MP Mallu Ravi | కొండా సురేఖ కనీసం మంత్రిగా ఖండించాల్సి ఉండే : ఎంపీ మల్లు రవి
MP Mallu Ravi | రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలవరం సృష్టించిన సంగతి తెలిసిందే.
MP Mallu Ravi | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలవరం సృష్టించిన సంగతి తెలిసిందే. సుష్మిత చేసిన వ్యాఖ్యలపై ఆమె తల్లి కొండా సురేఖ వివరణ ఇస్తూ కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవికి లేఖ రాశారు. ఈ వివరణపై ఎంపీ మల్లు రవి శనివారం స్పందించారు.
కొండా సురేఖ ఇచ్చిన వివరణ మీద ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సొంత కూతురు మాట్లాడిన మాటలు కనీసం మంత్రిగా ఖండించాలి. కానీ మంత్రి సహజ న్యాయ సూత్రాల ప్రకారం నాకు సంబంధం లేదని చెపుతున్నారు. చర్యలు ఎప్పుడు తీసుకుంటామో ఇప్పుడు చెప్పలేము అని మల్లు రవి స్పష్టం చేశారు.
చిన్నారెడ్డి వివరణను పరిశీలించాం..
క్రమశిక్షణా కమిటీ మూడు విషయాల మీద సుదీర్ఘంగా చర్చించాం. కొంతమంది ఎమ్మెల్యేలు క్రమశిక్షణ కమిటీకి రీపోర్ట్ ఇస్తామని చెప్పారు. అందరూ ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి మాట్లాడిన మాటలతో పాటు వీడియోలు పరిశీలించాం. చిన్నారెడ్డి మీద ఎమ్మెల్యే మెఘా రెడ్డి ఫిర్యాదు చేశారు. చిన్నారెడ్డి ఇచ్చిన వివరణ కూడా కమిటీ పరిశీలించడం జరిగింది. మెఘా రెడ్డిని మళ్లీ పిలిచి వివరణ తీసుకుంటామని మల్లు రవి తెలిపారు.
జూపల్లి దగ్గర వివరణ తీసుకున్నాం
ఆదిలాబాద్‌లో జరిగిన పొలిటికల్ ఎఫెక్స్ కమిటీ సమావేశంలో శ్రీనివాస్ రెడ్డికి సంజీవ రెడ్డికి జరిగిన వివాదంపై ఇప్పటికే షోకాజ్ నోటీసులు ఇచ్చాం. ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ముందే మాట్లాడారు. జూపల్లి దగ్గర వివరణ తీసుకున్నాం. ఈ కేసులో కూడా త్వరలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు.
అందుకే జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
జక్కిడి ప్రభాకర్ రెడ్డి.. ఎల్బీ నగర్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన మధు యాష్కి మీద అనుచిత వాఖ్యలు చేశారు. గాంధీ భవన్ వేదిక ద్వారా అనుచరులతో గొడవకు దిగాడు. అందుకే జక్కిడి ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేశామని మల్లు రవి పేర్కొన్నారు. ఇవే కాకుండా సిద్దిపేట, గజ్వేల్‌లో జరిగిన వివాదాలపై కూడా వివరణ కోరామని తెలిపారు.
రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను సుమోటోగా తీసుకోవాలా..? లేదా..?
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో ఒక ప్రోసిజర్ ప్రకారం ముందుకు వెళ్తాం. ఆయనపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు రాలేదు. ఆయన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకోవాలా..? లేదా..? అనేది పరిశీలిస్తున్నామని ఎంపీ మల్లు రవి స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Konda Surekha | రేవంత్‌పై సెటైర్లు.. కొండా సురేఖకు నోటీసులు.. ఎంటర్ అయిన ఓబీసీ సంఘాలు!
ఆగస్టు 22, 2026

బర్తరఫ్ చేస్తారా.. సైలెంట్ ఆపరేషన్ నడుపుతారా? కొండా వర్గంపై సీఎం రేవంత్ పొలిటికల్ స్కెచ్!
ఆగస్టు 22, 2026

“ఎవరొచ్చినా ఆపేదే లేదు!” – వరంగల్‌లో కొండా ఫ్యామిలీ ‘డబుల్ గేమ్’ వెనుక అసలు స్కెచ్ ఇదే!
ఆగస్టు 21, 2026
తాజావార్తలు
- ●Cambridge University | హైదరాబాద్‌ను గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చేందుకు మేం రెడీ.. మాటిచ్చిన కేంబ్రిడ్జ్
- ●Imperial College London | ఇంపీరియల్ కాలేజీతో తెలంగాణ సర్కార్ మెగా డీల్? లండన్ టూర్లో సీఎం సలహాదారు కీలక చర్చలు
- ●Vemula Prashanth Reddy | రెడ్డి సొసైటీ భూమిని రేవంత్‌రెడ్డి గుంజుకున్నడు.. ఆ 15 ఎకరాలను తిరిగి ఇవ్వాల్సిందే
- ●Harish Rao | జీవో 97ని తక్షణం రద్దు చేయాలి.. హరీశ్‌రావు డిమాండ్
- ●Jagtial Medical College Jobs | మెడికల్ ఫీల్డ్‌లో స్థిరపడాలని ఉందా? జగిత్యాల మెడికల్ కాలేజీలో 69 ఫ్యాకల్టీ పోస్టులకు ఇంటర్వ్యూ
- ●Immigration | విదేశీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. భౌతిక బోర్డింగ్ పాస్ అవసరం లేదు..

Cambridge University | హైదరాబాద్‌ను గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చేందుకు మేం రెడీ.. మాటిచ్చిన కేంబ్రిడ్జ్

Imperial College London | ఇంపీరియల్ కాలేజీతో తెలంగాణ సర్కార్ మెగా డీల్? లండన్ టూర్లో సీఎం సలహాదారు కీలక చర్చలు

Vemula Prashanth Reddy | రెడ్డి సొసైటీ భూమిని రేవంత్‌రెడ్డి గుంజుకున్నడు.. ఆ 15 ఎకరాలను తిరిగి ఇవ్వాల్సిందే

Harish Rao | జీవో 97ని తక్షణం రద్దు చేయాలి.. హరీశ్‌రావు డిమాండ్



