త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MP Mallu Ravi | రైతులు ఆచితూచి పంట‌లు వేయాలి

MP Mallu Ravi | ఎల్ నినో( El Nino ) నేప‌థ్యంలో రైతులు ఆచితూచి పంట‌లు వేయాల‌ని నాగ‌ర్‌క‌ర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మ‌ల్లు ర‌వి( MP Mallu Ravi )సూచించారు. ఎల్ నినో ప్ర‌భుత్వం సృష్టించింది కాదు.. ఇది ప్ర‌కృతి విప‌త్తు అని ఆయ‌న పేర్కొన్నారు.

S

Telangana | Published On Oct 19, 2026, 1.38 pm IST

MP Mallu Ravi | రైతులు ఆచితూచి పంట‌లు వేయాలి
Advertisement

ఎల్ నినో ప్ర‌భుత్వం సృష్టించింది కాదు..
ఇది ప్ర‌కృతి విపత్తు
గాంధీ భ‌వ‌న్‌లో మీడియాతో ఎంపీ మ‌ల్లు ర‌వి

MP Mallu Ravi | త్రినేత్ర న్యూస్ : ఎల్ నినో( El Nino ) నేప‌థ్యంలో రైతులు ఆచితూచి పంట‌లు వేయాల‌ని నాగ‌ర్‌క‌ర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మ‌ల్లు ర‌వి( MP Mallu Ravi )సూచించారు. ఎల్ నినో ప్ర‌భుత్వం సృష్టించింది కాదు.. ఇది ప్ర‌కృతి విప‌త్తు అని ఆయ‌న పేర్కొన్నారు. సోమ‌వారం గాంధీ భ‌వ‌న్‌లో మ‌ల్లు ర‌వి మీడియాతో మాట్లాడారు.

ఇప్ప‌టికే 18 సార్లు ఎల్‌నినో వ‌చ్చింది.. 150 ఏళ్ల కింద‌ట ఇలాంటి సూప‌ర్ ఎల్ నినో వ‌చ్చింద‌ని గుర్తు చేశారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో రైతులు అప్ర‌మ‌త్తంగా ఉండాలి. నీటి వినియోగం త‌క్కువ‌గా ఉన్న పంట‌లను వేసి ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించాల‌న్నారు.

స‌ర్ ద్వారా 13 కోట్ల మంది ఓట‌ర్ల పేర్లను తొలగించారు. దీనికోసం పెద్ద ఎత్తున అధికారులను ఏర్పాటు చేశారు. స‌ర్ అసలు ఉద్దేశ్యం ప్రజలకు ఓటు హక్కు కలిగించడమే. బీజేపీ వ్యతిరేక ఓట్లను మాత్రమే సర్‌లో తొలగిస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అందరు తమ ఓటు నమోదు చేసుకోవాలి. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాల‌ని కోరుతున్నాను. ప్రజలు సంతోషంగా దసరా పండగను జరుపుకోవాల‌ని ఎంపీ మ‌ల్లు ర‌వి కోరారు.

Advertisement
Advertisement