిపెట్టుకున్న గులాబీ దళం
15.67 శాతానికి పరిమితమైన బీజేపీ
8.30 శాతంతో సత్తా చాటిన స్వతంత్రులు

Municipal Elections | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఏడు మున్సిపల్ కార్పొరేషన్, 116 మున్సిపాలిటీలలోని 2,981 వార్డులకు జరిగిన ఎన్నికల్లో మూడు కార్పొరేషన్లు, 66 మున్సిపాలిటీ గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీ గెలిచి సత్తాచాటింది. కానీ పోల్ అయి, చెల్లుబాటైన ఓట్లలో కేవలం 39.8 శాతం ప్రజల ఓట్లు మాత్రమే దక్కించుకోగలిగింది. మొత్తం 2,936 మందిని పోటీకి దింపిన హస్తం పార్టీ 15,05,006 ఓట్లు దక్కించుకుంది. 2,876 మంది అభ్యర్థులు పోటీ చేసిన బీఆర్ఎస్ కు 28.75 శాతం ప్రజలు జైకొట్టారు. మొత్తమ్మీద 10,87,347 మంది గులాబీ పార్టీ వైపు మొగ్గు చూపారు. ఈ రెండు పార్టీలు సాధించిన వార్డులు, మున్సిపాలిటీలలో భారీ వ్యత్యాసం ఉన్నప్పటికీ, ఓట్ల మధ్య తేడా కేవలం 4,17,659 మాత్రమే కావడం గమనార్హం. ఇక 2,634 మందిని బరిలోకి దింపిన కాషాయ దళం 15.67 శాతం ఓట్లను మాత్రమే సాధించగలిగింది. 5,92,823 మంది బీజేపీకి ఓటు వేశారు. చాలా మంది గెలుపోటములు ప్రభావితం చేసిన స్వతంత్ర అభ్యర్థులు మొత్తం 2,787 మంది పోటీ చేయగా, 8.30 శాతంతో 3,14,096 ఓట్లు సాధించారు. కేవలం 283 వార్డుల్లోనే పోటీ చేసిన ఏఐఎంఐఎం (మజ్లిస్ పార్టీ) 3.28 శాతంతో 1,24,236 ఓట్లు పొందింది.

1537 వార్డుల్లో జయపతాకం ఎగురవేసిన హస్తం పార్టీ

రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీల వారీగా తుది ఫలితాలను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం 2996 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదల చేయగా, ఒక స్థానంలో అభ్యర్థి మరణించడంతో ఎన్నిక వాయిదా పడింది. 14 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవమైన వార్డులతో కలిపి మొత్తం 2995 వార్డుల ఫలితాలు వెల్లడైనట్లు ఎస్ఈసీ అధికారికంగా ప్రకటించింది. ఇందులో కాంగ్రెస్ కు 1537 వార్డులు, బీఆర్ఎస్ 781, బీజేపీ 336, ఎంఐఎం 70, సీపీఎం 13, బీఎస్పీ రెండు స్థానాలు దక్కాయి. టీడీపీ, వైసీపీ, ఆప్ లకు ఒక్క స్థానం కూడా దక్కలేదు. రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన ఇతర పార్టీలు 73, స్వతంత్రులు 183 స్థానాల్లో గెలిచారు. పార్టీల వారీగా ఈ ఫలితాలను ఎస్ఈసీ వెబ్ సైట్ లో పొందుపర్చింది.

 

పార్టీ పొందిన ఓట్లు ఓట్ల శాతం (%) పోటీకి దిగిన అభ్యర్థులు
కాంగ్రెస్ 15,05,006 39.80% 2,936
బీఆర్ఎస్ 10,87,347 28.75% 2,876
బీజేపీ 5,92,823 15.67% 2,634
స్వతంత్రులు 3,14,096 8.30% 2,787
మజ్లిస్ 1,24,236 3.28% 283
ఫార్వర్డ్ బ్లాక్ 57,129 1.51% 288
సీపీఐ 49,450 1.30% 168
సీపీఎం 22,048 0.58% 128
జనసేన 13,504 0.35% 333
బీఎస్పీ 7,715 0.20% 213
టీఆర్ఏపీ 3,379 0.08% 91
ఆప్ 1,717 0.04% 38
ఇతరులు 2,668 0.07% 154

ట్యాగ్స్:

Advertisement
Advertisement