MP Chamala Kiran Kumar Reddy | కాంగ్రెస్ తీసుకొచ్చిన రాజ్యాంగం వల్లే బండి సంజయ్‌కి పదవి : ఎంపీ చామల
MP Chamala Kiran Kumar Reddy | రాహుల్ గాంధీ ప్రధాని అవడం అంటే దేశానికి గ్రహణం పట్టినట్లు అని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
MP Chamala Kiran Kumar Reddy | త్రినేత్ర.న్యూస్ : రాహుల్ గాంధీ ప్రధాని అవడం అంటే దేశానికి గ్రహణం పట్టినట్లు అని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గాంధీ భవన్‌లో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
గతంలో గుజరాత్‌లో నరేంద్ర మోదీ పారచూట్ నాయకుడిగా వచ్చి సీఎం అయ్యారు. అమిత్ షా, మోదీ ఇద్దరు బిల్లా రంగాలు.. దేశాన్ని భ్రష్టు పట్టించారు. రాజ్యాంగ సంస్థలను జేబు సంస్థలుగా చేసి పరిపాలిస్తున్నారు. ఎన్నికల్లో మీకు పాస్ మార్కులు మాత్రమే వచ్చాయి. నితీష్, చంద్రబాబు లాంటి వారి వల్ల మీ ప్రభుత్వం కొనసాగుతుంది. 2009లో రాహుల్ ప్రధాని కావాలని మన్మోహన్ లాంటివారు కోరారు. మోదీలాగా ఎన్నికల్లో గెలవకున్నా.. సీఎం అయినట్లు... రాహుల్‌కు అవకాశం వచ్చినా పీఎం కాలేదు అని ఎంపీ చామల పేర్కొన్నారు.
బ్రిటీష్ పాలన తర్వాత దేశంలో కాంగ్రెస్ ఎన్నో సంస్కరణలు తెచ్చింది. కాంగ్రెస్ తీసుకొచ్చిన రాజ్యాంగం వల్లే ఈరోజు సామాన్యులకు పదవులు. బండి సంజయ్‌కి కూడా పదవి రావడానికి రాజ్యాంగమే కారణం. మీరు కొంతమంది కోసమే పనిచేస్తున్నారు. గత బీఆర్ఎస్ పాలనలో పదేళ్లు ఎలా దోచుకున్నారో కిషన్ రెడ్డికి తెలియనిది కాదు. రాష్ట్రాన్ని పదేళ్లు లూటీ జరగకుండా ఎందుకు ఆపలేదు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఎందుకు ఒక్కసారి కూడా మీరు పట్టించుకోలేదు ? గుజరాత్ లో సబర్మతి నదిని అభివృద్ధి చేసినప్పుడు మేయర్‌గా కాంగ్రెస్ ఉన్నా.. మంచి పనికి మేము మద్దతు ఇచ్చాం. మేము మూసీని డెవలప్ చేస్తమంటె ఎందుకు అడ్డుకుంటున్నారు అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నిలదీశారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



