త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jeevan Reddy | జీవ‌న్ రెడ్డి పార్టీ మార్పు ఖాయం.. సంకేతాలివే..!

Jeevan Reddy | కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి పార్టీ మారడం ఖాయ‌మ‌నిపిస్తోంది. ఎందుకంటే జ‌గిత్యాల‌లోని ఆయ‌న క్యాంపు ఆఫీసు వ‌ద్ద చోటు చేసుకున్న వాతావ‌ర‌ణ‌మే.

S

Telangana | Published On Mar 16, 2026, 7.23 pm IST

Jeevan Reddy | జీవ‌న్ రెడ్డి పార్టీ మార్పు ఖాయం.. సంకేతాలివే..!
Advertisement

Jeevan Reddy | త్రినేత్ర‌.న్యూస్ : కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి పార్టీ మారడం ఖాయ‌మ‌నిపిస్తోంది. ఎందుకంటే జ‌గిత్యాల‌లోని ఆయ‌న క్యాంపు ఆఫీసు వ‌ద్ద చోటు చేసుకున్న వాతావ‌ర‌ణ‌మే. క్యాంపు కార్యాల‌యం వ‌ద్ద కాంగ్రెస్ పార్టీ గుర్తుల‌తో, నేత‌ల‌తో ఏర్పాటు చేసిన భారీ ప్లెక్సీల‌ను తొల‌గిస్తున్నారు. కార్యాల‌యం లోప‌ల కూడా కాంగ్రెస్‌కు సంబంధించిన ఫ్లెక్సీల‌ను, ఫొటోల‌ను తొల‌గిస్తున్నారు. ఇవ‌న్నీ జీవ‌న్ రెడ్డి క‌ళ్లెదుటే జ‌రుగుతున్నాయి. అయినా కూడా ఫ్లెక్సీల తొల‌గింపుపై జీవ‌న్ రెడ్డి ఎవ‌ర్నీ మంద‌లించ‌లేదు. అంటే జీవ‌న్ రెడ్డి పార్టీ మార‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. ఏ పార్టీలో చేరుతార‌న్న వార్త‌ల‌పై ఇప్ప‌టికీ స్ప‌ష్ట‌త లేదు. జీవ‌న్ రెడ్డి కూడా ఈ విష‌యంపై అధికారికంగా స్పందించ‌లేదు. అయితే కాంగ్రెస్ పార్టీని వీడి కారెక్కుతార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో ట‌చ్‌లోకి వెళ్లిన‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీలో త‌న‌కు తీవ్ర అన్యాయం జ‌రిగింద‌ని, రేవంత్ ప్ర‌భుత్వంపై జీవ‌న్ రెడ్డి ప‌లు సంద‌ర్భాల్లో విమ‌ర్శ‌లు చేస్తూ వ‌చ్చారు. పార్టీ రంగుకు, గుర్తుకు రాం రాం అంటూ కార్యకర్తలతో జీవన్ రెడ్డి వ్యాఖ్యానించిన‌ట్లు స‌మాచారం.

జీవ‌న్ రెడ్డి పార్టీ నుంచి వెళ్లాల‌ని ఎవ‌రు కోరుకోవ‌డం లేదు..

ఇక జీవ‌న్ రెడ్డి పార్టీ మారుతున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌పై జ‌గిత్యాల ఎమ్మెల్యే డాక్ట‌ర్ సంజ‌య్ కూడా చిట్ చాట్ చేశారు. జీవన్ రెడ్డి పార్టీ నుంచి వెళ్లాలని ఎవరు కోరుకోవడం లేదు. గతంలో రమణతో కలిసి పని చేశా.. అలాగే జీవన్ రెడ్డితో కలిసి పని చేస్తాను. ఎల్.రమణలాంటి వారికి మంత్రి పదవి ఇవ్వాల్సింది. అలాంటి తప్పిదాలు చేయడం వల్లనే బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాలేదు అని ఎమ్మెల్యే సంజ‌య్ పేర్కొన్నారు.

https://x.com/TeluguScribe/status/2033532132233290050

Advertisement
Advertisement