త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Congress MPs | హ‌రీశ్‌రావు మామ భూమిని ప‌రిశీలించిన కాంగ్రెస్ ఎంపీల బృందం

Congress MPs | సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీల బృందం సిద్దిపేట‌లో శుక్ర‌వారం ప‌ర్య‌టించింది.

S

Telangana | Published On Sep 18, 2026, 5.34 pm IST

Congress MPs | హ‌రీశ్‌రావు మామ భూమిని ప‌రిశీలించిన కాంగ్రెస్ ఎంపీల బృందం
Advertisement

Congress MPs | త్రినేత్ర‌.న్యూస్ : సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీల బృందం సిద్దిపేట‌లో శుక్ర‌వారం ప‌ర్య‌టించింది. హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేక బ‌స్సులో బ‌య‌ల్దేరిన ఈ బృందం.. కొండ‌పాక మండ‌లం వెలిక‌ట్ట గ్రామ శివారులోని సర్వే నంబర్ 271లో మాజీ మంత్రి హరీశ్ రావు బంధువు హనుమంతరావుకు చెందిన 6 ఎకరాల 2 గుంటల అసైన్డ్ భూములను పరిశీలించింది. ఈ సందర్భంగా ఈ భూమికి సంబంధించిన వివరాలను కొండపాక తహసీల్దార్ మల్లికార్జున్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు.

ఈ భూములకు సంబంధించిన రికార్డులు, పహాణీలతోపాటు పట్టాదారు వివరాలపై తహసీల్దార్‌ను ఆరా తీశారు. ఈ భూముల కొనుగోలు, అసైన్డ్ భూముల వివరాలను కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీల బృందం పరిశీలించింది. ఈ అసైన్డ్ భూముల బదలాయింపు జరిగిందా? లేకా నిబంధనలు పాటించారా? అనే అంశంపై ఈ ప్రతినిధి బృందం వివరాలను సేకరించింది.

Advertisement
Advertisement