త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Srinivas Goud | పాద‌యాత్ర భ‌యంతోనే పాల‌మూరు ప్రాజెక్టుల‌పై సీఎం రివ్యూ: మాజీ మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్

Srinivas Goud | పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ పాదయాత్ర అనగానే హడావుడి స్టార్ట్ చేశారని, వెంటనే సీఎం రేవంత్‌ రివ్యూ చేశారని మాజీ మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ విమ‌ర్శించారు. ఆదిత్య నాథ్‌ దాస్ తో తెలంగాణకు నష్టం జరుగుతోందన్నారు. ఇరిగేష‌న్ స‌ల‌హాదారుగా సీఎంకు ఇంకెవ‌రూ దొర‌క‌లేదా అని ప్ర‌శ్నించారు.

S

Telangana | Published On May 21, 2026, 1.20 pm IST

Srinivas Goud | పాద‌యాత్ర భ‌యంతోనే పాల‌మూరు ప్రాజెక్టుల‌పై సీఎం రివ్యూ: మాజీ మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్
Advertisement
  • ఇరిగేష‌న్ అధికారులు లేకండా రివ్యూ చేస్తే ఏం లాభం?
  • ఆరునెల‌ల్లోనే పాల‌మూరు-రంగారెడ్డిని పూర్తి చేసి నీళ్లివ్వాలి
  • మీరు ఏం చేశారో పాద‌యాత్ర చేసి చూపించండి
  • జ‌న‌వ‌రిలోనే జూరాల ఎండిపోయింది.. రేవంతేమో నీళ్లిస్తాం అంటుండు
  • ఆదిత్య నాథ్‌ దాస్ తో తెలంగాణకు నష్టం జరుగుతోంది
  • సీఎం రేవంత్ రెడ్డికి ఇరిగేషన్ సలహాదారుగా ఇంకెవ‌రూ దొరకలేదా?
  • కేంద్రంలో టీడీపీ అనుకూల ప్ర‌భుత్వం ఉంద‌ని ఏపీకి అనుకూల నిర్ణ‌యాలు తీసుకుంటారా?
  • ఢిల్లీలో తెలంగాణ అనుకూల గొంతులు లేక‌పోవ‌డం వ‌ల్లే ఈ అన్యాయం
  • మీడియా స‌మావేశంలో సీఎం రేవంత్‌పై మాజీ మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ ఫైర్‌

Srinivas Goud | త్రినేత్ర‌.న్యూస్: పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ పాదయాత్ర అనగానే హడావుడి స్టార్ట్ చేశారని, వెంటనే సీఎం రేవంత్‌ రివ్యూ చేశారని మాజీ మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ విమ‌ర్శించారు. ఇరిగేషన్ అధికారులు లేకుండా సీఎం రివ్యూ చేస్తే ఏం లాభం అని ప్ర‌శ్నించారు. గురువారం తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆదిత్య నాథ్‌ దాస్ తో తెలంగాణకు నష్టం జరుగుతోందన్నారు. ఇరిగేష‌న్ స‌ల‌హాదారుగా సీఎంకు ఇంకెవ‌రూ దొర‌క‌లేదా అని ప్ర‌శ్నించారు.

రెండున్నరేళ్లలో రివ్యూల మీద రివ్యూలు చేస్తున్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుతోనే మా బ‌తుకులు ముడిపడి ఉన్నాయి. రైతు బంధు లేదు, విత్తనాలు సరిగా ఇవ్వడం లేదు. పాలమూరు జిల్లా నాశనం కావాలా? పాలమూరు జిల్లాలో ఒక్క ఎకరా ఎండిపోకుండా కేసీఆర్ ప్రాజెక్టులను డిజైన్ చేశారు

98 శాతం బీఆర్ఎస్ హ‌యాంలో పూర్తి చేశాం..

మేము బ‌రాబర్ పాదయాత్ర చేస్తాం. మేము చేసిన పనులను ప్రజలకు చూపిస్తాము. కాంగ్రెస్ ఏం చేసిందో మీరు పాదయాత్ర చేసి చూపించండి. పాలమూరు, రంగారెడ్డి ద్వారా ప్రజలకు నీళ్లు ఇవ్వాల్సిందే. నార్లాపూర్, ఏదుల రిజర్వాయర్లు 95 శాతం పూర్త‌య్యాయి. కాలువలు దాదాపు 98 శాతం బీఆర్ఎస్ హయాంలో పూర్తి చేశాం. కాంగ్రెస్ వచ్చిన తర్వాత టెండర్లు క్యాన్సల్ చేశారు. ఏపీలో చీఫ్ సెక్రెటరీగా పని చేసిన ఆదిత్య నాథ్‌ దాస్ ను సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఇరిగేషన్ సలహాదారుగా పెట్టుకున్నారు. తెలంగాణ, ఏపీ విభజన నీళ్లు, ఉద్యోగాల కోసం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డికి ఇరిగేషన్ సలహాదారుగా ఎవరూ దొరకలేదా అని మాజీ మంత్రి నిల‌దీశారు.

త్వ‌ర‌లో పాద‌యాత్ర తేదీని ప్ర‌క‌టిస్తాం..

మా పాదయాత్ర జూన్ లో ఉంటుంది. త్వరలోనే తేదీ ప్రకటిస్తాం. నార్లాపూర్ నుంచి ఉద్దండాపూర్ వరకు మా పాదయాత్ర ఉంటుంది. జనవరిలోనే జూరాల ఎండిపోయింది. జూరాల నుంచి నీళ్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. శ్రీశైలం నుంచి మే నెలలో నీళ్లు లిఫ్ట్ చేసుకోవచ్చు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు టెండర్లను రీ కాల్ చేయండి. ఏపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక్కట‌య్యాయి. ఎస్.ఎల్.బి.సి టన్నెల్ లో చనిపోయిన వారి జాడ ఇప్పటికీ తెలవ‌దు. సీఎం రేవంత్ రెడ్డిని చరిత్ర క్షమించదు అని శ్రీ‌నివాస్‌గౌడ్ ఫైర‌య్యారు.

బాధ్య‌త లేనివారికి ప్రేమ అర్థం కాదు..

పాలమూరు జిల్లా ప్రజలు కాంగ్రెస్ పార్టీ నేతలను ప్రశ్నించాలి. తెలంగాణపై బాధ్యత లేని వ్యక్తులకు ప్రేమ అర్ధం కాదు. వచ్చే ఆరు నెలల్లో పాలమూరు, రంగారెడ్డిని పూర్తి చేయాలి. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు అనుమతులకు గోదావరి-కావేరి లింక్ ప్రాజెక్టుతో లింక్ పెట్టడం తెలంగాణ పాలిట ద్రోహమే అవుతుంది. కేంద్రంలో టీడీపీ అనుకూల ప్రభుత్వం ఉందని ఏపీకి అనుకూల నిర్ణయాలు తీసుకుంటారా? బీఆర్ఎస్ కు ఐదుగురు ఎంపీలు ఉంటే తెలంగాణకు ఇంత అన్యాయం జరిగేదా? ఢిల్లీలో తెలంగాణ అనుకూల గొంతులు లేకపోవడం వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోంది అని మాజీ మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ ఆవేద‌న వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement