త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Garima Agrawal | లారీల సంఖ్యను మరింత పెంచాలి.. క‌లెక్ట‌ర్ గ‌రిమ అగ్ర‌వాల్ ఆదేశం

Garima Agrawal | కొనుగోలు కేంద్రాల నుంచి దాస్యం తరలించేందుకు ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్ట‌ర్లు లారీల సంఖ్యను మరింత పెంచాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రంలో కలెక్టర్, ఎస్పీ మహేష్ బి గితే, జిల్లా అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు.

P

Telangana | Published On May 19, 2026, 8.01 pm IST

Garima Agrawal | లారీల సంఖ్యను మరింత పెంచాలి.. క‌లెక్ట‌ర్ గ‌రిమ అగ్ర‌వాల్ ఆదేశం
Advertisement

Garima Agrawal | కొనుగోలు కేంద్రాల నుంచి దాస్యం తరలించేందుకు ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్ట‌ర్లు లారీల సంఖ్యను మరింత పెంచాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రంలో కలెక్టర్, ఎస్పీ మహేష్ బి గితే, జిల్లా అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ధాన్యం ఎంత వచ్చింది? ఇప్పటిదాకా ఎంత కొనుగోలు చేశారో జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆరా తీశారు. తరలించేందుకు సిద్ధంగా ఉన్న ధాన్యం సంచుల కోసం మరిన్ని వాహనాలను సమకూర్చాలని ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్ట‌ర్ల‌ను ఆదేశించారు.

రైతుల‌కు ఇబ్బంది లేకుండా చూడాల‌ని సూచించారు. అలాగే, ఇల్లంతకుంట మండలం చింతలకుంట పల్లె గ్రామంలోని శ్రీలక్ష్మీసాయి రైస్ ఇండస్ట్రీస్‌లో కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గితే, జిల్లా అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ధాన్యం లక్ష్యం కేటాయింపు ఎంత? ఇప్పటి వరకు ఎంత అన్ లోడ్ చేశారు? ఏ ఏ మండలాల నుంచి ధాన్యం వస్తుందో ఆరా తీశారు. హమాలీల సంఖ్యను పెంచి.. అన్ లోడింగ్ వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పరిశీలనలో డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, డీసీఎస్ఓ బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, డీసీఓ రామకృష్ణ, తహసీల్దార్ సురేష్, ఎంపీడీఓ శశికళ పాల్గొన్నారు.

Advertisement
Advertisement