త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Manne Krishank | రేవంత్‌! మీరంత‌ క్లీన్‌గా ఉంటే సీబీఐ విచార‌ణ‌కు ఇవ్వండి

Manne Krishank | సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తనపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పలేదని.. ఆయ‌న క్లీన్‌గా ఉంటే సీబీఐ (CBI) విచార‌ణ‌కు ఇవ్వాల‌ని కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ డిమాండ్ చేశారు.

S

Telangana | Published On Oct 19, 2026, 1.11 pm IST

Manne Krishank | రేవంత్‌! మీరంత‌ క్లీన్‌గా ఉంటే సీబీఐ విచార‌ణ‌కు ఇవ్వండి
Advertisement
  • మీపై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై స‌మాధానం లేదు క‌దా
  • ఆధారాలు చూపిస్తున్నా స్పందిస్త‌లేవ్‌
  • రాష్ట్రంలో అనుముల గ్యాంగ్ రియల్ ఎస్టేట్ పెరిగి పోయింది
  • మీడియా స‌మావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ విమ‌ర్శ‌లు

Manne Krishank | త్రినేత్ర న్యూస్: సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తనపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పలేదని.. ఆయ‌న క్లీన్‌గా ఉంటే సీబీఐ (CBI) విచార‌ణ‌కు ఇవ్వాల‌ని కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ డిమాండ్ చేశారు. కొన్ని నెలల నుంచి రేవంత్ రెడ్డి ఆధారాలు బయట పెడుతున్నామ‌న్నారు. సీబీఐ విచారణకు ఆదేశిస్తే అన్ని ఆధారాలు సమర్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాష్ట్రంలో అనుముల గ్యాంగ్ రియ‌ల్ ఎస్టేట్ పెరిగిపోయింద‌ని ఆరోపించారు. కేసీఆర్, (KCR) కేటీఆర్ (KTR), హరీశ్‌రావు(Harish Rao)పై బురద చల్లుతున్నారని మండిప‌డ్డారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌తో ప్ర‌జ‌ల‌కు ఏం ఇబ్బంది అవుతుంద‌ని ప్ర‌శ్నించారు. సోమ‌వారం తెలంగాణ భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ రేవంత్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

తెలంగాణలో సీబీఐ రావాలంటే రేవంత్ రెడ్డి అనుమతి ఉండాలి. రేవంత్‌పై వస్తున్న ఆరోపణలపై సీబీఐ విచారణ చేయించాలి. కొండల్ రెడ్డి కంపెనీకి భూమి కేటాయించారు. అమెరికాలో రేవంత్ తమ్ముడి కంపెనీ స్వచ్ బయోతో ఒప్పందం కుదుర్చుకున్నారు. గీతా హ్యుందాయ్ షో రూమ్‌లు ప్రారంభిస్తున్నారు. మెడికోవ‌ర్‌కు సంబంధం లేకుంటే రేవంత్‌కు భ‌య‌మెందుకు?

50 వేల కోట్లు దోచుకున్నారు

ఎల్‌నినోపై రివ్యూ మీటింగ్ పెట్టుకుని మంత్రులు బర్త్ డే పార్టీలు చేసుకున్నారు. అక్టోబర్‌లో రివ్యూ మీటింగ్ పెట్టి రైతులు పంటలు వేయవద్దని అంటున్నారు. సూపర్ ఎల్‌నినో సొల్యూషన్ కేసీఆర్ ఫామ్‌హౌస్‌లోకి నీళ్లు వెళ్తున్నాయి. రెండున్నరేళ్లలో 50 వేల కోట్లు రేవంత్ రెడ్డి కుటుంబం దోచుకుంది. 22ఏ పేరుతో నిషేధిత భూముల దందా చేస్తున్నారు. రేవంత్ చిన్న తమ్ముడు కృష్ణారెడ్డి మరో పవర్ సెంటర్. ఎమ్మెల్యేలను బెదిరించడమే కాకుండా 22ఏ పేరుతో దందాలు చేస్తున్నారు.

చందనవల్లిలో సర్వే నంబర్ 363లో లావణి పట్టా నిషేధిత భూములను 363/3 భూమి 4 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయింది. కోతా శ్రీకాంత్ రెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్ అయింది. ఆర్ 9 కన్స్ట్రక్షన్ మంచిరేవుల విల్లాలో పేరుతో రిజిస్ట్రేషన్ అయింది. ఆర్ 9 కన్స్ట్రక్షన్ కంపెనీ ఓనర్ రేవంత్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూదాహారతికి పాల్పడుతోంది.

పొంగులేటిని రేవంత్ బెదిరించారు

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్ర ప్రభుత్వంపై విచారణ చేయదు. ఫార్మా,హెల్త్, డిఫెన్స్, స్కూల్స్, కార్ల కంపెనీ, భూములు వేటిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వదలడం లేదు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే మంత్రి పొంగులేటిని బెదిరించారు.

ఎవ‌రిచ్చినా క‌రెక్టే క‌దా!

ఫాహ్‌హౌస్ ల వద్దకు వెళ్లి కాంగ్రెస్ వాళ్లు ఏం చేశారు? కేసీఆర్ ఫామ్‌హౌస్ చుట్టూ అసైన్డ్ భూములు ఉన్నాయ‌ని దుష్ప్రచారం చేశారు. కేసీఆర్ ఫాహ్‌హౌస్‌తో ప్రజలకు ఇబ్బంది అయిందా? రేవంత్ రెడ్డి కుటుంబ దోపిడీకి ఎలాంటి శిక్ష వేయాలి? తెలంగాణలో రియల్ ఎస్టేట్ పడిపోయింది. అనుముల గ్యాంగ్ రియల్ ఎస్టేట్ పెరిగి పోయింది. 22ఏ పేరుతో ఎన్ని అరాచకాలు చేస్తున్నారో! 100 కోట్లతో రేవంత్ రెడ్డి సిరిసిల్లలో సభ పెట్టి కేటీఆర్‌కు హోటల్స్ ఉన్నాయని చెప్పారు. మాకు అధికారులు సమాచారం ఇవ్వడం లేదు. బాధితులు ఇస్తున్నారు
సమాచారం ఎవరు ఇచ్చినా కరెక్ట్ సమాచారం ఇచ్చినట్లే కదా! అని క్రిశాంక్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement