త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | స‌భ‌కు ప్రిపేరై రండి.. మంత్రుల‌కు, ఎమ్మెల్యేల‌కు సీఎం రేవంత్ క్లాస్

CM Revanth Reddy | తెలంగాణ బ‌డ్జెట్ స‌మావేశాల నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క‌రూ ప్రిపేరై రావాల‌ని మంత్రులు, ఎమ్మెల్యేల‌కు సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ పీకారు. మండ‌లి క‌మిటీ హాల్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన సీఎల్పీ స‌మావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేల‌పై గ‌రమైన‌ట్లు స‌మాచారం.

S

Telangana | Published On Mar 16, 2026, 5.52 pm IST

CM Revanth Reddy | స‌భ‌కు ప్రిపేరై రండి.. మంత్రుల‌కు, ఎమ్మెల్యేల‌కు సీఎం రేవంత్ క్లాస్
Advertisement

చిట్‌చాట్‌లు మానేయండి..
ఇష్యూపై కౌంట‌ర్ ఇవ్వండి..
అంద‌రూ స‌భ‌కు రావాల్సిందే..
పార్టీ లైన్‌లోనే స్పందించాలి..
సీఎల్పీ మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ బ‌డ్జెట్ స‌మావేశాల నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క‌రూ ప్రిపేరై రావాల‌ని మంత్రులు, ఎమ్మెల్యేల‌కు సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ పీకారు. మండ‌లి క‌మిటీ హాల్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన సీఎల్పీ స‌మావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేల‌పై గ‌రమైన‌ట్లు స‌మాచారం.

అన‌వ‌స‌ర విష‌యాలు మాట్లాడొద్దు.. చిట్ చాట్‌లు మానేయాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు స‌మ‌న్వ‌యం చేసుకోవాలి. అంతేకాకుండా ఎమ్మెల్యేల స‌మ‌స్య‌ల విష‌యంలో వారికి మంత్రులు స‌మ‌యం ఇవ్వాలి. నేను కూడా ఎమ్మెల్యేల‌కు స‌మ‌యం ఇస్తాను. స‌భ‌లో ఇష్యూపై కౌంట‌ర్ ఇవ్వాల‌ని సీఎం సూచించిన‌ట్లు స‌మాచారం.

ప్ర‌తి ఒక్క‌రూ స‌భ‌కు రావాల్సిందే..

బ‌డ్జెట్ స‌మావేశాలు ముగిసే దాకా ప్ర‌తి ఎమ్మెల్యే స‌భ‌కు రావాల్సిందే. అటెండెన్స్ త‌ప్ప‌నిస‌రి. సీఎల్పీ మీటింగ్‌కు ఆరుగురు స‌భ్యులు రాలేదు. సీఎల్పీకి రాలేనంత బిజీగా ఉన్నారా..? ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉంటే స‌రే అని సీఎం అన్న‌ట్లు స‌మాచారం.

గవర్నర్ ప్రసంగం మన ప్రభుత్వానికి రోడ్ మ్యాప్

ప్రజా ప్రభుత్వంలో మూడవ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నాం. ప్రభుత్వ ప్రాధాన్యతలు, భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించి గవర్నర్ ప్రసంగంలో వివరించారు. గవర్నర్ ప్రసంగం మన ప్రభుత్వానికి రోడ్ మ్యాప్ లాంటిది. ఇక గత ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించాల్సిన సమయం అయిపోయింది. మన భవిష్యత్ ప్రణాళికలు, ప్రజలకు ఏం చేయబోతున్నామనే దానిపై దృష్టిసారించాలి. సభలో మాట్లాడే అంశాలపై విప్‌ల మధ్య సమన్వయం ఉండాలి. సభలో చర్చ పక్కదారి పట్టకుండా, సభా సమయం వృధా కాకుండా సమర్థవంతంగా నడిపేలా చూడాలని సీఎం అన్నారు.

భట్టి విక్రమార్కకు, జానారెడ్డికి కూడా మైక్ ఇవ్వలేదు..

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు సబ్జెక్ట్ మాట్లాడటానికి కూడా సమయం ఇవ్వలేదు. సీఎల్పీ నేతగా ఉన్న భట్టి విక్రమార్కకు, జానారెడ్డికి కూడా మైక్ ఇవ్వలేదు. సెషన్ మొత్తం సస్పెండ్ చేసి ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు నన్ను సభకు రాకుండా చేశారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో హాజరు విషయంలో ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం వహించొద్దు. మహిళా శాసన సభ్యులు హాజరుతో పాటు చర్చల్లో పాల్గొనాలి. సభా చర్చల్లో మహిళా సభ్యుల భాగస్వామ్యం అవసరం. అసెంబ్లీ కమిటీలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసుకోవాలి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర రాష్ట్రాలు పర్యటించి సమస్యలు, ఆయా ప్రభుత్వ విధానాలను అధ్యయనం చేయాలని సీఎం సూచించారు.

పార్టీ, ప్రభుత్వ పరమైన లైన్‌లోనే అందరూ స్పందించాలి..

రాజకీయాల్లో వ్యక్తిగత డ్యామేజీ ఉండదు.. ఆది వ్యవస్థ మొత్తాన్ని డ్యామేజ్ చేస్తుంది. వ్యవస్థను నిలబెట్టుకుంటేనే రాజకీయాల్లో మనుగడ ఉంటుంది. పార్టీ, ప్రభుత్వ పరమైన లైన్‌లోనే అందరూ స్పందించాలి. ఇది మన ప్రభుత్వం.. ఇప్పుడు మనం వేసుకునే రోడ్ మ్యాప్‌నే వచ్చే ఎన్నికలకు ఎజెండా అవుతుంది. వేసవి నేపథ్యంలో తాగునీటి సమస్యపై ఫోకస్ పెట్టండి. 99 రోజుల ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికను క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందే అని సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement