త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | తెలంగాణ‌కు నేనే రాజు.. నేనే మంత్రి : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | తెలంగాణకు నేనే రాజు, నేనే మంత్రి, నాకు ఎవరూ పోటీకాద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 2029లో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని ఆయ‌న పేర్కొన్నారు. తాను ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించనని, నన్ను అన్నవాళ్లనే నేను అంటున్నానని తెలిపారు. పదిన్నరేళ్లపాటు నేనే సీఎంగా ఉంటానని ధీమా వ్య‌క్తం చేశారు.

S

Telangana | Published On Feb 12, 2026, 8.01 pm IST

CM Revanth Reddy | తెలంగాణ‌కు నేనే రాజు.. నేనే మంత్రి : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

2029లో జ‌మిలి ఎన్నిక‌లు..!
ప‌దిన్న‌రేళ్లు నేనే సీఎం..!
కేసీఆర్‌పై క‌క్ష సాధింపు లేదు..
జూబ్లీహిల్స్‌లో ఎన్టీఆర్ బొమ్మ‌..
ఆయ‌న పేరును భార‌త‌ర‌త్న‌కు రిక‌మెండ్ చేస్తా..
ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్‌చాట్

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణకు నేనే రాజు, నేనే మంత్రి, నాకు ఎవరూ పోటీకాద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 2029లో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని ఆయ‌న పేర్కొన్నారు. తాను ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించనని, నన్ను అన్నవాళ్లనే నేను అంటున్నానని తెలిపారు. పదిన్నరేళ్లపాటు నేనే సీఎంగా ఉంటానని ధీమా వ్య‌క్తం చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రుల‌ను క‌లిసిన అనంత‌రం మీడియాతో రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేసిన సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు అంశాల‌పై మాట్లాడారు.

మేడిగడ్డ డ్యాంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు రిపోర్టు ఇచ్చారు. పూర్తి స్థాయిలో మట్టి పరీక్షలు నిర్వహించిన తర్వాతనే ఒక నిర్ధారణకు వస్తామని వాళ్ళు చెప్పారు. మట్టి పరీక్షలకు సంబంధించి ఏజెన్సీలకు ఇవ్వాలి. డ్యామ్ సేఫ్టీ చూడకుండా వాటర్ నిప్పితే డ్యాం మొత్తం కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. డ్యామ్ లో వాటర్ నింపడం వల్ల అది కొట్టుకపోతే మా ప్రభుత్వం పై నిందలు వేయాలని బీఆర్ఎస్ చూస్తుంది. బాంబులతో పెట్టి పేల్చినట్లు అంటున్నారు. బాంబులతో పేల్చితే పిల్లర్లు కింద ఎందుకు క్రాక్ వస్తాయి. బాంబులతో పేల్చితే పిల్లర్లు పైన క్రాక్ వస్తాయి. ఇలాంటి టెక్నికల్ విషయాల్లో కేసీఆర్, హరీష్ రావు చెప్తే నడవదు. ఇంజనీరింగ్ వ్యవస్థ ఉంటుంది వాళ్ళు చెప్పాలి.

కాళేశ్వ‌రం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే క‌నీసం రూ. 50 వేల కోట్లు అవసరం

రూ. ల‌క్షా 20 వేల కోట్ల‌తో కాలేశ్వరం ప్రాజెక్టు కట్టారు. ఇంకా రూ. 10 వేల కోట్ల బిల్ల‌లు పెండింగ్‌లో ఉన్నాయి. కాళేశ్వ‌రం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే క‌నీసం రూ. 50 వేల కోట్లు అవసరం. కాళేశ్వ‌రంపై విచార‌ణ కోసం సీబీఐ డైరెక్ట‌ర్‌కు, కేంద్ర హోంశాఖ‌కు లేఖ రాశాం. ఇప్ప‌టి వర‌కు ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదని సీఎం తెలిపారు.

క్లైమాక్స్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసు

ఫోన్ ట్యాపింగ్ కేసు క్లైమాక్స్‌కు చేరింది. నేను ఎవరి ఫోన్‌లు ట్యాప్ చెయ్యడం లేదు, ఫోన్ ట్యాపింగ్ చేసి ఇతరుల విషయాలు వినడం మానసిక క్షోభ. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్ర‌భాక‌ర్ రావును విచారించేందుకు 20 నెల‌లు పంట్టింది. ఆయ‌న అరెస్టుకు కేంద్ర ప్ర‌భుత్వం స‌హ‌క‌రించ‌లేదు. సుప్రీంకోర్టు ద్వారా ప్ర‌భాక‌ర్ రావును రప్పించాను. త్వ‌ర‌లోనే ఛార్జిషీట్ వేయ‌మ‌ని ఆదేశాలు ఇచ్చాను. ప్ర‌భాక‌ర్ రావు ఇచ్చిన స‌మాచారం మేర‌కు కేసీఆర్ విచార‌ణ జ‌రిగింది. అయితే పార‌ద‌ర్శ‌కంగా విచారించాల‌ని అధికారుల‌ను ఆదేశించాను. అందుకే నేను క‌ల్పించుకోవ‌డం లేదు. అన్ని కేసుల్లో ద‌ర్యాప్తు ఆధారంగానే ముందుకు వెళ్తున్నాం. కిష‌న్ రెడ్డి లేఖ రాస్తే ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా కేంద్రానికి ఇస్తామ‌ని రేవంత్ తెలిపారు.

కేసీఆర్‌ను జైల్లో వేయాలంటే వేయవచ్చు.. 

కేసీఆర్ స్వయం ప్రకటిత గృహ దిగ్బంధంలో ఉన్నారు. ఆయ‌న‌కు ఆయ‌నే శిక్ష వేసుకున్నారు. కేసీఆర్‌ను జైల్లో వేయాలంటే వేయవచ్చు. ఆయ‌న‌పై క‌క్ష సాధింపు లేదు. కానీ ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్తున్నాం. నేను రాజ్యాంగం ప్రకారం నడుస్తాను. నాకు సొంత రాజ్యాంగం లేదు అని సీఎం రేవంత్ స్ప‌ష్టం చేశారు.

జూబ్లీహిల్స్‌లో ఎన్టీఆర్ బొమ్మ..

జూబ్లీహిల్స్‌లో ఎన్టీఆర్ బొమ్మ పెడుతాం. ఆయ‌న నేష‌న‌ల్ లీడ‌ర్. ఎన్టీఆర్‌కు ఎలాంటి బౌండ‌రీస్ లేవు. ఆయ‌న జాతీయ సొత్తు.. భార‌త‌ర‌త్న‌కు సిఫార‌సు చేస్తాను అని సీఎం అన్నారు.

నేను అమాయ‌కుడిని కాబ‌ట్టి నాపై నింద‌లు

సింగరేణి టెండర్ల విషయంలో 2018 లోనే కేంద్రం మార్పులు చేసింది. సింగరేణి టెండర్ల వ్యాపారంలో అసెంబ్లీలో మాట్లాడుతా. సైట్ విజిట్ చేసేముందు పర్మిషన్ తీసుకోవాలని ఉంది. నేను ప్రూఫ్ చేస్తే కిషన్ రెడ్డి క్షమాపణ చెప్తాడా. కోల్ ఇండియా కూడా అప్పుల ఊబిలో ఉంది. సింగరేణి మేం అధికారంలోకి వచ్చినప్పుడు నుంచే అప్పుల్లో ఉంది. సింగరేణి జెన్‌కోకు బొగ్గు సరఫరా చేసింది. నేను అమాయకుడిని కాబట్టి నా మీద నిందలు వేస్తున్నారు. కేసీఆర్‌ను ఎందుకు అడగలేదు రేవంత్ రెడ్డి. కేసీఆర్ సెల్ఫ్ హౌస్ అరెస్ట్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉందని సీఎం రేవంత్ అన్నారు.

Advertisement
Advertisement