CM Revanth Reddy | నిజాం చేసిన అభివృద్ధిని కాలగర్భంలో కలిపేశారు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy | హైదరాబాద్ నగరంలో నిజాం చేసిన అభివృద్ధిని కాలగర్భంలో కలిపేశారు.. నగరాన్ని కలుషితం చేశారని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ నదిని తప్పకుండా జీవనదిగా మార్చుతాం.. మార్చి నెలలో పనులు ప్రారంభిస్తామని సీఎం పేర్కొన్నారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగరంలో నిజాం చేసిన అభివృద్ధిని కాలగర్భంలో కలిపేశారు.. నగరాన్ని కలుషితం చేశారని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ నదిని తప్పకుండా జీవనదిగా మార్చుతాం.. మార్చి నెలలో పనులు ప్రారంభిస్తామని సీఎం పేర్కొన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మూసీ నది పునరుజ్జీవంపై చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం రేవంత్ సవివరంగా సమాధానం ఇచ్చారు.
సబర్మతి రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా 60 వేల కుటుంబాలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. యూపీలో గంగా నది ప్రక్షాళన చేశారు. అక్కడ వేల కుటుంబాలను తరలించారు. ఢిల్లీలో యమునా నదిని కూడా ప్రక్షాళన చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పి మోదీ గెలిచారు. అభివృద్ధి జరిగినప్పుడు కొంత మందికి నష్టం జరుగుతుంది. అలాంటప్పుడు పరిహారం ఇస్తాం. ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధి జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించలేదు. మెరుగైన వసతులు కల్పించాలని ఆయా ప్రభుత్వాలకు సూచించాం అని రేవంత్ పేర్కొన్నారు.
నిజాం సర్కార్ మూసీ నదిని కట్టారు. మూసీ నది పరివాహక ప్రాంతంలో పురానాపూల్, సాలార్‌జంగ్ హౌజ్ వంటి చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి. దశాబ్దాల కిందటే నది పరివాహక ప్రాంతాలను వ్యాపార కేంద్రాలుగా తీర్చిదిద్దారు నిజాం. ప్రపంచంతో పోటీ పడ్డారు. నిజాం చేసిన అభివృద్ధిని కాలగర్భంలో కలిపేశారు. కలుషితం చేసి ఆక్రమించి అన్యాక్రాంతం చేశారు. హైదరాబాద్ నగరంలోని మురికిని మూసీ నదిలో కలిపేశారు. చచ్చిన శవాల నుంచి పశువుల కళేబరాలను మూసీ నదిలో కలపడం వల్ల నల్లగొండ ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు. ఫార్మా కంపెనీలు వెదజల్లుతున్న కాలుష్యం వల్ల నల్లగొండ జిల్లా ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆ జిల్లా ప్రజలకు భగవంతుడే శిక్ష విధించాడు.. దేవుడే కక్ష కట్టిండు అన్నట్టు.. పుట్టె పిల్లలు అష్ట వంకరలతో పుట్టారు. ఆ పిల్లల తల్లిదండ్రుల దుఃఖం ఎలాంటిదో చూడాలి. మూసీ పరివాహక ప్రాంతంలో మహిళలు గర్భం దాల్చే పరిస్థితి లేదు. ఎందుకంటే నది పరివాహక ప్రాంతంలో పండే పంటలను తినడం, ఆ నీటిని తాగడం మూలంగా గర్భం దాల్చే పరిస్థితి లేదని వైద్యులు నివేదికలు ఇచ్చారని రేవంత్ గుర్తు చేశారు. పుట్టే పిల్లలు కూడా అంగవైకల్యంతో పుట్టే పరిస్థితి వస్తుందన్నారు. మూసీ పక్కన నిలబడలేని పరిస్థితి ఉంది. పశువులు, మేకలు చనిపోతున్నాయి. పండించే పంటలు తినడం వల్ల జీవించలేని పరిస్థితి వచ్చింది. నల్లగొండకు ఏం చేయకపోయినా మూసీని ప్రక్షాళన చేసి.. కలుషితం నుంచి కాపాడండి అని నల్లగొండ జిల్లా ప్రజలు విజ్ఞప్తి చేసినట్లు రేవంత్ గుర్తు చేశారు.
ఈ పరిస్థితులను చూసిన తర్వాత స్పష్టమైన నిర్ణయం తీసుకున్నాం మూసీ నదిని ప్రక్షాళన చేయాలని. జీవనదిగా మార్చాలని నిర్ణయించాం. కన్సల్టెంట్ కోసం గ్లోబల్ టెండర్లు పిలిచాం. సింగపూర్ సంస్థలు నది ప్రక్షాళనపై వర్క్ చేస్తున్నాయి. మూసీ రివర్ డెవలప్‌మెంట్ కోసం కన్సెల్టెన్సీని అపాయింట్మెంట్ చేసుకున్నాం. మూసీ పునరుద్ధరణ కోసం నివేదికలు తయారు చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ ఉస్మాన్ సాగర్ నుంచి బాపూ ఘాట్, హిమాయత్ నుంచి బాపు ఘాట్ వరకు. ఇక్కడ గాంధీ సరోవర్ నిర్మించాలనుకున్నాం. ఉస్మాన్ సాగర్ నుంచి బాపూ ఘాట్‌కు 9.5 కి.మీ., హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్‌కు 11 కిలోమీటర్లు ఉంది. ఈ రెండు కలిస్తే ఒక వీ షెప్‌లో అభివృద్ధి జరుగుతుంది. గోదావరి జలాలను 20 టీఎంసీలు తరలించి.. ఇందులో 5 టీఎంసీలు గండిపేటలో వదిలి జీవనదిగా మార్చాలనుకున్నాం. 15 టీఎంసీలు తాగునీటి కోసం వాడుకోవాలని నిర్ణయించుకున్నాం. గోదావరి నది జలాల్లో రాబోయే రెండేండ్లలో తరలించుకువస్తాం. మొత్తంగా 21 కి.మీ. మేర అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.
ఈ ఫస్ట్ ఫేజ్ పనులకు ఏడీబీ బ్యాంకు 4,100 కోట్లు రుణం ఇస్తామని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం కూడా అనుతులు ఇచ్చింది. డీపీఆర్ నాలుగైదు వారాల్లో బయటకు వస్తుంది. గండి పేట నుంచి గౌరెల్లి రామోజీ ఫిల్మ్ సిటీ వరకు 55 కి.మీ. ఇదంతా ఎలివేటెడ్ కారిడార్‌గా తీర్చిదిద్దుతాం. బాపుఘాట్, నార్సింగ్, చాదర్‌ఘాట్, నాగోల్ వద్ద జంక్షన్లు ఏర్పాటు చేస్తాం. ఈ ప్రాజెక్టులో భాగంగా మీరాలం ట్యాంకు ఫీడర్‌ను మూసీకి అనుసంధానం చేస్తాం. 450 కోట్లతో అభివృద్ధి చేస్తాం. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ. ప్రపంచంలోనే హైదరాబాద్ నగరం గొప్పది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





