త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mandula Samuel | బండి సంజ‌య్‌పై అట్రాసిటీ కేసు పెడుతా.. మందుల సామేల్ హెచ్చ‌రిక‌

Mandula Samuel | కేంద్ర మంత్రి బండి సంజ‌య్ న‌న్ను టార్గెట్ చేస్తే ఊరుకునే ప్ర‌సక్తే లేద‌ని తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ హెచ్చ‌రించారు. బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గంపై తాను చేసిన వ్యాఖ్య‌ల‌పై మందుల సామేల్ వివ‌ర‌ణ ఇచ్చారు.

S

Telangana | Published On Mar 16, 2026, 12.51 pm IST

Mandula Samuel | బండి సంజ‌య్‌పై అట్రాసిటీ కేసు పెడుతా.. మందుల సామేల్ హెచ్చ‌రిక‌
Advertisement

Mandula Samuel | త్రినేత్ర‌.న్యూస్ : కేంద్ర మంత్రి బండి సంజ‌య్ న‌న్ను టార్గెట్ చేస్తే ఊరుకునే ప్ర‌సక్తే లేద‌ని తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ హెచ్చ‌రించారు. బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గంపై తాను చేసిన వ్యాఖ్య‌ల‌పై మందుల సామేల్ వివ‌ర‌ణ ఇచ్చారు.

నేను బ్రాహ్మణ సోదరులను ఉద్దేశించి ఆ మాటలు అనలేదు. అవి అనుకోకుండా అన్న మాటలు మాత్రమే. నా వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతం. వాటితో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. తుంగతుర్తికి వచ్చి నన్ను ఓడిస్తానంటున్న బండి సంజయ్‌‌కు అక్కడ బీజేపీకి వచ్చిన ఓట్లు ఎన్నో తెలుసా? కేవలం రెండు వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. మాదిగలు అంటే బండి సంజయ్‌‌కి అంత చిన్నచూపా?. బ్రాహ్మణులను కించపరిచాననే నెపంతో తనపై కేసు పెడతానంటున్న బండి సంజయ్‌‌పై తాను ‘అట్రాసిటీ’ కేసు పెడతానని సామేల్ హెచ్చరించారు. బ్రాహ్మణులపై అంత ప్రేముంటే కేంద్రం నుంచి నిధులు తెచ్చి పేద బ్రాహ్మణులను ఆదుకోవాలని మందుల సామేల్ సవాల్ విసిరారు.

Advertisement
Advertisement