త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kunamneni Sambashiva Rao | ఎండిపోయిన పంట‌ల‌కు పెట్టుబ‌డి ఇవ్వాలి

Kunamneni Sambashiva Rao | ఎల్‌నినో వ‌ల్ల ఎండిపోయిన పంట‌ల‌కు పెట్టిన పెట్టుబ‌డి ఇవ్వాలని రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబ‌శివ‌రావు డిమాండ్ చేశారు. త‌క్ష‌ణ‌మే రాష్ట్రాన్ని ప్ర‌కృతి వైప‌రీత్యంగా ప్ర‌క‌టించి, రైతుల‌ను ఆదుకోవాల‌న్నారు.

S

Telangana | Published On Sep 18, 2026, 5.10 pm IST

Kunamneni Sambashiva Rao | ఎండిపోయిన పంట‌ల‌కు పెట్టుబ‌డి ఇవ్వాలి
Advertisement

రాష్ట్రాన్ని ప్ర‌కృతి వైప‌రీత్యంగా ప్ర‌క‌టించాలి
ఎల్‌నినోపై చ‌ర్చ సంద‌ర్భంగా ఎమ్మెల్యే కూనంనేని డిమాండ్

Kunamneni Sambashiva Rao | త్రినేత్ర‌.న్యూస్ : ఎల్‌నినో వ‌ల్ల ఎండిపోయిన పంట‌ల‌కు పెట్టిన పెట్టుబ‌డి ఇవ్వాలని రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబ‌శివ‌రావు డిమాండ్ చేశారు. త‌క్ష‌ణ‌మే రాష్ట్రాన్ని ప్ర‌కృతి వైప‌రీత్యంగా ప్ర‌క‌టించి, రైతుల‌ను ఆదుకోవాల‌న్నారు. శాస‌న‌స‌భ‌లో ఎల్‌నినోపై చ‌ర్చ సంద‌ర్భంగా కూనంనేని సాంబ‌శివ‌రావు మాట్లాడారు.

ఎల్‌నినో అనేది కేవ‌లం తెలంగాణ రాష్ట్రానికే ప‌రిమితం కాలేదు. ప్ర‌పంచంలోని అనేక దేశాల‌ను ఎల్‌నినో చుట్టుముట్టింది. ఇది అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన విప‌త్తు. ప్ర‌స్తుతం ఒక‌రికొక‌రు విమ‌ర్శ‌లు చేసుకోవాల్సిన స‌మ‌యం కాదు.. అంద‌రం క‌లిసి స‌మిష్టిగా విప‌త్తును ఎదుర్కోవాల్సిన స‌మ‌యం. ఈ 100 ఏళ్ల‌లో పాతిక సార్లు క‌రువు వ‌చ్చింది. కానీ 75 ఏళ్ల‌ల్లో మాత్రం ఇదే అత్యం పెద్ద క‌రువుగా భావించొచ్చు అని కూనంనేని పేర్కొన్నారు.

ఆకాశం చిల్లులు ప‌డే విధంగా వాతావ‌ర‌ణ మార్పులు

భూతాపం వ‌ల్ల ఉష్ణోగ్ర‌త‌లు మితిమీరి పెరిగిపోతున్నాయి. వాతావ‌ర‌ణ కాలుష్యం కూడా పెరుగుతుంది. ఆకాశం చిల్లులు ప‌డే విధంగా వాతావ‌ర‌ణ మార్పులు సంభ‌విస్తున్నాయి. ప్ర‌కృతిని, వాతావ‌ర‌ణాన్ని ప‌ట్టించుకోక‌పోవ‌డం వ‌ల్లే ఇలాంటి ప‌రిణామాలు ఏర్ప‌డుతున్నాయి. భ‌విష్య‌త్‌లో ఇలాంటి ప‌రిస్థితులు రాకుండా చ‌ర్య‌లు తీసుకోవాలి. వ‌చ్చే ఏడాది కూడా కొన‌సాగుత‌ద‌ని అంటున్నారు. ఏడాదిన్న‌ర కాలం పాటు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సాంబ‌శివ‌రావు తెలిపారు.

మోదీ, ట్రంప్ సాంగ‌త్యంతో వ‌చ్చిన క‌రువు ఇది

ఇది జాతీయ విప‌త్తు కాబ‌ట్టి అటు కేంద్రం, ఇటు రాష్ట్రం స‌మాధానం చెప్పాలి. మోదీ, ట్రంప్ సాంగ‌త్యంతో వ‌చ్చిన క‌రువు ఇది. గ్లోబ‌ల్ వార్మింగ్ అక్క‌డ్నుంచి వ‌చ్చింది. బ‌య‌ట‌ప‌డడానికి ఏం జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో ఆలోచించాలన్నారు.

లింక్ కెనాల్స్ ను పూర్తి చేయండి

సాగునీటి విష‌యంలో మ‌న త‌ప్పులున్నాయి. 20 ఏండ్ల క్రితం ప్రారంభించిన ప్రాజెక్టులు ఇప్ప‌టికీ పూర్తి కాలేదు. త‌క్కువ కాలంలో కాళేశ్వ‌రం పూర్తి చేశారు. కానీ ఉప‌యోగం లేకుండా పోయింది. సాగునీటి క‌ష్టాల‌ను అధిగ‌మించేందుకు త‌క్ష‌ణ‌మే ఏం చేయ‌గ‌లుగుతారో అది చేయండి. లింక్ కెనాల్స్ ను పూర్తి చేయండి. ఎస్సారెస్సీ, దేవాదుల నుంచి ఈ లింక్ కెనాల్స్ చేయండి. జాగ్ర‌త్త‌గా తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు ఉత్త‌ర తెలంగాణ జిల్లాల‌కు అని కూనంనేని సాంబ‌శివ‌రావు పేర్కొన్నారు.

న‌ష్టం అంచ‌నాల‌ను కేంద్రానికి పంపించండి

ఎల్‌నినో వ‌ల్ల అత్యంత త‌క్కువ పంట‌లు వేశారు. ఆహార ధాన్యాల సంక్షోభం వ‌చ్చే ప్ర‌మాదం ఉంది. రైతు వ‌ర‌కే కాదు క‌ష్టం. రైతు కూలీకి, ఆర్థిక వ్య‌వ‌స్థకు ప్ర‌మాదం ఉంది. కేంద్ర ప్ర‌భుత్వం బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాలి. పంట‌లు ఎండిపోవ‌డం వ‌ల్ల పెట్టుబ‌డి న‌ష్టం జ‌రుగుతుంది. కాబ‌ట్టి పెట్టుబ‌డి మొత్తం ఇచ్చేలా చ‌ర్య‌లు తీసుకోండి. క‌రువు జిల్లాల‌ను గుర్తించి ఆదుకోవాలి. ప్ర‌కృతి వైప‌ర్యీతంగా రాష్ట్రాన్ని ప్ర‌క‌టించాలి. ఎస్డీఆర్ఎఫ్ ఫండ్ కోసం కేంద్రంపై ఒత్తిడికి తీర్మానం చేయాలి. న‌ష్టం అంచ‌నాల‌ను కేంద్రానికి పంపించండి. ఎస్డీఆర్ఎఫ్ నుంచి కూడా కొంత ఫండ్ ఇవ్వాలి. ఆరోగ్యంపై దెబ్బ‌ప‌డే ప్ర‌మాదం ఉంది. హెల్త్ డిపార్ట్మెంట్‌ను కూడా అప్ర‌మ‌త్తం చేయాలి. మ‌న ప‌శువులకు కూడా ప్ర‌మాదం ఉంది. అవ‌స‌ర‌మైన మేత అంచ‌నా వేశారా లేదా చెప్పాలి. మంచి నీటి కొర‌త‌ను అధిగ‌మించేందుకు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నారో చెప్పాల‌ని కూనంనేని సాంబ‌శివ‌రావు డిమాండ్ చేశారు.

 

 

Advertisement
Advertisement