Cold Wave | అబ్బబ్బా….. హైదరాబాద్ వెన్నులో వణుకు పుడుతున్నది…
Cold Wave | తెలంగాణ వ్యాప్తంగా చలి చంపేస్తోంది. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో చలి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. రాత్రి వేళల్లోనే కాకుండా పగటి పూట కూడా చల్లని గాలులు వీస్తుండడంతో ఆయా ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు.
Cold Wave | హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా చలి చంపేస్తోంది. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో చలి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. రాత్రి వేళల్లోనే కాకుండా పగటి పూట కూడా చల్లని గాలులు వీస్తుండడంతో ఆయా ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. మరి ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో శుక్రవారం ఉదయం ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏరియాలో 6.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, మౌలాలి ఏరియాలో 7.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
ఈ చలి తీవ్రతకు హైదరాబాదీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చల్లని గాలులు రోజు వారి పనులకు తీవ్ర ఆటంకాన్ని కలిగిస్తున్నాయి. చల్లని గాలుల నేపథ్యంలో పేపర్ బాయ్స్, పాల వ్యాపారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అనారోగ్యాలకు గురైతున్నట్లు వాపోయారు. తెల్లవారుజామునే ఉద్యోగాలకు వెళ్లే వారు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. మార్నింగ్ వాకర్స్ కూడా బయటకు రాని పరిస్థితి ఏర్పడింది. దీంతో పార్కులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఉదయం 9 గంటల తర్వాత కాస్త ఎండ కొడుతుండడంతో ఆ సమయంలో బయటకు వస్తున్నారు. ఇదే పరిస్థితి మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఇక రాజేంద్రనగర్‌లో 7.7, శివరాంపల్లిలో 8.8, అల్వాల్‌లో 9.0, గచ్చిబౌలిలో 9.1, బొల్లారంలో 9.3, వెస్ట్ మారేడ్‌పల్లిలో 10.1, కుత్బుల్లాపూర్‌లో 10.2, జీడిమెట్లలో 11.0, బేగంపేట్‌లో 11.1, బీహెచ్ఈఎల్‌లో 11.2, నేరెడ్‌మెట్‌లో 11.2, పటాన్‌చెరులో 11.4, బోయిన్‌పల్లిలో 11.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



