త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | మావోయిస్టులు కాంగ్రెస్‌లో చేరాల‌నుకుంటే గాంధీ భ‌వ‌న్‌కు రావొచ్చు.. సీఎం రేవంత్ సూచ‌న‌

CM Revanth Reddy | లొంగిపోయిన మావోయిస్టులు కాంగ్రెస్ పార్టీలో చేరాల‌నుకుంటే.. గాంధీ భ‌వ‌న్‌కు వ‌చ్చి వారు వారి ఆస‌క్తిని తెలుప‌వ‌చ్చ‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రాజ‌కీయాల్లోకి రావాల‌నుకోవ‌డం అది వారి వ్య‌క్తిగ‌తమ‌ని సీఎం అన్నారు.

S

Telangana | Published On Mar 7, 2026, 6.38 pm IST

CM Revanth Reddy | మావోయిస్టులు కాంగ్రెస్‌లో చేరాల‌నుకుంటే గాంధీ భ‌వ‌న్‌కు రావొచ్చు.. సీఎం రేవంత్ సూచ‌న‌
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : లొంగిపోయిన మావోయిస్టులు కాంగ్రెస్ పార్టీలో చేరాల‌నుకుంటే.. గాంధీ భ‌వ‌న్‌కు వ‌చ్చి వారు వారి ఆస‌క్తిని తెలుప‌వ‌చ్చ‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రాజ‌కీయాల్లోకి రావాల‌నుకోవ‌డం అది వారి వ్య‌క్తిగ‌తమ‌ని సీఎం అన్నారు. పోలీసు క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌లో 130 మంది మావోయిస్టులు 124 ఆయుధాల‌తో లొంగిపోయిన సంద‌ర్భంగా సీఎం ప్ర‌సంగించారు. రేవంత్ ప్ర‌సంగం ముగిసిన అనంత‌రం మీడియా ప్ర‌తినిధులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు సీఎం ఇలా బ‌దులిచ్చారు.

నిషేధం ఎత్తేస్తారా..?

  • నక్స‌లైట్లు జ‌న జీవ‌న స్ర‌వంతిలో క‌లిసిన త‌ర్వాత నిషేధం ఎందుకు..? వాళ్లు ఇంకా ఉన్నారంటే ప్ర‌భుత్వాలు నిషేధం కొన‌సాగిస్తాయి. జ‌న‌జీవ‌న స్ర‌వంతిలో క‌లిసి ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా వాళ్లు ప‌ని చేస్తున్నారంటే నిషేధం ఉన్నా లేక‌పోయినా ఒక్క‌టే. నిషేధం అనేది ప్రాధాన్యం కాదు. ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ప్ర‌య‌త్నించాలి అని సీఎం అన్నారు.

వ‌ర‌వ‌ర‌రావు, గాదె ఇన్న‌య్య‌పై కేసులు ఎత్తేస్తారా..?

  • ఎత్తివేయ‌గ‌లిగే కేసులు ఉంటే సానుకూలంగా స్పందిస్తాం. తీవ్ర‌మైన నేరాలు ఉంటే ప్ర‌భుత్వం ఎత్తేసినా న్యాయ‌స్థానాలు ఊరుకోవు. అవ‌స‌ర‌మ‌నుకుంటే ప్ర‌త్యేక‌మైన క‌మిటీ ఏర్పాటు చేసి.. కేసు తీవ్ర‌త‌ను బ‌ట్టి ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంది. ప్ర‌భుత్వం సానుకూలంగా, సానుభూతితో ఉంది. చ‌ట్ట‌ప‌రిధిలో ఎత్తేయ‌డానికి అవ‌కాశం ఉన్న కేసుల‌ను త‌ప్ప‌కుండా ఎత్తేస్త‌ది అని సీఎం తెలిపారు.

దేవ్ జీ లాంటి వారు ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌స్తామ‌ని స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారు..? మ‌రి మీరేం చెబుతారు..?

  • వారి జీవ‌న విధానాన్ని నిర్ణ‌యించుకునే అధికారం, హ‌క్కు వారికి ఉంది. ప్ర‌జా జీవితంలో ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌స్తారా..? కుటుంబ స‌భ్యుల‌తో శాంతియుతంగా గ‌డుపుతారా..? అన్న‌ది వారి ఇష్టం.. వారి ఇష్టఇష్టాల‌ను బ‌ట్టి ఉండొచ్చు. రాజ‌కీయాల్లోకి వ‌స్తారా అన్న‌ది వారి అభీష్టం మేర‌కు తీసుకునే నిర్ణ‌యం. మంత్రి సీత‌క్క రాజ‌కీయాల్లో ఉన్నారు.. గ‌తంలో మావోయిస్టు పార్టీకి సానుభూతితో ప‌ని చేసిన వారు ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ఎవ‌రైనా కాంగ్రెస్ పార్టీలో చేరాల‌నుకుంటే పీసీసీ అధ్య‌క్షుడు మ‌హేశ్ గౌడ్ ఎప్పుడూ గాంధీ భ‌వ‌న్‌లో అందుబాటులో ఉంటారు. వారిని క‌లిసి ఆస‌క్తిని వ్య‌క్త‌ప‌ర‌చొచ్చు. ఇత‌ర రాజ‌కీయ పార్టీలో చేరేందుకు కూడా అవ‌కాశం ఉంది. అది వారి ఇష్టం అని సీఎం పేర్కొన్నారు.
Advertisement
Advertisement