Saddula Bathukamma | తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
Saddula Bathukamma | తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పూల పండుగను ఆడపడుచులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి.. సంప్రదాయ పాటలు, కోలాటాలతో సందడి చేశారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు మహిళలంతా ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మకు ఘనంగా వీడ్కోలు పలికారు.
- తీరొక్క పూలతో బతుకమ్మలు.. ఆటపాటలతో ఆడపడుచుల సందడి
Saddula Bathukamma | తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పూల పండుగను ఆడపడుచులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి.. సంప్రదాయ పాటలు, కోలాటాలతో సందడి చేశారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు మహిళలంతా ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మకు ఘనంగా వీడ్కోలు పలికారు.
కరీంనగర్ జిల్లావ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. కరీంనగర్ నగరంతో పాటు మానకొండూరు, చొప్పదండి, హుజూరాబాద్ ప్రాంతాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో వేడుకల్లో పాల్గొన్నారు. నగరంలోని టవర్ సర్కిల్, రాంనగర్, మంకమ్మతోట, విద్యానగర్, ప్రకాశంగంజ్, అలుగునూరు, మానేరు వంతెన పరిసరాలతో పాటు పలు డివిజన్లు, వార్డుల్లో బతుకమ్మల సందడి నెలకొంది. తంగేడు, గునుగు, బంతి, చామంతి తదితర పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించారు. సంప్రదాయ వస్త్రధారణలో ముస్తాబైన మహిళలు బతుకమ్మల చుట్టూ చేరి ఆటపాటలతో సందడి చేశారు. పూల రంగులు, మహిళల కోలాహలంతో వీధులు పండుగ కళను సంతరించుకున్నాయి.

‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. రామరామ ఉయ్యాలో.. రామణేసి రామ ఉయ్యాలో..’ అంటూ మహిళలు గొంతెత్తి పాటలు పాడారు. చప్పట్లు కొడుతూ కోలాటాలు ఆడారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలను గుర్తుచేసుకుంటూ చిన్నారులకు బతుకమ్మ పండుగ విశిష్టతను వివరించారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా సంప్రదాయ వంటకాలను తీసుకొచ్చిన మహిళలు పరస్పరం పంచుకున్నారు. బతుకమ్మ వేడుకలు మహిళల మధ్య ఆత్మీయత, ఐక్యతను చాటిచెప్పాయి. భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య పూల పండుగను జరుపుకొని సద్దుల బతుకమ్మకు ఘనంగా వీడ్కోలు పలికారు.

ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●White Dwarf | అరుదైన ఆవిష్కరణ.. ఆకుపచ్చ రంగులో మెరిసే నక్షత్రం!
- ●Tiger Shroff | టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ పనే..!
- ●Chiranjeevi | 35 వసంతాల చిరంజీవి రౌడీ అల్లుడు - మొదట అనుకున్న టైటిల్ ఆటోజానీ - సాయిధరమ్‌తేజ్ తండ్రి నిర్మాత
- ●Harish Rao | ఈ దసరా మీకు ఎన్నో విజయాలను అందించాలి : హరీశ్‌రావు
- ●Bandla Ganesh | మొక్కజొన్న, సోయాబీన్ ధరలు పెంచకండి సీఎం రేవంత్ గారూ.. బండ్ల గణేశ్ విజ్ఞప్తి
- ●Bengaluru Airport Vancouver Airport | వాంకోవర్ ఎయిర్‌పోర్ట్‌తో బెంగుళూరు విమానాశ్రయం కీలక ఒప్పందం.. త్వరలో డైరెక్ట్ ఫ్లైట్స్!

White Dwarf | అరుదైన ఆవిష్కరణ.. ఆకుపచ్చ రంగులో మెరిసే నక్షత్రం!

Tiger Shroff | టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ పనే..!

Chiranjeevi | 35 వసంతాల చిరంజీవి రౌడీ అల్లుడు - మొదట అనుకున్న టైటిల్ ఆటోజానీ - సాయిధరమ్‌తేజ్ తండ్రి నిర్మాత

Harish Rao | ఈ దసరా మీకు ఎన్నో విజయాలను అందించాలి : హరీశ్‌రావు



