Adi Srinivas | కాళేశ్వరం ద్వారా చుక్క నీరు తీసుకోలేదు : ఆది శ్రీనివాస్
Adi Srinivas | కాళేశ్వరం ద్వారా చుక్క నీరు తీసుకోకుండానే రికార్డు స్థాయిలో వరి ధాన్యం పండించామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. అంతేకాకుండా యాసంగి పంటకు సంబంధించి రైతులకు 22న రైతు భరోసా జమ చేయబోతున్నామని ఆయన తెలిపారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు కలగజేసుకుని.. రైతుబంధు ఇప్పుడు కూడా ఇస్తరో, ఇవ్వరో అని ఎద్దెవా చేశారు.
Adi Srinivas | త్రినేత్ర.న్యూస్ : కాళేశ్వరం ద్వారా చుక్క నీరు తీసుకోకుండానే రికార్డు స్థాయిలో వరి ధాన్యం పండించామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. అంతేకాకుండా యాసంగి పంటకు సంబంధించి రైతులకు 22న రైతు భరోసా జమ చేయబోతున్నామని ఆయన తెలిపారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు కలగజేసుకుని.. రైతుబంధు ఇప్పుడు కూడా ఇస్తరో, ఇవ్వరో అని ఎద్దెవా చేశారు.
ఈ క్రమంలో ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మీ హయాంలో వరి వేసుకుంటే ఉరి అన్నరు. మేం అలా కాదు.. వడ్లు పండించే రైతులకు రూ. 500 బోనస్ ఇచ్చాం. రైతులకు కానీ, కౌలు రైతులకు కానీ మీ హయాంలో రైతుబంధు ఒక్కటే ఇచ్చారు. ఇదే జిందా తిలిస్మాత్ అనుకోమని చెప్పారు. కానీ మేం రైతుభరోసా, పనిముట్లు ఇస్తున్నాం, 500 బోనస్ ఇస్తున్నాం. రైతులకు ప్రయోజనం చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే. దీన్ని రైతులు గమనిస్తున్నారు. రైతుల మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో గెలిచామని ఆది శ్రీనివాస్ తెలిపారు.
అబద్దాలు ఆడి రైతులను తప్పుదోవ పట్టించాలనుకుంటే ప్రజలు మిమ్మల్ని విశ్వసించరు. కాళేశ్వరం నుంచి చుక్క నీరు తీసుకోలేదు. అయినా కూడా మా ప్రభుత్వం 71 లక్షల 86 వేల మెట్రిక్ ట్ననుల వరి ధాన్యం పండించాం. ఇందులో 39 లక్షల 8 వేల మెట్రిక్ టన్నులు సన్నరకం. కాళేశ్వరం ద్వారా చుక్క నీరు లేకున్నా ఎల్లపల్లిం ద్వారా నీరు తీసుకుని వరి ధాన్యం పండించాం. ఇది దేశంలోనే రికార్డు అని ఆయన పేర్కొన్నారు.
మీరు కట్టిన కాళేశ్వరం ఒక్కటి కూడా కూలిపోయింది. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీశైలం, ఎంఎండీ, శ్రీరాంసాగర్, జూరాల ఇవన్నీ సేవలందిస్తున్నాయి. నాణ్యత లేని కట్టడం కట్టారు. ధరణి ద్వారా రైతులకు అన్యాయం జరిగింది. ఆత్మహత్యలు చేసుకున్నారు. భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి తీసుకొచ్చాం. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు యత్నిస్తున్నాం. ప్రతిపక్ష సభ్యులు ఉలికిపడడం సరికాదు. నిజాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. పదేండ్లలో రేషన్ కార్డులు ఇవ్వలేదు. 15 లక్షల 12 వేల మంది కొత్త రేషన్ కార్డులు అందించాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క పనితీరు. తెల్లరేషన్ కార్డు లబ్దిదారులకు ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం ఇస్తున్నాం. 3 కోట్ల 38 లక్షల మందికి ఆహార భద్రత కల్పిస్తున్నాం అని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026

CM Revanth Reddy | బండి భగీరథ్ సరెండర్ కాలేదు.. అరెస్టు చేశాం : సీఎం రేవంత్ రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



