త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Arvind Kejriwal | దేశంలోనే అతిపెద్ద గ్యాంగ్‌స్టర్‌ను తమ అల్లుడిగా చేసుకున్నారు.. కేంద్రంపై కేజ్రీవాల్ విమర్శ‌లు

Arvind Kejriwal | నేర కార్యకలాపాలకు పాల్పడేందుకు ఓ గ్యాంగ్‌స్టర్‌కు కేంద్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించిందని ఆప్ జాతీయ క‌న్వీన‌ర్ అర‌వింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.

D

National | Published On Oct 19, 2026, 1.19 pm IST

Arvind Kejriwal | దేశంలోనే అతిపెద్ద గ్యాంగ్‌స్టర్‌ను తమ అల్లుడిగా చేసుకున్నారు.. కేంద్రంపై కేజ్రీవాల్ విమర్శ‌లు
Advertisement

Arvind Kejriwal | త్రినేత్ర న్యూస్ : బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ (Tiger Shroff)ను లక్ష్యంగా చేసుకుని జరిగిన కాల్పుల ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అర‌వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) స్పందించారు. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. నేర కార్యకలాపాలకు పాల్పడేందుకు ఓ గ్యాంగ్‌స్టర్‌కు కేంద్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించిందని ఆరోపించారు. ఈ మేర‌కు దేశంలో నేరాలు, భద్రత విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నిస్తూ ఎక్స్ వేదిక‌గా ట్వీట్ పెట్టారు.

ఇది కూడా చ‌ద‌వండి.. బాలీవుడ్ న‌టులే టార్గెట్‌.. ఇంత‌కీ ఎవ‌రీ లారెన్స్‌ బిష్ణోయ్

బీజేపీ సొంతంగా అధికారంలో ఉన్న‌ రాష్ట్రాల్లోనే శాంతిభ‌ద్ర‌త‌ల‌ను కాపాడ‌లేక‌పోతోంద‌న్నారు. దేశంలోనే అతిపెద్ద గ్యాంగ్‌స్టర్ (country's biggest gangster) అయిన లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi)ని త‌మ అల్లుడిగా ట్రీట్ చేస్తోంద‌ని వ్యాఖ్యానించారు. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా నేరాల‌కు పాల్ప‌డేందుకు అత‌డికి అన్ని ర‌కాల సౌక‌ర్యాలు కల్పిస్తోందని విమర్శించారు. పంజాబ్ రాష్ట్రంలో బీజేపీకి ఓటు వేస్తే గ్యాంగ్‌స్ట‌ర్‌ను ఆహ్వానించిన‌ట్లేన‌ని కేజ్రీ హెచ్చ‌రించారు. ఈ విష‌యం అక్క‌డి ప్ర‌జ‌ల‌కు బాగా తెలుసున‌ని పేర్కొన్నారు. "రేపు వీరు (బీజేపీ నేత‌ల‌ను ఉద్దుశించి) పంజాబ్‌కు వచ్చి శాంతిభద్రతలపై పాఠాలు చెబుతారు. వారికి ఓటు వేయడం అంటే వారి అల్లుడిని పంజాబ్‌కు ఆహ్వానించడమే అవుతుంది. ఈ విష‌యం పంజాబ్ ప్రజలకు బాగా తెలుసు" అని కేజ్రీవాల్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

Also Read..

బాలీవుడ్ న‌టులే టార్గెట్‌.. ఇంత‌కీ ఎవ‌రీ లారెన్స్‌ బిష్ణోయ్

సింగపూర్‌లో వైభవంగా బతుకమ్మ వేడుకలు.. టీసీఎస్​ఎస్​ బృందానికి హ‌రీశ్ రావు అభినంద‌న‌

రేవంత్‌! మీరంత‌ క్లీన్‌గా ఉంటే సీబీఐ విచార‌ణ‌కు ఇవ్వండి

Advertisement
Advertisement