Ponnam Prabhakar | ఎల్‌నినో రాజకీయ సమస్య కాదు.. బీజేపోళ్లు కేంద్రం నుంచి నిధులు తేవాలి
Ponnam Prabhakar | ఎల్‌నినో అనేది రాజకీయ సమస్య కాదని.. అది ప్రకృతి వైపరీత్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా రైతాంగానికి బీజేపీ, బీఆర్ఎస్ అండగా నిలవాలని కోరారు.
- బీజేపీ, బీఆర్ఎస్ రైతులకు అండగా నిలవాలి
- బీజేపీ ఒక్క మంచి పనైనా చేసిందా?
- అసెంబ్లీలో బీజేపీ నేతలకు చురకలంటించిన మంత్రి పొన్నం ప్రభాకర్
Ponnam Prabhakar | త్రినేత్ర.న్యూస్: ఎల్‌నినో అనేది రాజకీయ సమస్య కాదని.. అది ప్రకృతి వైపరీత్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా రైతాంగానికి బీజేపీ, బీఆర్ఎస్ అండగా నిలవాలని కోరారు. ఎల్‌నినో పోయి వర్షాలు సమృద్ధిగా కురవాలని అనేక పూజలు చేసినట్లు వెల్లడించారు. ఈమేరకు శుక్రవారం పొన్నం అసెంబ్లీలో మాట్లాడుతూ.. బీజేపీ నేతలకు కౌంటరిచ్చారు. రైతుల కోసం బీజేపీ ఒక్క మంచి పనైనా చేసిందా అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు రాష్ట్ర ప్రతినిధి బృందంతో వెళ్లి కేంద్రం నుంచి నిధులు విడుదల చేయించాలని సూచించారు.
గతంలో పార్లమెంట్‌లో వాజపేయి మాట్లాడిన వీడియోను శాసన సభలో మంత్రి పొన్నం ప్రదర్శించారు. వాజపేయి ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ వారిని పాకిస్థాన్‌కు పంపారు. అక్కడ ఉన్న ప్రతినిధి బృందం ప్రతిపక్ష నాయకులు ఎలా వచ్చారని ఆశ్చర్యపోయారు. ఇది భారతదేశ సంప్రదాయం.. భారతదేశ ప్రజాస్వామిక గొప్పతనం అని చెప్పారు.
ఎల్‌నినో తెలంగాణ తెచ్చుకున్న సమస్య కాదు.. ప్రకృతి వైపరీత్యం. రాజకీయాలు చేయాల్సిన సమస్య అంతకంటే కాదు. రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రైతాంగానికి అందరం అండగా ఉండాలి. ఇంటికో ఇంకుడు గుంత, పంటకు పంట కుంట, ఊరుకో ఊట కుంట అనేక కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నాం.
ఎల్‌నినో పోయి మంచి వర్షాలు కురవాలని మా ముఖ్యమంత్రి యాదగిరి గుట్ట లో, నేను ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సత్యం వర్షం పడుతున్నప్పటికీ కొండగట్టులో గిరి ప్రదక్షిణ చేశాం. ధర్మపురి, యాదగిరి గుట్ట, వేములవాడలో పూజలు చేశాం.నెల రోజుల పాటు బోనాలు ఎత్తుకున్న అక్కా చెల్లెల్లు , ఉజ్జయిని మహంకాళి , బల్కంపేట ఎల్లమ్మ, సింహవాహిని అమ్మవారి ఆలయాల్లో పూజలు చేశాం. ఆనాడు విపత్తు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి ఎన్నో పూజలు చేశాం. ఇప్పుడు కూడా అలానే చేస్తున్నాం.
బీజేపీ నేతలు రాష్ట్ర ప్రతినిధి బృందాన్ని తీసుకొని పోయి కేంద్రం అన్ని విధాలుగా తెలంగాణను క్లిష్ట పరిస్థితుల్లో ఆదుకోవడానికి నిధులు విడుదల చేయించాలి. ప్రభుత్వం తరఫున ఇటు వ్యవసాయంలో రైతులకు అవగాహన కల్పించేలా చైతన్య కార్యక్రమాలు చేస్తున్నాం. బీజేపీ ఒక్కనాడైనా రైతులకు ఉపయోగకడే కార్యక్రమాలు చేసిందా.. ఒక ప్రకటన చేసారా?తెలంగాణ లో ఎల్ నినో ప్రభావం తో వర్షాభావ పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతాంగానికి బీఆర్ఎస్, బీజేపీ నేతలు అండగా ఉండాలి అని పొన్నం కోరారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Kunamneni Sambashiva Rao | ఎండిపోయిన పంటలకు పెట్టుబడి ఇవ్వాలి
- ●Dengue Vaccine | భారత్‌లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్.. వచ్చే ఏడాదే అందుబాటులోకి..
- ●Kaushik Reddy | దానం నాగేందర్‌పై అనర్హత వేటు ప్రజాస్వామ్య విజయం: కౌశిక్‌రెడ్డి
- ●Minister Seethakka | తాగునీరు, ఉపాధికి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు
- ●Oscars 2027 | ఇండియా నుంచి ఆస్కార్ బరిలో మరాఠీ థ్రిల్లర్ మూవీ - టాలీవుడ్‌కు నిరాశ
- ●Ponguleti Srinivas Reddy | సిద్దిపేటలో ఆక్రమించుకున్న భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మిస్తాం

Kunamneni Sambashiva Rao | ఎండిపోయిన పంటలకు పెట్టుబడి ఇవ్వాలి

Dengue Vaccine | భారత్‌లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్.. వచ్చే ఏడాదే అందుబాటులోకి..

Kaushik Reddy | దానం నాగేందర్‌పై అనర్హత వేటు ప్రజాస్వామ్య విజయం: కౌశిక్‌రెడ్డి

Minister Seethakka | తాగునీరు, ఉపాధికి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు




