త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | కొడంగ‌ల్ ఎత్తిపోత‌ల‌కు ఎప్పుడంటే అప్పుడు నిధులు మంజూరు చేస్తా : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | నారాయ‌ణ‌పేట - కొడంగ‌ల్ ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని ఏడాదిన్న‌ర లోపు పూర్తి చేసి కృష్ణా న‌ది జలాలు తీసుకురావాలి.. కొడంగ‌ల్ భూములు కృష్ణా జ‌లాల‌తో త‌డ‌వాలి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి ఎప్పుడంటే అప్పుడు నిధులు మంజూరు చేస్తాన‌ని సీఎం స్ప‌ష్టం చేశారు.

S

Telangana | Published On May 8, 2026, 4.51 pm IST

CM Revanth Reddy | కొడంగ‌ల్ ఎత్తిపోత‌ల‌కు ఎప్పుడంటే అప్పుడు నిధులు మంజూరు చేస్తా : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : నారాయ‌ణ‌పేట - కొడంగ‌ల్ ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని ఏడాదిన్న‌ర లోపు పూర్తి చేసి కృష్ణా న‌ది జలాలు తీసుకురావాలి.. కొడంగ‌ల్ భూములు కృష్ణా జ‌లాల‌తో త‌డ‌వాలి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి ఎప్పుడంటే అప్పుడు నిధులు మంజూరు చేస్తాన‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. కొడంగ‌ల్‌లో వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌య నిర్మాణానికి భూమిపూజ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో రేవంత్ రెడ్డి ప్ర‌సంగించారు.

కొడంగల్‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామి దేవాల‌యం తెలంగాణ‌తో పాటు క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర భ‌క్తుల‌కు కూడా పేద‌ల తిరుప‌తిగా పేరుగాంచింది. 2009లో మొద‌టి సారి నేను కొడంగ‌ల్ ఎమ్మెల్యేగా గెల‌వ‌డానికి ఎంతో మంది కార్య‌క‌ర్త‌లు త‌మ చెమ‌ట‌ను ర‌క్తంగా మార్చి ప‌నిచేశారు. కొడంగ‌ల్ శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం అంటే ఒక‌వైపు గుడి.. మ‌రో వైపు గ‌డి. కానీ ఇవాళ గుడి, గ‌డి ఏక‌మై కొడంగ‌ల్‌ను ఒక నంద‌న‌వ‌నంగా పాడి పంట‌ల‌తో విల‌సిల్లేలా ముందుకు తీసుకెళ్లేందుకు క‌లిసివ‌చ్చారు.

తిరుప‌తి ప్ర‌కారం కొడంగ‌ల్ దేవాల‌యంలో పూజ‌లు..

మాజీ ఎమ్మెల్యే నందారం సూర్య‌నారాయ‌ణ శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామి దేవాల‌యానికి టీటీడీ నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేశారు. ఆగ‌మ‌శాస్త్ర స‌ల‌హాదారులు సుంద‌ర‌వ‌ర‌దాచార్యులు పెట్టిన ముహుర్తం ప్ర‌కార‌మే శంకుస్థాప‌న చేశాం. వారు ఈ స‌మ‌యంలో లేక‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌రం. సుంద‌ర వ‌ర‌దాచార్యుల వారిని ఈ ప్రాంత ప్ర‌జ‌లు శాశ్వ‌తంగా గుర్తు పెట్టుకునేలా వారి పేరు ఒక విడిదికి పెట్ట‌మ‌ని సూచిస్తున్న‌. తిరుప‌తిలో ఏ సాంప్ర‌దాయం ప్ర‌కారం పూజ‌లు చేస్తారో అవే పూజ‌లు కొడంగ‌ల్ దేవాల‌యంలో చేయాలి. ఇది గొప్ప దైవ కార్య‌క్ర‌మం. కొడంగ‌ల్ పేరు ప్ర‌తిష్ట‌ల‌ను దేశ స్థాయిలో నిల‌బెట్ట‌డానికి ఇది ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని సీఎం తెలిపారు.

రోజూకు 18 గంట‌లు క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తున్నాం..

మాజీ శానససభ్యులు గుర్నాథరెడ్డి ఎన్నో సార్లు గెలిచినా మంత్రి కాలేకపోయారు. కొడంగల్ అభివృద్ధి కోసం ఎన్నో విజ్ఝ‌ప్తులు చేసినా ఆనాడు ప్ర‌యోజ‌నం లేక‌పోయింది. 2018లో కొడంగ‌ల్‌లో నేను ఓడిపోయిన త‌ర్వాత‌ మ‌ల్కాజ్‌గిరి ఎంపీగా నిల‌బ‌డిన‌ప్పుడు ఇక్క‌డి నుంచి అనేక మంది కార్య‌క‌ర్త‌లు వ‌చ్చి క‌ష్ట‌ప‌డి గెలిపించారు. ప్ర‌జ‌ల ఆశీర్వాదంతో తెలంగాణ ముఖ్య‌మంత్రిగా నిల‌బ‌డ్డాను. అంద‌రి స‌హ‌కారంతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నాం. రోజూకు 18 గంట‌లు క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తున్నాం అని సీఎం స్ప‌ష్టం చేశారు.

వ‌డ్లు పండించే ప‌రిస్థితి లేదు..

రైతు రుణ‌మాఫీ, స‌న్న బియ్యం, రైతు భ‌రోసా, ఇందిర‌మ్మ ఇళ్లు, రేష‌న్ కార్డులు, ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ఇలా ఎన్నో సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేస్తున్నాం. పేద‌ల విద్య‌, వైద్యం కోసం ఎన్నో కార్య‌క్ర‌మాలు చేస్తున్నాం. ఒక‌ప్పుడు కొడంగ‌ల్‌లో విద్య కోసం ప‌క్క‌న ఉన్న వికారాబాద్, ప‌రిగి వెళ్లేవారు. కొడంగ‌ల్ నుంచి అనేక మంది వ‌ల‌స‌లు పోయారు. కొడంగ‌ల్ రాష్ట్రంలోనే ఎత్తైన ప్రాంతం.. నీళ్లు వ‌చ్చే అవ‌కాశం లేక‌పోయింది. వ‌డ్లు పండించే ప‌రిస్థితి లేదు.. కందులు త‌ప్ప ఏమీ పండ‌లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఇళ్లు కూడా క‌ట్టుకోలేని అమాయ‌క‌త్వం కొడంగ‌ల్ ప్ర‌జ‌ల‌ది..

ఇందిర‌మ్మ ఇళ్లు కూడా క‌ట్టుకోలేని అమాయ‌క‌త్వం కొడంగ‌ల్ ప్ర‌జ‌ల‌ది. ఈ రోజు ప్ర‌తి తండాకు, గ్రామ‌పంచాయ‌తీకి రోడ్డు నిర్మించుకున్నాం. కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల క‌ష్టంతోనే నేను ఈ స్థాయికి వ‌చ్చాను. నారాయ‌ణ‌పేట - కొడంగ‌ల్ ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని ఏడాదిన్న‌ర లోపు పూర్తి చేసి కృష్ణా న‌ది జలాలు తీసుకురావాలి.. కొడంగ‌ల్ భూములు కృష్ణా జ‌లాల‌తో త‌డ‌వాలి. నారాయ‌ణ‌పేట - కొడంగ‌ల్ ఎత్తిపోత‌ల ప‌థ‌కం భూసేక‌ర‌ణ బాధ్య‌త‌ మంత్రి శ్రీహ‌రికి అప్ప‌గిస్తే నెల‌లోపే పూర్తి చేశారు. ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి ఈనాడు ఏ అడ్డంకులు లేవు.. ఎప్పుడంటే అప్పుడు నిధులు మంజూరు చేస్తామ‌ని సీఎం తెలిపారు.

ఎడ్యుకేష‌న‌ల్ హ‌బ్‌గా కొడంగ‌ల్..

వికారాబాద్ రైల్వే లైన్ 90 శాతం పూర్తైంది. సిమెంట్ ప‌రిశ్ర‌మ వ‌చ్చే ఆరు నెల‌ల్లో నిర్మాణం జ‌రుగుతుంది. దీంతో స్థానికంగా ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు మెరుగ‌వుతాయి. మెడిక‌ల్, ఇంజ‌నీరింగ్, ఎటీసీ సెంట‌ర్, న‌ర్సింగ్ కాలేజ్, పాలిటెక్నిక్, సైనిక్ స్కూల్ ఇలా అన్ని విద్యా సంస్థ‌లు కొడంగ‌ల్‌లో ఏర్పాటు అవుతున్నాయి. ఏడాదిన్న‌రలో ఎడ్యూకేష‌న్ హ‌బ్ ప‌నులు పూర్త‌వుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు చ‌దువు కోసం కొడంగ‌ల్‌కు వ‌చ్చేలా చేస్తున్నాం అని రేవంత్ రెడ్డి చెప్పారు.

కొడంగల్‌ను బంగారు తునకగా చేసుకుందాం..

కొడంగ‌ల్ కార్య‌క‌ర్త‌ల ఆశీర్వాదంతో ముఖ్య‌మంత్రి ప‌ద‌వి వ‌చ్చింది. దేశానికి ఆద‌ర్శంగా కొడంగ‌ల్‌ను తీర్చిదిద్దుకోవాలి. 2300 ఎక‌రాల్లో ఇండ‌స్ట్రియ‌ల్ పార్క్‌ను ల‌గ‌చ‌ర్ల ద‌గ్గ‌ర ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎయిర్‌పోర్టు నుంచి కొడంగ‌ల్‌కు పెద్ద రోడ్డు నిర్మిస్తున్నాం. రాజ‌కీయాల‌కు అతీతంగా క‌లిసిక‌ట్టుగా ప‌నిచేయాలి. చిన్న చిన్న స‌మ‌స్య‌ల‌ను ప‌క్క‌న పెట్టాలి. దౌల్తాబాద్‌లో వెంక‌టేశ్వ‌ర స్వామి, కోస్గిలో వేణుగోపాల స్వామి దేవాల‌యం నిర్మించుకుంటున్నాం. దేశంలోని గొప్ప ప‌రిశ్ర‌మ‌లు కొడంగ‌ల్‌కు వ‌స్తున్నాయి. 2009లో మీరు నాటిన మొక్క ఇప్పుడు చెట్టుగా మారింది.. చెట్టును మీరు కాపాడుకోవాలి. 2027 డిసెంబ‌ర్‌లోగా కొడంగ‌ల్‌లోని అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేయాల్సిందే. స‌ర్పంచ్‌లు ఏ పార్టీ నుంచి గెలిచినా గ్రామాల్లో మాత్రం ప‌నులు చేసుకోవాలి. కొడంగల్‌ను బంగారు తునకగా చేసుకుందామ‌ని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement