త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Matta Ragamai | ప్రజాసేవలో భాగస్వామ్యం.. భగవంతుడిచ్చిన వరం : ఎమ్మెల్యే మ‌ట్టా రాగ‌మ‌యి

MLA Matta Ragamai | ఖ‌మ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది.

S

Telangana | Published On Mar 12, 2026, 3.37 pm IST

MLA Matta Ragamai | ప్రజాసేవలో భాగస్వామ్యం.. భగవంతుడిచ్చిన వరం : ఎమ్మెల్యే మ‌ట్టా రాగ‌మ‌యి
Advertisement

ప్రజా ప్రతినిధులకు ప్రజా సేవే తొలి ప్రాధాన్యం ఉండాలి..
ఎన్నికల వరకే రాజకీయాలు, గెలిచిన తర్వాత ప్రజల సేవకులం..

MLA Matta Ragamai | త్రినేత్ర‌.న్యూస్ : ఖ‌మ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మట్టా రాగమయి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర్ రావు, జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు హాజరయ్యారు.

కొత్తగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు మనకు ప్రజా ప్రతినిధులుగా ప్రజలకు సేవ చేసే ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. మనం రాజకీయాల్లోకి వచ్చినపుడు ప్రజల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోయే పనులు చేయాలి. మనం చేసే పని, మనం లేకున్నా నాలుగు కాలాల పాటు మన గురించి గొప్పగా చెప్పుకునేలా ఉండాలి అని ఎమ్మెల్యే అన్నారు.

గ్రామ పంచాయతీల బలోపేతం కోసం ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. కొద్ది రోజుల్లోనే పంచాయతీల ఖాతాల్లోకి గణనీయంగా నిధులు జమ అయ్యాయి. ఈ నిధులను ఒక ప్రణాళికాబద్ధంగా, ప్రజలకు ఉపయోగపడే పనుల కోసం వినియోగించాలి. మన సొంత డబ్బును ఎంత జాగ్రత్తగా వాడుకుంటామో.. ప్రజా ధనాన్ని కూడా అంతే బాధ్యతగా కాపాడుతూ అభివృద్ధి పనులు చేపట్టాలి. నిధులకు ప్రజాప్రతినిధులు 'కాపలాదారులుగా' ఉండి, చట్టపరిధిలో ప్రతి పైసాను గ్రామాభివృద్ధికి, పేదల సంక్షేమానికి ఖర్చు చేయాలి. డబ్బుతో అయ్యే పనులకు నిధులు వినియోగించాలి, కానీ కొన్ని సమస్యలు కేవలం సమయస్ఫూర్తితో పరిష్కారమవుతాయి. వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి అని ఎమ్మెల్యే మట్టా రాగమయి పేర్కొన్నారు.

వేసవి కాలం దృష్ట్యా, గ్రామాలలో మరియు డివిజన్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో త్రాగునీటి సమస్య తలెత్తకుండా చూసుకోవాలి. మురుగునీరు రోడ్ల మీద నిలవకుండా డ్రైనేజీ పైప్‌లైన్ల నిర్వహణ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వీడాల్సిన అవసరం ఉంది. ఎన్నికల వరకే రాజకీయాలు, గెలిచిన తర్వాత మనమంతా ప్రజల సేవకులం మాత్రమే. రాజకీయాలకు అతీతంగా అభివృద్ది చేయాలి. ఏ పార్టీ, ఏ జెండా అనేది ముఖ్యం కాదు, ప్రజలకు మంచి చేశామా లేదా అనేదే ముఖ్యం. అధికారులు కూడా ప్రజాప్రతినిధులకు సరైన సలహాలు ఇస్తూ, ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. సర్పంచులకు అవగాహన కల్పించేందుకు కలెక్టర్లు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి, నిధులు సద్వినియోగం అయ్యేలా చూడాలి. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా, ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రతి పేదవాడికి చేర్చడమే ప్రజాప్రతినిధులందరి లక్ష్యం. ప్రభుత్వం చేపట్టిన ఈ 99 రోజుల ప్రణాళికలో అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలి అని ఎమ్మెల్యే మట్టా రాగమయి తెలిపారు.

Advertisement
Advertisement