త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rythu Bharosa | నేడు రైతు భ‌రోసా నిధుల‌ విడుద‌ల‌.. మొద‌టి విడుత‌లో ఎక‌రం వ‌ర‌కు పెట్టుబ‌డి సాయం

Rythu Bharosa | త్రినేత్ర‌.న్యూస్‌: రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతుభరోసా (Rythu Bharosa) నిధులను సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) విడుదల చేయనున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంట‌ల‌కు సిద్దిపేట జిల్లా న‌ర్మెట‌లో జ‌రుగ‌నున్న స‌భ‌లో సీఎం వీటిని విడుదల చేస్తారు.

G

Telangana | Published On Mar 22, 2026, 6.41 am IST

Rythu Bharosa | నేడు రైతు భ‌రోసా నిధుల‌ విడుద‌ల‌.. మొద‌టి విడుత‌లో ఎక‌రం వ‌ర‌కు పెట్టుబ‌డి సాయం
Advertisement

Rythu Bharosa | త్రినేత్ర‌.న్యూస్‌: రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతుభరోసా (Rythu Bharosa) నిధులను సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) విడుదల చేయనున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంట‌ల‌కు సిద్దిపేట జిల్లా న‌ర్మెట‌లో జ‌రుగ‌నున్న స‌భ‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి, వ్యవసాయ మంత్రి తుమ్మల, ఇతర మంత్రుల సమక్షంలో సీఎం వీటిని విడుదల చేస్తారు. ఈ పథకం కింద 1.50 కోట్ల ఎకరాలకు సాయం అందించేందుకు రూ.9 వేల కోట్లను ప్రభుత్వం సమకూర్చుకుంది.

రాష్ట్రంలో మొత్తం 73 లక్షల మంది రైతులున్నారు. వీరందరికీ ఒక ఎకరం వరకు సాయం అందేలా రూ.3,590 కోట్లు ఆర్బీఐ ద్వారా బ్యాంకులకు చేరతాయి. ఆదివారం సెలవు కావడంతో సోమవారం రైతుల ఖాతాల్లో జమవుతాయి. త‌ర్వాత మ‌రో 20 రోజుల‌కు రూ.2,650 కోట్లు రెండో విడతలో, ఏప్రిల్‌ నెలాఖరులోపు మూడో విడతగా రూ.2,760 నిధులు రైతు భరోసా పంట పెట్టుబడి సాయాన్ని వారి ఖాతాల్లోకి బ‌దిలీ చేయ‌నున్నారు. మొత్తంగా ఎకరానికి రూ.6 వేల చొప్పున 1.50 కోట్ల ఎకరాలకు రూ.9 వేల కోట్లు రైతు భ‌రోసా నిధులు అన్నదాతల ఖాతాల్లో జమ కానున్నాయి. రాష్ట్రంలోని మొత్తం రైతుల్లో 24.32 లక్షల మందికి ఎకరం వరకు, 48.68 లక్షల మందికి ఎకరం కంటే ఎక్కువ వ్యవసాయ భూములు ఉన్నాయి.

కాగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన త‌ర్వాత‌ ఇప్పటివరకు మూడు విడుతల్లో రైతుభ‌రోసా అందించింది. ప్ర‌స్తుతం నాలుగో సీజన్‌కు నిధులు అందుతున్నాయి. 2023-24 యాసంగిలో ఎకరానికి రూ.5000 చొప్పున 7625 కోట్లు, 2024-25 యాసంగిలో రూ.5000 చొప్పున రూ.5057 కోట్లు, 2025-26 వానాకాలం సీజన్‌లో ఎకరానికి సాయం రూ.6000కి పెంచి రూ.8800 కోట్లను జమ చేసింది.

Advertisement

తాజావార్తలు

Advertisement