త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG Budget | మార్చిలోనే రాష్ట్ర బ‌డ్జెట్ : సీఎం రేవంత్ రెడ్డి

TG Budget | ఈ నెల 28నే రాష్ట్ర బ‌డ్జెట్ ఉంటుంద‌ని వ‌స్తున్న వార్త‌ల‌కు తెర‌ప‌డింది. మార్చి మొద‌టి లేదా రెండో వారంలో బ‌డ్జెట్ స‌మావేశాలు నిర్వ‌హించే అవ‌కాశం ఉంది.

S

Telangana | Published On Feb 22, 2026, 7.41 pm IST

TG Budget | మార్చిలోనే రాష్ట్ర బ‌డ్జెట్ : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

దేవాదులపై ఇంజినీర్ల‌తో సీఎం స‌మీక్ష‌
మార్చిలో కేబినెట్‌లో అంచ‌నాల‌ను ఆమోదిస్తాం..
బ‌డ్జెట్‌లోపే భూసేక‌ర‌ణ‌కు నిధులిస్తాం..

TG Budget | త్రినేత్ర‌.న్యూస్ : ఈ నెల 28నే రాష్ట్ర బ‌డ్జెట్ ఉంటుంద‌ని వ‌స్తున్న వార్త‌ల‌కు తెర‌ప‌డింది. మార్చి మొద‌టి లేదా రెండో వారంలో బ‌డ్జెట్ స‌మావేశాలు నిర్వ‌హించే అవ‌కాశం ఉంది. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి దేవాదుల ప్రాజెక్టు సంద‌ర్శ‌న సంద‌ర్భంగా ఇంజినీర్ల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర బడ్జెట్ స‌మావేశాలు మార్చిలో ఉంటాయ‌ని సీఎం రేవంత్ చెప్ప‌క‌నే చెప్పారు.

స‌మీక్ష సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. జూన్ 2 లోపల భూసేకరణ కోసం రూ. 600 కోట్లు మంజూరు చేస్తాం. బడ్జెట్‌లోపే అన్ని అంచనాలను ప్రభుత్వం ముందుంచి ఆమోదం తీసుకోవాలి. మార్చిలో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి అన్ని అంచనాలకు ఆమోదం తెలియజేస్తామ‌ని సీఎం అన్నారు.

నెల రోజుల్లోపే దేవాదుల పంప్ రిపేర్ చేయాలి. అసెంబ్లీ సమావేశాల సమయంలో ఎమ్మెల్యేలు, అధికారులతో దేవాదులపైన కమిటీ హాల్‌లో ప్రత్యేక సమావేశం నిర్వ‌హిస్తాను. అన్ని ప్రాజెక్టుల భూ సేకరణ కోసం ప్రత్యేక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తాం. గ్రీన్ ఛానల్‌లో నిధులు మంజూరు చేస్తాం. భూ సేకరణ జాప్యం వల్ల ప్రాజెక్టుల పనులు ఆగడానికి వీలు లేదు. రామప్ప చెరువు నుంచి జంపన్న వాగుకు నీరు అందించే ప్రణాళికపైన నివేదిక ఇవ్వాలి అని ఇంజినీరింగ్ అధికారుల‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Advertisement
Advertisement