త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | ప‌దేండ్లు మాదే అధికారం.. అండ‌గా నిల‌బ‌డాలి.. వేడుకున్న సీఎం రేవంత్

CM Revanth Reddy | తెలంగాణ‌లో రాబోయే ప‌దేండ్లు అధికారం మాదే అని సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. న‌గ‌రాభివృద్ధికి కృషి చేస్తున్నామ‌ని మీరంతా అండ‌గా నిల‌బ‌డాల‌ని సీఎం వేడుకున్నారు.

S

Telangana | Published On May 28, 2026, 9.21 pm IST

CM Revanth Reddy | ప‌దేండ్లు మాదే అధికారం.. అండ‌గా నిల‌బ‌డాలి.. వేడుకున్న సీఎం రేవంత్
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ‌లో రాబోయే ప‌దేండ్లు అధికారం మాదే అని సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. న‌గ‌రాభివృద్ధికి కృషి చేస్తున్నామ‌ని మీరంతా అండ‌గా నిల‌బ‌డాల‌ని సీఎం వేడుకున్నారు. మైత్రీవ‌నంలో ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన అనంత‌రం సీఎం రేవంత్ ప్ర‌సంగించారు.

1994 నుంచి 2004 వ‌ర‌కు ప‌దేండ్లు టీడీపీ అధికారంలో ఉంది. 2004 నుంచి 2014 వ‌ర‌కు ప‌దేండ్లు కాంగ్రెస్, 2014 నుంచి 2023 వ‌ర‌కు ప‌దేండ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఇవ్వాళ నేను చెబుతున్నా.. మీ ఉత్సాహం మీ ఊపు చూసిన త‌ర్వాత 2024 నుంచి 2034 వ‌ర‌కు మాదే అధికారం. సంక్షేమాన్ని, అభివృద్ధిని అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే బాధ్య‌త తీసుకుంటాం. ఎన్నో అభివృద్ధి ప‌నులు జ‌రుగుతున్నాయి. అండ‌గా నిల‌బ‌డండి.. హైటెక్ సిటీ, ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్‌ను చంద్ర‌బాబు ప్ర‌ణాళిక‌బ‌ద్ధంగా ముందుకు తీసుకెళ్లారు. ఇవాళ మా ప్ర‌భుత్వం 30 వేల ఎక‌రాల్లో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు కూత‌వేటు దూరంలో భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీని నిర్మిస్తున్నాం. ప్ర‌పంచాన్ని అక్క‌డికి తీసుకువ‌స్తాం. ఈనాడు మ‌న యువ‌త ప్ర‌పంచ దేశాల్లోని దిగ్గ‌జ కంపెనీల‌కు ప‌ని చేస్తున్నారు. స‌త్య‌నాదెళ్ల‌, శాంత‌ను నారాయ‌ణ్‌, అజయ్ భంగా, ప్రేమ్‌జీ వాత్స‌వ్ కావొచ్చు.. వీళ్లంతా హైద‌రాబాద్ బాయ్స్‌.. వీళ్లంతా హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్‌లో చ‌దువుకున్న వారు.. ప్ర‌పంచ కంపెనీల‌కు సీఈవోలుగా ఉన్నారు. ఆ కంపెనీల‌ను ఇక్క‌డికి తెస్తాం.. భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీలో పెట్టిస్తాం. అలాంటి కంపెనీల‌కు తెలంగాణ యువ‌కుల‌ను య‌జ‌మానులుగా చేసే బాధ్య‌త తీసుకుంటాం. యువ‌త‌కు ఉద్యోగ ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తాం. న‌గ‌రాభివృద్ధి కోసం మీరంద‌రూ స‌హ‌క‌రించి, అండ‌గా నిల‌బ‌డాలి. ఒక స్ఫూర్తిని నింపే విధంగా.. ఎన్టీఆర్‌ను స‌ర్మించుకునేందుకు అవ‌కాశం క‌ల్పించిన‌ మీ అంద‌రికీ ధ‌న్య‌వాదాలు అని తెలుపుతూ సీఎం రేవంత్ రెడ్డి త‌న ప్ర‌సంగాన్ని ముగించారు.

Advertisement
Advertisement