త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | మహిళా బిల్లు వీగిపోవ‌డం.. బీజేపీ ఓట‌మినే : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | పార్ల‌మెంట్‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స‌ర్కార్ ప్ర‌వేశ‌పెట్టిన మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల బిల్లు వీగిపోవ‌డం అంటే.. రాజ‌కీయ విధానాల ఓట‌మి కాదు.. బీజేపీ విధానాల ఓట‌మి అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

S

Telangana | Published On Apr 18, 2026, 2.08 pm IST

CM Revanth Reddy | మహిళా బిల్లు వీగిపోవ‌డం.. బీజేపీ ఓట‌మినే : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : పార్ల‌మెంట్‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స‌ర్కార్ ప్ర‌వేశ‌పెట్టిన మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల బిల్లు వీగిపోవ‌డం అంటే.. రాజ‌కీయ విధానాల ఓట‌మి కాదు.. బీజేపీ విధానాల ఓట‌మి అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

సీఎం రేవంత్‌ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. మ‌హిళా బిల్లు పేరుతో డీలిమిటేష‌న్ బిల్లు తీసుకువ‌చ్చింది. మ‌హిళా బిల్లు వీగిపోవ‌డం.. బీజేపీ విధానాల ఓట‌మిగా భావించాలి. మ‌హిళా బిల్లు వీగిపోవ‌డంతో ప్ర‌తిప‌క్షాల‌పై అస‌త్య ప్ర‌చారం చేస్తున్నారు. మ‌హిళ‌ల‌కు కాంగ్రెస్ పార్టీ చాలా చేసింది. మ‌హిళా బిల్లుపై ప్ర‌ధాని మోదీకి నిజాయితీ లేదు. నిజాయితీగా మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల బిల్లు తీసుకువ‌స్తే పార్ల‌మెంట్‌లో అంద‌రూ మ‌ద్ద‌తు తెలిపేవారు. మ‌హిళా బిల్లు పేరుతో డీలిమిటేష‌న్ బిల్లు తీసుకువ‌చ్చి ద‌క్షిణాదికి అన్యాయం చేసేవారు. ప్ర‌ధాని మోదీ.. ఉత్త‌ర‌, ద‌క్షిణ భార‌త‌దేశం మ‌ధ్య అంత‌రాలు పెట్టే విధానాన్ని విర‌మించుకోవాలి.

మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల బిల్లుపై మాకు చిత్త‌శుద్ధి ఉంది. కేంద్రానికి ఆర్థిన వ‌న‌రులు ద‌క్షిణాది నుంచి అందుతున్నాయి. యూపీ ఎన్నిక‌ల‌లోపు మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల బిల్లు అమ‌లు చేయాలి. 2023 మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల బిల్లును య‌థావిధిగా అమ‌లు చేయాలి. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల‌లోనూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేయాలి. ఈ బిల్లు విష‌యంలో రాజ‌కీయం చేయాల్సిన అవ‌స‌రం లేదు.

నిన్న లోక్‌స‌భ‌లో బిల్లు వీగిపోవ‌డంతో ప్ర‌ధాని మోదీ అహంకారం త‌గ్గింది. త‌ప్పుడు చ‌ట్టాలు తీసుకువ‌స్తే గ‌ల్లీ నుంచి పార్ల‌మెంట్్ వ‌ర‌కు నిర‌స‌న తెలుపుతాం. 2023 మ‌హిళా బిల్లును పోమ‌వారం పార్ల‌మెంట్‌లో పెట్టాలి. 2023 మ‌హిళా బిల్లును పెడితే మ‌ద్ద‌తు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం.

బిల్లు వీగిపోవడం అంటే బీజేపీ ఓడిపోవడమే. బీజేపీ సర్కార్‌ రాజ్యాంగాన్ని కాలరాయాలని చూసింది. ప్రధాని మోదీ కుట్రలను కాంగ్రెస్‌ సమర్థవంతంగా అడ్డుకుంది. దేశవ్యాప్తంగా బీజేపీ విధానాలను కాంగ్రెస్‌ ఎండగట్టింది. ఇది రాజకీయ విధానాల ఓటమి కాదు.. బీజేపీ విధానాల ఓటమి. రాజ్యాంగం మార్చడానికి, రిజర్వేషన్లు రద్దు చేసేందుకు అబ్ కీబార్ చార్ సౌ అన్నారు బీజేపీకి 400 సీట్లు ఇచ్చి ఉంటే రాజ్యాంగాన్ని మార్చేవారు. మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకువస్తే రేపే మద్దతు ఇస్తాం. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ కోటా పెట్టాలి. హైబ్రిడ్ మోడల్‌లో డీలిమిటేషన్ జరగాలి అని వ్యాఖ్యలు చేశారు. 2023 మహిళా బిల్లును యథాతథంగా అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement