MP Chamala Kiran Kumar Reddy | నీట్ పరీక్ష రద్దు బాధ్యత కేంద్రానిదే: ఎంపీ చామల
MP Chamala Kiran Kumar Reddy | నీట్ పరీక్ష రద్దుకు నేషనల్ టెస్ట్ ఏజెన్సీ,సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ భాధ్యత వహించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.
రాజస్థాన్‌లో జరిగిన పేపర్ లీక్‌పై పూర్తి విచారణ జరిపించాలి
విద్యార్థుల అకడమిక్ ఇయర్ కోల్పోకుండా చర్యలు తీసుకోవాలి
భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి డిమాండ్
MP Chamala Kiran Kumar Reddy | త్రినేత్ర.న్యూస్: నీట్ పరీక్ష రద్దుకు నేషనల్ టెస్ట్ ఏజెన్సీ,సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ భాధ్యత వహించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. రాజస్థాన్ లో నీట్ పేపర్ లీకేజీ ఘటనపై కేంద్రం పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల అకడమిక్ ఇయర్ దెబ్బతినకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
విద్యార్థుల భవిష్యత్తు బీజేపీకి పట్టదా?
మే 3వ తేదీన జరిగిన నీట్ పరీక్షను రద్దు చేశారు. ఈ పరీక్ష రద్దుతో విద్యార్థులు తమ అకడమిక్ ఇయర్ ను కోల్పోయే అవకాశం ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం డబ్బులు ఖర్చు పెట్టి కోచింగ్ లు ఇప్పించి పరీక్ష రాయించారు. విద్యార్థుల భవిష్యత్తు, సామాన్యుడి అవసరం బీజేపీకి పట్టదా? నీట్ పరీక్ష రద్దుకు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి అని ఎంపీ చామల సూచించారు.
నీట్ పరీక్ష రద్దుపై బీజేపీ ప్రభుత్వం చర్చ చేపట్టాలి. దేశంలో అనేక విషయాలపై చర్చ చేసే బీజేపీ విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశంపై సమాధానం చెప్పాలి. ఆ పార్టీకి పాలనపై చిత్తశుద్ధి లేదు. రాజస్థాన్ లో నీట్ పేపర్ లీకేజీ ఘటనపై కేంద్రం పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి అని ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి అని డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026

CM Revanth Reddy | బండి భగీరథ్ సరెండర్ కాలేదు.. అరెస్టు చేశాం : సీఎం రేవంత్ రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



