MP Vaddiraju | పార్లమెంట్ సభ్యులతో బ్యాడ్మింటన్ కోర్టులో ఎంపీ వద్దిరాజు
MP Vaddiraju | పార్లమెంట్‌లో ప్రజా సమస్యలపై చర్చలు, సమావేశాలతో నిత్యం బిజీగా ఉండే ప్రజాప్రతినిధులు.. శుక్రవారం బ్యాడ్మింటన్ కోర్టులో సందడి చేశారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులు ఒకే వేదికపై రాకెట్లు పట్టి క్రీడాస్ఫూర్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కూడా పోటీల్లో పాల్గొని తోటి ఎంపీలతో కలిసి ఉత్సాహంగా ఆడారు.
- జాతీయ పార్లమెంటేరియన్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో ఉత్సాహంగా పాల్గొన్న బీఆర్‌ఎస్ నేత
- ఢిల్లీ కానిస్టిట్యూషన్ క్లబ్‌లో కొనసాగుతున్న ఆరో విడత పోటీలు
MP Vaddiraju | పార్లమెంట్‌లో ప్రజా సమస్యలపై చర్చలు, సమావేశాలతో నిత్యం బిజీగా ఉండే ప్రజాప్రతినిధులు.. శుక్రవారం బ్యాడ్మింటన్ కోర్టులో సందడి చేశారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులు ఒకే వేదికపై రాకెట్లు పట్టి క్రీడాస్ఫూర్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కూడా పోటీల్లో పాల్గొని తోటి ఎంపీలతో కలిసి ఉత్సాహంగా ఆడారు. ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా ఆవరణలో ఉన్న జిందాల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహిస్తున్న 6వ జాతీయ పార్లమెంటేరియన్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. గురువారం ప్రారంభమైన ఈ పోటీల్లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు పాల్గొంటున్నారు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌ల్లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కోర్టులోకి దిగి తన ఆటతీరుతో ఆకట్టుకున్నారు.
అధికార, ప్రతిపక్షాలకు చెందిన పలువురు సభ్యులతో కలిసి స్నేహపూర్వక వాతావరణంలో మ్యాచ్‌లు ఆడారు. మ్యాచ్‌ల సందర్భంగా సభ్యులు పరస్పరం ఆత్మీయంగా పలకరించుకుంటూ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించారు. రాజకీయాలకు అతీతంగా అందరూ ఒకే వేదికపై కలుసుకోవడం విశేషంగా నిలిచింది. ప్రజాప్రతినిధుల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, క్రీడల పట్ల ఆసక్తిని ప్రోత్సహించడం, పార్లమెంట్ సభ్యుల మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ను ప్రతి ఏడాది నిర్వహిస్తున్నారు. ఈ వేదిక రాజకీయాలకు అతీతంగా సభ్యులు కలుసుకునే అవకాశాన్ని కల్పించడంతో పాటు పరస్పర సాన్నిహిత్యాన్ని పెంపొందిస్తోంది. ఈ నెల 9వ తేదీ వరకు కొనసాగే ఈ పోటీల్లో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులు తమ ప్రతిభను చాటుకోనుండగా, ముగింపు రోజున విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. ఈ క్రీడా పోటీలు పార్లమెంట్ సభ్యుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడమే కాకుండా, రాజకీయాలకు అతీతంగా స్నేహపూర్వక వాతావరణాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Nitin Gadkari | సిగ్గుగా ఉంది.. ప్రారంభోత్సవానికి నేను రాను : రహదారి నిర్మాణం ఆలస్యంపై గడ్కరీ అసహనం
- ●S.Madhusudhana Chary | పింక్ కలర్ చొక్కా వేసుకున్నా సభలో అడ్డుకున్నరు
- ●MLC Venkatrami Reddy | వీర్లపల్లి శంకర్ మీద ఏం చర్యలు తీసుకున్నరో చెప్పాలి
- ●Supreme Court | ఆన్లైన్లో అనుచిత కంటెంట్ నుంచి పిల్లల్ని రక్షించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
- ●KCR Fake Tweet Controversy | రేవంత్ రెడ్డే సంధ్యారావు.. సంధ్యారావే రేవంత్ రెడ్డి
- ●Jayam Ravi | వెంకటేశ్వరస్వామిగా జయం రవి - మంచు మనోజ్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ

Nitin Gadkari | సిగ్గుగా ఉంది.. ప్రారంభోత్సవానికి నేను రాను : రహదారి నిర్మాణం ఆలస్యంపై గడ్కరీ అసహనం

S.Madhusudhana Chary | పింక్ కలర్ చొక్కా వేసుకున్నా సభలో అడ్డుకున్నరు

MLC Venkatrami Reddy | వీర్లపల్లి శంకర్ మీద ఏం చర్యలు తీసుకున్నరో చెప్పాలి

Supreme Court | ఆన్లైన్లో అనుచిత కంటెంట్ నుంచి పిల్లల్ని రక్షించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు






