Smart Ration Cards | స్మార్ట్ రేషన్‌కార్డులు వచ్చేస్తున్నయ్.. 15న సంగారెడ్డిలో పంపిణీకి శ్రీకారం చుట్టనున్న సీఎం..!
Smart Ration Cards | రాష్ట్రవ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 1.06 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
Smart Ration Cards | రాష్ట్రవ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 1.06 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అదే రోజు రాష్ట్రంలోని మిగిలిన 32 జిల్లాల్లోనూ ఏకకాలంలో కార్డుల పంపిణీ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 3.42 కోట్ల మంది అర్హులైన లబ్ధిదారులు ప్రయోజనం పొందనున్నారని చెప్పారు. ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా ప్రతి అర్హుడికి ప్రతి నెల ఉచితంగా 6 కిలోల నాణ్యమైన సన్నబియ్యాన్ని ప్రభుత్వం అందజేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం ప్రతి నెల సుమారు 2.16 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ తెలంగాణలో ఆహార భద్రతను మరింత బలోపేతం చేసే కీలక కార్యక్రమంగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. ప్రతి అర్హ కుటుంబానికి గౌరవప్రదమైన జీవనానికి అవసరమైన ఆహార భద్రతను కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున చేపట్టనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులు, సంబంధిత అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్మార్ట్ రేషన్ కార్డులు పొందేలా అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. పంపిణీ ప్రక్రియను అత్యంత ప్రాధాన్యంతో నిర్వహించి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. దేశంలోనే అత్యంత సమర్థవంతమైన ఆహార భద్రతా కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచే ఈ పథకంలో భాగస్వామి కావడం ఆనందంగా ఉందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Stock Markets | స్వల్పంగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు.. తీవ్ర అస్థిరతతో కదిలిన సూచీలు..
- ●ACB Raids | ఏసీబీకి పట్టుబడ్డ సచివాలయం ఉద్యోగులు
- ●Samantha | సినిమాలు మానేయాలనుకున్నా - విడాకుల తర్వాత జీవితంపై సమంత కామెంట్స్
- ●NRI BRS Australia | కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై ఆస్ట్రేలియాలో నిరసన
- ●US Dollar | అమెరికా డాలర్ తన ప్రాభవాన్ని కోల్పోతుందా..? సింగపూర్ డాలర్ వైపు ఇన్వెస్టర్ల చూపులు..
- ●MLC L Ramana | అసెంబ్లీ సమావేశాలు కనీసం నెల రోజుల పాటు నిర్వహించండి

Stock Markets | స్వల్పంగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు.. తీవ్ర అస్థిరతతో కదిలిన సూచీలు..

ACB Raids | ఏసీబీకి పట్టుబడ్డ సచివాలయం ఉద్యోగులు

Samantha | సినిమాలు మానేయాలనుకున్నా - విడాకుల తర్వాత జీవితంపై సమంత కామెంట్స్

NRI BRS Australia | కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై ఆస్ట్రేలియాలో నిరసన



