DA Hike | విద్యుత్ ఉద్యోగులకు డీఏ పెంపు..
DA Hike | విద్యుత్ ఉద్యోగులకు (Electricity employees) ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యుత్ సంస్థల ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు డీఏ (DA Hike) 1.621 శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
DA Hike | త్రినేత్ర.న్యూస్: విద్యుత్ ఉద్యోగులకు (Electricity employees) ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యుత్ సంస్థల ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు డీఏ (DA Hike) 1.621 శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపును ఈ ఏడాది జనవరి 1 నుంచి వర్తిస్తుందని ప్రకటించింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. విద్యుత్ సౌధలోని జెన్ కో ప్రధాన కార్యాలయంలో ఇంధన శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీఏ పెంపుపై నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి వచ్చేలా డీఏను పెంచే ప్రతిపాదనకు డిప్యూటీ సీఎం పచ్చ జెండా ఊపారు. దీంతో విద్యుత్ ఉద్యోగుల డీఏ 17.651 శాతం నుంచి 19.272 శాతానికి చేరింది. దీనివల్ల ప్రభుత్వంపై నెలకు సుమారు రూ.9.35 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుంది. విద్యుత్ రంగ సంస్థల్లో పని చేస్తున్న మొత్తం 70,804 మంది సిబ్బంది, పెన్షనర్లు ఈ డీఏ పెంపు వల్ల ప్రయోజనం పొందనున్నారు.
ఈ సమావేశంలోనే విద్యుత్‌రంగ పనితీరుపై ఉప ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. ప్రధానంగా రాబోయో వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా విద్యుత్ అధికారులు సన్నద్ధం కావాలని చెప్పారు. అలాగే రానున్న పదేండ్లను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ రంగ సంస్థల్లో మౌలిక సదుపాయాల కోసం పటిష్టమైన ప్రణాళికను రూపొందించడంపై అధికారులుకు పలు సూచనలు చేశారు.
గరిష్ట డిమాండ్ ఎదురైనా..
ఈ ఎండాకాలంలో రికార్డు స్థాయిలో గరిష్ట డిమాండ్ ఎదురైనా ఎక్కడా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా చూసిన అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఏడాది మార్చి 27న పీక్ డిమాండ్ 18,548 మెగావాట్లకు చేరిందన్నారు. అయినా సరఫరాలో అంతరయాలు లేకుండా ముందస్తు ప్రణాళికతో అధికారులు, సిబ్బంది పని చేశారన్నారు. అలాగే మార్చి 13, 2026 న అత్యధికంగా 341 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదైనా నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
విద్యుత్ అవసరాలకు అనుగుణంగా..
భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, రాబోయే దశాబ్ద కాలానికి సమగ్రమైన, దీర్ఘకాలిక విద్యుత్ ప్రణాళికను సిద్ధం చేయాలని విద్యుత్ రంగ అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు. రాబోయే పదేండ్లలో రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను విస్తరించాలని అన్నారు. రాష్ట్రంలో 2035-36 నాటికి పీక్ డిమాండ్ 34,137 మెగావాట్లకు చేరుకుంటుందని అంచనాగా చెప్పారు. ఈ ఏడాది నమోదైన పీక్ డిమాండ్ 18,548 మెగావాట్లకు దాదాపు రెట్టింపుగా ఉంటుందని అన్నారు. అంతేకాకుండా 2035-36 నాటికి వార్షిక విద్యుత్ అవసరాలు 1,52,626 మిలియన్ యూనిట్లకు (MU) చేరుకుంటుందన్నారు.
అత్యంత సంసిద్ధంగా ఉండాలి..
వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, ట్రాన్స్ కోలు అత్యంత సంసిద్ధంగా ఉండాలని ఆయన అధికారులకు సూంచించారు. ప్రధానంగా క్షేత్రస్థాయి అధికారులు, ఇంజనీర్లు, సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగా ఎక్కడైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే, తక్షణమే రంగంలోకి దిగి లోపాలను సరిచేయాలని ఆదేశించారు. ఈదురు గాలులు, భారీ వర్షాల కారణంగా సంభవించే విద్యుత్ ప్రమాదాలను నివారించడానికి అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలను క్షేత్రస్థాయిలో కచ్చితంగా అమలు చేయాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు.
సంబంధిత వార్తలు

Rythu Bharosa | 26న రైతు భరోసా.. మధిరలో నిధులు విడుదల చేయనున్న సీఎం రేవంత్
జూన్ 18, 2026

ADG Vijay Kumar | లైసెన్స్ లేని సెక్యూరిటీ ఏజెన్సీలపై కఠిన చర్యలు: ఏడీజీ విజయ్ కుమార్
జూన్ 17, 2026

TGMSIDC Review Telangana | ఆ రోగులకు ప్రభుత్వం అండ.. ఉచితంగా మందులు: దామోదర రాజనర్సింహ కీలక నిర్ణయాలు
జూన్ 17, 2026
తాజావార్తలు
- ●PM Kisan | రైతు భరోసా కంటే ముందుగానే పీఎం కిసాన్ సమ్మాన్ డబ్బులు.. ఎప్పుడంటే?
- ●Rythu Bharosa | 26న రైతు భరోసా.. మధిరలో నిధులు విడుదల చేయనున్న సీఎం రేవంత్
- ●America Iran War | అమెరికా, ఇరాన్ యుద్ధం.. ప్రపంచ దేశాలపై ప్రభావం..
- ●OTT | డేటింగ్ కాన్సెప్ట్‌తో రియాలిటీ షో - బిగ్‌బాస్‌కు పోటీగా స్ట్రీమింగ్ - హోస్ట్‌గా సీనియర్ హీరోయిన్
- ●America Iran War | ముగిసిన అమెరికా, ఇరాన్ యుద్ధం.. ఒప్పందపై ట్రంప్, పెజెష్కియాన్ సంతకం
- ●Horoscope | జూన్ 18 రాశి ఫలాలు.. ఈ రాశివారికి అనుకూల ఫలితాలు ఉంటాయి!

PM Kisan | రైతు భరోసా కంటే ముందుగానే పీఎం కిసాన్ సమ్మాన్ డబ్బులు.. ఎప్పుడంటే?

Rythu Bharosa | 26న రైతు భరోసా.. మధిరలో నిధులు విడుదల చేయనున్న సీఎం రేవంత్

America Iran War | అమెరికా, ఇరాన్ యుద్ధం.. ప్రపంచ దేశాలపై ప్రభావం..

OTT | డేటింగ్ కాన్సెప్ట్‌తో రియాలిటీ షో - బిగ్‌బాస్‌కు పోటీగా స్ట్రీమింగ్ - హోస్ట్‌గా సీనియర్ హీరోయిన్



