CM Revanth Reddy | ఓల్డ్ సిటీనే ఒరిజినల్ సిటీ.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy | ఓల్డ్ సిటీనే ఒరిజినల్ సిటీ అని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ రాక్స్ అండ్ లేక్స్ సిటీ అని ఆయన పేర్కొన్నారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : ఓల్డ్ సిటీనే ఒరిజినల్ సిటీ అని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ రాక్స్ అండ్ లేక్స్ సిటీ అని ఆయన పేర్కొన్నారు. శాసనమండలిలో సీఎం రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవంపై మాట్లాడారు.
దేశంలో ఎన్నో నగరాలున్నా ప్రధానంగా ఐదు నగరాల గురించి మాత్రమే చర్చించుకుంటాం. పొలిటికల్ రాజధానిగా ఢిల్లీ, ఫైనాన్షియల్ కేపిటల్ ముంబై, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల గురించి చర్చించుకుంటాం. పొలిటికల్ కేపిటల్‌గా ఉన్న ఢిల్లీలో కాలుష్యం కారణంగా పాఠశాలలలకు, ఆఫీసులకి సెలవులు ఇస్తున్నారు. ముంబైలో వర్షాలు వస్తే వరదలు వచ్చే పరిస్థితి. ఫైనాన్షియల్ కేపిటల్‌గా ఉన్న ముంబైలో నివసించలేని పరిస్థితి. బెంగుళూరులో విపరీతమైన ట్రాఫికక్, చెన్నైలో వరదలతో ఇబ్బందులు పడే పరిస్థితి. హైదరాబాద్ రాక్స్ అండ్ లేక్స్ సిటీ. అది ఓల్డ్ సైట్ అని మనం చెప్పుకుంటున్నా.. అది ఒరిజినల్ సిటీ. చార్మినార్, గుల్జార్ హౌస్, మనం ఉన్న శాసన మండలి ఎన్నో చారిత్రక కట్టడాలు నగరంలో ఉన్నాయి. ఇలాంటి ఘన చరిత్ర ఉన్న నగరంలో మానవ తప్పిదాలతో సమస్యలు వస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
తెలంగాణను మూడు జోన్లుగా విభజించుకున్నాం..
హైదరాబాద్ నగరంలో ప్రధానంగా వాహనాల సంఖ్య పెరిగింది. వీటికి పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. రవాణాలో రోడ్లు, రైల్వే, ఎయిర్ పోర్టు, పోర్టు కీలకం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, చర్లపల్లి రైల్వేస్టేషన్ అభివృద్ధి చేసుకున్నాం. మెట్రోను నిర్మించుకున్నాం. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికతో ముందుకు వెళుతున్నాం. తెలంగాణను మూడు జోన్లుగా విభజించుకున్నాం. క్యూర్, ప్యూర్, రేర్ అని మూడు జోన్లుగా విభజించాం. ఔటర్ రింగురోడ్డు ఇన్ సైడ్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ. ఈ ప్రాంతంలోని కాలుష్య కారక పరిశ్రమలకు ఔటర్ రింగ్ రోడ్డు బయటకు తరలిస్తే.. మధ్యతరగతికి భూమి అందుబాటులోకి వస్తుంది. నగరం నివాస యోగ్యంగా మారుతుంది అని సీఎం అన్నారు.
మెట్రోను విస్తరిస్తున్నాం..
రోడ్లను అండర్ పాస్, సర్ఫేస్, ఎలివేటెడ్ కారిడార్ అని మూడు భాగాలుగా అభివృద్ధి చేసుకుంటున్నాం. ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు ప్రణాళికలు తీసుకున్నాం. 29 ప్రాంతాల్లో జరుగుతున్న పనుల ప్రణాళికలు మీ ముందు పెట్టాం. మెట్రోపై ఎల్ అండ్ టీతో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు నిర్ణయించాం. మెట్రోలో లాస్ట్ మైల్ కనెక్టివీటీ లేదు.. అందుకే మెట్రోను విస్తరిస్తున్నాం. మెట్రో విస్తరణ కోసం కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిచింది. త్వరలోనే మెట్రో విస్తరణకు త్వరలోనే చేపట్టబోతున్నాం. బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి కూడా అండర్ పాస్ రోడ్డుకు అనుమతి తీసుకొచ్చాం. దేశంల్ రన్ వే కింద ఇలాంటి రోడ్డు ఎక్కడా లేదు అని రేవంత్ రెడ్డి తెలిపారు.
ఎలివేటెడ్ కారిడార్లను పూర్తి చేసుకుంటున్నాం..
నల్లగొండ, విజయవాడ రోడ్డులో ఎలివేటెడ్ కారిడార్లను పూర్తి చేసుకుంటున్నాం. నగరంలో సిగ్నల్ దగ్గర ఆగే వ్యవస్థను తగ్గించి ప్రయాణం సాఫీగా సాగేలా చేయాలనేది మా ప్రయత్నం. కొంత కఠినం అనింపించినా ఫుట్ పాత్ ఆక్రమణలు తొలగించి ప్రజల ప్రాణాలు కాపాడాలనుకుంటున్నాం. ఫుట్ పాత్‌లో ఉండే చిరు వ్యాపారుల కోసం ఎక్కడైనా స్థలాన్ని కేటాయించి అక్కడ వ్యాపారాలు చేసుకునేందుకు ప్రోత్సహిద్దాం. కేబీఆర్ పార్క్ దగ్గర మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేశాం. సంస్కరణల్లో భాగంగా మేం ఇలాంటి చర్యలను చేపడుతున్నామని సీఎం తెలిపారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





