Harish Rao | సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం.. తెలంగాణకు దక్కిన గౌరవం: హరీశ్ రావు
Harish Rao | ఆస్తుల కంటే స్థిర అస్తిత్వమే తన ప్రాణంగా భావించి తెలంగాణ సాహిత్యం కోసం నందిని సిధారెడ్డి (Nandini Siddha Reddy) పనిచేశారని బీఆర్ఎస్ ఎల్పీ ఉప నేత హరీశ్ రావు (Harish Rao) అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నత స్థాయి పదవి ఇస్తామన్నా తీసుకోలేదని గుర్తు చేశారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్: ఆస్తుల కంటే స్థిర అస్తిత్వమే తన ప్రాణంగా భావించి తెలంగాణ సాహిత్యం కోసం నందిని సిధారెడ్డి (Nandini Siddha Reddy) పనిచేశారని బీఆర్ఎస్ ఎల్పీ ఉప నేత హరీశ్ రావు (Harish Rao) అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నత స్థాయి పదవి ఇస్తామన్నా తీసుకోలేదని గుర్తు చేశారు. నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం లభించిన సందర్బంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళా నిలయంలో నిర్వహించిన పౌర సన్మాన కార్యక్రమంలో హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. `తెలంగాణ తల్లి అస్తిత్వం ముఖ్యమని రాష్ట్ర ప్రభుత్వం తనకు ప్రకటించిన కోటి రూపాయల నగదుతో పాటు 300 గజాల స్థలాన్ని తిరస్కరించిన గొప్ప వ్యక్తి సిధారెడ్డి. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఉద్యమకారులను కవులు, కళాకారులను తెలంగాణ ఉద్యమం వైపు మళ్లించారు. ఆయన పాటలు తెలంగాణ ఉద్యమానికి ఎంతో ఊపిరిపోశాయి. సిధారెడ్డి గారికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం రావడం తెలంగాణతో పాటు సిద్దిపేట ప్రాంతానికి దక్కిన గౌరవం.
ఆస్తుల కంటే స్థిర అస్తిత్వమే తన ప్రాణంగా భావించి నందిని సిధారెడ్డి గారు తెలంగాణ సాహిత్యం కోసం పనిచేశారు. కేసీఆర్ సీఎం అయ్యాక ఉన్నత స్థాయి పదవి ఇస్తానంటే తీసుకోకుండా సాహిత్య రంగంలో జరగాల్సింది ఇంకా చాలా ఉంది సాహిత్య అకాడమీ ఏర్పాటు చేసి తనకు బాధ్యతలు ఇవ్వాలని కోరారు. దీంతో కేసీఆర్ సాహిత్య అకాడమీ ఏర్పాటు చేసి సిధారెడ్డికి బాధ్యతలు అప్పగించడంతో ప్రపంచంలోనే తెలుగు మహాసభలు హైదరాబాద్‌లో ఎంతో అద్భుతంగా నిర్వహించారు.
ఆంధ్ర వారే ఈ తెలుగు మహాసభలు నిర్వహించవచ్చని తెలంగాణ వారికి తెలుగు మహాసభలు నిర్వహించరాదని సృష్టించిన అపోహాలను తొలగించి ఎంతో గొప్పగా మహాసభలు నిర్వహించారు. నందిని సిధారెడ్డి గారు పొగడ్తలు, సన్మానాలకు దూరంగా ఉంటూ సాహిత్యం కోసం ప్రజల కోసం ఎంతో పని చేశారు. ఆయన గురించి ఎంత చెప్పినా ఇంకా చెప్పాల్సింది చాలా ఉంటుంది.. ఆనాటి కాలంలో ఫేక్ ఎన్కౌంటర్లు, రైతుల ఆత్మహత్యలు, అంటరానితనం, మద్యపాన నిషేధం, నీటి గోస,వలసలు ఇలా అనేక రంగాల్లో పుస్తకాలు రాసి ప్రజలకు చైతన్యం కల్పించారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



