MLA Megha Reddy | చిన్నారెడ్డి వెన్నుపోటు పొడిచారు.. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి సంచలన వ్యాఖ్యలు
MLA Megha Reddy | తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచారంటూ వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
MLA Megha Reddy | వనపర్తి : తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచారంటూ వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గంలో పలు గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల ఓటమికి చిన్నారెడ్డినే కారణం అని మేఘారెడ్డి ఆరోపించారు. తనకు, ఎంపీ మల్లు రవికి చిన్నారెడ్డి తీరని నష్టం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో జరిగిన నష్టంపై కాంగ్రెస్ అధిష్టానానికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తానని మేఘారెడ్డి పేర్కొన్నారు. వనపర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మేఘా రెడ్డి శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడారు.
వనపర్తి నియోజకవర్గంలోని 140 పంచాయతీల్లో 85 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నట్లు మేఘా రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ 51 గ్రామ పంచాయతీల్లో గెలిచింది. అయితే 15 గ్రామాల్లో మాజీ మంత్రి చిన్నారెడ్డి కావాలనే కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచారని ఆయన ఆరోపించారు. ఈ గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు. వారినే గెలిపించాలని ఆయా గ్రామాల్లోనే నేతలకు చిన్నారెడ్డి సూచించినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు మేఘా రెడ్డి. ఈ ఆధారాలతో కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. తగిన సమయంలో చిన్నారెడ్డికి బుద్ధి చెప్పడం ఖాయం. ఆయనకు పార్టీ ఏం తక్కువ చేసిందని కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించారని మేఘా రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
సంబంధిత వార్తలు

N Ramachander Rao | మోదీ నేపథ్యం.. కాంగ్రెస్‌కు ఎప్పుడూ కంటగింపే : ఎన్ రామచందర్ రావు
మే 20, 2026

MP Vaddiraju | బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు : ఎంపీ వద్దిరాజు
మే 20, 2026

Adluri Laxman | బీజేపీ ఆదేశాల పార్టీ.. కాంగ్రెస్ ప్రజాస్వామ్య పార్టీ.. ధర్మపురి అరవింద్‌కు మంత్రి అడ్లూరి చురక
మే 19, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



