Disha Patani | నిన్న కృతి సనన్.. నేడు దిశా పటానీ.. బాలీవుడ్ హాట్ బ్యూటీపై ట్రోలింగ్..!
Disha Patani | బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ మరోసారి సోషల్ మీడియా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అంబానీ కుటుంబం ప్రతి ఏడాది నిర్వహించే గ్రాండ్ గణపతి ఉత్సవానికి ఈసారి కూడా పలువురు సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. సెప్టెంబర్ 14న జరిగిన ఈ వేడుకకు దిశా పటానీ కూడా అటెండ్ అయ్యింది.
Entertainment | Published On Sep 16, 2026, 4.41 pm IST
Disha Patani | బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ మరోసారి సోషల్ మీడియా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అంబానీ కుటుంబం ప్రతి ఏడాది నిర్వహించే గ్రాండ్ గణపతి ఉత్సవానికి ఈసారి కూడా పలువురు సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. సెప్టెంబర్ 14న జరిగిన ఈ వేడుకకు దిశా పటానీ కూడా అటెండ్ అయ్యింది. ఈ వేడుకలో ఆమె ధరించిన ఔట్‌ఫిట్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి. వినాయకుడి దర్శనం కోసం అంబానీ ఇంటికి వెళ్లిన దిశా.. రెడ్ కలర్ లెహంగాలో కనిపించింది. దీనికి డీప్ నెక్‌లైన్ బ్లౌజ్‌ను ధరించింది.
వేడుకకు ఆమె వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమె డ్రెస్‌పై రియాక్ట్ అవుతున్నారు. గణపతి ఉత్సవం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఈ తరహా ఔట్‌ఫిట్ సరిపోతుందా? అంటూ పలువురు ప్రశ్నించారు. మరికొందరు మాత్రం సెలబ్రిటీల దుస్తుల విషయంలో ఇలాంటి కామెంట్లు చేయడం అవసరమా? అంటూ ప్రశ్నిస్తుండగా.. ఇంకొందరు మాత్రం ఆధ్యాత్మిక కార్యక్రాలకు బేసిక్ డ్రెస్ కోడ్ ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దిశా పటానీని ఉద్దేశించి సోషల్ మీడియాలో భిన్నమైన కామెంట్లు కనిపిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఆమె గణపతి వేడుకకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఇక దిశా పటానీ విషయంలో మొదలైన ఈ చర్చ.. మరో బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ వరకు వెళ్లింది. ఇటీవల రక్షాబంధన్ సందర్భంగా ఓ జువెలరీ బ్రాండ్ కోసం కృతి సనన్ ప్రత్యేక యాడ్‌లో నటించిన విషయం తెలిసిందే. ఇందులో ఆమె తన సోదరుడికి రాఖీ కట్టడంతో పాటు తన పెట్ డాగ్‌కు కూడా రాఖీ కట్టే సన్నివేశాలున్నాయి. అయితే, ఆ యాడ్‌లో కృతి ధరించిన ఔట్‌ఫిట్‌పై అప్పట్లో సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ జరిగింది. ఇప్పుడు దిశా పటానీ డ్రెస్‌పై జరుగుతున్న చర్చ నేపథ్యంలో.. కొందరు నెటిజన్లు కృతి సనన్ రాఖీ యాడ్‌ను ప్రస్తావిస్తూ ఇద్దరినీ కంపేర్ చేస్తున్నారు. దీంతో దిశా పటానీ గణపతి వేడుక వ్యవహారం ప్రస్తుతం బాలీవుడ్ సోషల్ మీడియా సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Suriya-Jyothika | 20 ఏళ్ల తర్వాత మరోసారి సూర్య–జ్యోతిక పెళ్లి!
సెప్టెంబర్ 16, 2026

Vishwambhara | ‘విశ్వంభర’పై మెగాస్టార్‌దే తుది నిర్ణయం..! రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారో..!
సెప్టెంబర్ 16, 2026

Malavika Mohanan | మాళవికకు వరుస ఫ్లాపులు.. ఈ ఏడాది కలిసిరాని భారీ బడ్జెట్ సినిమాలు..!
సెప్టెంబర్ 16, 2026
తాజావార్తలు
- ●EPFO wage | ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈపీఎఫ్‌వో వేతన పరిమితి రూ.25,000కు పెంపు
- ●Revanth Reddy Assembly Speech | ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు అగ్రికల్చర్ సీలింగ్ చట్టం ద్వారా భూములకు విముక్తి కల్పించారు
- ●UPI payments | ఎలాంటి విదేశీ ఒత్తిడీ లేదు.. యూపీఐ ఛార్జీలపై కాంగ్రెస్ ఆరోపణలను తోసిపుచ్చిన కేంద్రం
- ●Indian Stock Market | రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ షేర్ల జోరు.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- ●UPI | రూ.2వేలు దాటితే యూపీఐ ఛార్జ్.. క్రెడిట్ కార్డుతో పోలిస్తే ఎంత?
- ●Eatala Rajender | దాచేస్తే దాగేది కాదు తెలంగాణ చరిత్ర

EPFO wage | ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈపీఎఫ్‌వో వేతన పరిమితి రూ.25,000కు పెంపు

Revanth Reddy Assembly Speech | ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు అగ్రికల్చర్ సీలింగ్ చట్టం ద్వారా భూములకు విముక్తి కల్పించారు

UPI payments | ఎలాంటి విదేశీ ఒత్తిడీ లేదు.. యూపీఐ ఛార్జీలపై కాంగ్రెస్ ఆరోపణలను తోసిపుచ్చిన కేంద్రం

Indian Stock Market | రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ షేర్ల జోరు.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..



