త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jeevan Reddy | రేపు ఉ. 10 గంట‌ల‌కు నా నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తా : జీవ‌న్ రెడ్డి

Jeevan Reddy | ఈ నెల 25వ తేదీన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తాన‌ని మాజీ మంత్రి, సీనియ‌ర్ నేత జీవ‌న్ రెడ్డి ఇప్ప‌టికే అధికారికంగా ప్ర‌క‌టించారు. తాజాగా మ‌రో ప్ర‌క‌ట‌న చేశారు.

S

Telangana | Published On Mar 24, 2026, 12.09 pm IST

Jeevan Reddy | రేపు ఉ. 10 గంట‌ల‌కు నా నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తా : జీవ‌న్ రెడ్డి
Advertisement

Jeevan Reddy | త్రినేత్ర‌.న్యూస్ : ఈ నెల 25వ తేదీన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తాన‌ని మాజీ మంత్రి, సీనియ‌ర్ నేత జీవ‌న్ రెడ్డి ఇప్ప‌టికే అధికారికంగా ప్ర‌క‌టించారు. తాజాగా మ‌రో ప్ర‌క‌ట‌న చేశారు. రాజ‌కీయంగా త‌న భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై బుధ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టిస్తాన‌ని జీవ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. టీ పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్య‌ద‌ర్శి స‌చిన్ సాకేవ‌త్, విప్ ఆది శ్రీనివాస్ ఇవాళ ఉద‌యం స‌మావేశమ‌య్యారు. వీరితో స‌మావేశం ముగిసిన అనంత‌రం జీవ‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

తన సమస్య పరిష్కారం కానిదిగా మారిపోయింది. సమస్యకు పరిష్కారం వారి వద్ద లేదు.. నా వద్ద కూడా లేదు. కాంగ్రెస్‌ పార్టీ మారటం ఇబ్బందికరంగా ఉంది. రేపు ఉదయం 10 గంటలకు నా నిర్ణయాన్ని ప్రకటించబోతున్నా. రాజీనామా చేసిన తర్వాత నియోజకవర్గ ప్రజలను కలుస్తాను. ఇన్నాళ్లు కలిసి ఉండి వీడిపోవటం బాధకరంగా ఉంది. తదుపరి భవిష్యత్‌ నిర్ణయం ఎలా ఉంటుందో నాకు తెలియదు. కర్మసిద్ధంతం ఎటువైపు తీసుకెళుతుందో వేచి చూడాల‌ని జీవ‌న్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement