CM Revanth Reddy | సిలికాన్ వ్యాలీ మాదిరి సైబరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | హైదరాబాద్ మహా నగరం మరింత అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సైబరాబాద్ కార్పొరేషన్ అంతర్జాతీయ స్థాయిలో పేరు గడిస్తది. ఈ రోజు అమెరికాలో ఉండే సిలికాన్ వ్యాలీకి ఎంత పేరుందో మన సైబరాబాద్‌కు కూడా అంతే పేరుంది అని సీఎం పేర్కొన్నారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ మహా నగరం మరింత అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సైబరాబాద్ కార్పొరేషన్ అంతర్జాతీయ స్థాయిలో పేరు గడిస్తది. ఈ రోజు అమెరికాలో ఉండే సిలికాన్ వ్యాలీకి ఎంత పేరుందో మన సైబరాబాద్‌కు కూడా అంతే పేరుంది అని సీఎం పేర్కొన్నారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ( CMC) పరిధిలో రూ. 1674.74 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సందర్భంగా సీఎం ప్రసంగించారు.
ఐటీ ఎగుమతుల విలువ 60 శాతం ఈ సైబరాబాద్ నుంచే ఉంది. 16.77 శాతం సైబరాబాద్ నుంచి దేశ ఆర్థిక వ్యవస్థలో మన కంట్రిబ్యూషన్ ఉంది. 76 డివిజన్లతో సీఎంసీ ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్పొరేషన్‌లో కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని మూడు జోన్లుగా విడగొట్టి సీఎంసీ ఏర్పాటు చేసుకున్నాం. పోలీసు కమిషనరేట్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నాం. పరిపాలన సౌలభ్యం కోసం వీటిని ఏర్పాటు చేసుకున్నామని సీఎం తెలిపారు.
2029 ఎన్నికల్లో ప్రజలు ఎవర్నీ ఆశీర్వదిస్తారో చూద్దాం
ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు చేద్దాం. 2029 ఎన్నికల్లో ప్రజలు ఎవర్నీ ఆశీర్వదిస్తారో చూద్దాం. పార్టీలకు అతీతంగా, జెండాలకు ఎజెండాలకు అతీతంగా అభివృద్ధి చేసుకుందాం. అవసరమైన నిధులిస్తాం. వివక్ష లేదు వితండవాదం లేదు. పేదల అవసరాలు తీరాలి. ఎలివేటెడ్ కారిడార్, ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు ప్రభుత్వ కార్యాలయాలు, పేదల పిల్లలు చదుకోవడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మొదలుపెట్టినం. సీఎంసీ పరిధిలో ఉన్న పిల్లలను అంతర్జాతీయ ప్రమాణాలతో చదివించాలని, కార్పొరేట్ వైద్యం అందించాలని ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వచ్చామని సీఎం పేర్కొన్నారు.
గుజరాత్‌కు గులామ్‌లుగా ఎందుకు పని చేస్తున్నారు..?
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంలో చేవెళ్ల, మెదక్, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్ నుంచి గెలిచిన ఎంపీలు ఉన్నారు. ఈ నలుగురు ఎంపీలను ప్రజలు ఓటేసి గెలిపించారు. మన రాష్ట్రం నుంచి గెలిచిన 8 మంది ఎంపీలతో మోదీ ప్రధాని అయ్యారు. మెట్రోను తెచ్చే తెలివితేటలు లేవా.. రీజినల్ రింగ్ రోడ్డుకు నిధులు అడగారా.. గోదావరి జలాలను హైదరాబాద్‌కు తరలించేందుకు నిధులు తీసుకురారా..? సింగూరు జలాలను హైదరాబాద్‌కు తేవాల్సిన అవసరం లేదా..? మూసీ ప్రక్షాళనకు అనుమతులు తీసుకురావడం లేదు. వీటన్నింటిపై మోదీని అడగడం చేతకాదు.. పొంకనాలు కొడుతుండు కిషన్ రెడ్డి.. పొంకనాల పోసికి మూడు ఎడ్లు ఉంటే 36 దొడ్లు ఉన్నాయని.. నువ్వు ఎంత మొనగాడివో.. ఎంత లడాయికి పోతవో తెలంగాణ ప్రజలకు తెలుసు. నీ తెలివితేటలు ఆపేయ్.. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై మహారాష్ట్ర సీఎంతో చర్చిద్దామంటే అడ్డుపడుతున్నది నువ్వు కాదా..? గుజరాత్‌కు గులామ్‌లుగా ఎందుకు పని చేస్తున్నారు..? అని రేవంత్ రెడ్డి నిలదీశారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Hyderabad Police | పాత వాహనాల క్రయవిక్రయాలపై సిటీ పోలీసుల నజర్.. సీపీ సజ్జనర్ కీలక అడ్వైజరీ
- ●Bakka Judson | ఉద్యోగాల భర్తీపై పూర్తి వివరాలు వెల్లడించాలి : బక్క జడ్సన్
- ●Monsoom | తెలంగాణలోకి ప్రవేశించిన రుతుపవనాలు.. ప్రకటించిన వాతావరణశాఖ
- ●Bhagyashri Borse | ట్రెడిషనల్ లుక్‌లో లెనిన్ హీరోయిన్ - చీరలో అందాలు అదుర్స్
- ●CM Revanth Reddy | గాజులరామారంలో 100 ఎకరాల్లో అంతర్జాతీయ బస్ టెర్మినల్ : సీఎం రేవంత్ రెడ్డి
- ●Janhvi Kapoor | పెద్ది సక్సెస్ మీట్‌ను స్కిప్ చేసిన జాన్వీ - అచ్చియమ్మ పేరు ఎత్తని చరణ్

Hyderabad Police | పాత వాహనాల క్రయవిక్రయాలపై సిటీ పోలీసుల నజర్.. సీపీ సజ్జనర్ కీలక అడ్వైజరీ

Bakka Judson | ఉద్యోగాల భర్తీపై పూర్తి వివరాలు వెల్లడించాలి : బక్క జడ్సన్

Monsoom | తెలంగాణలోకి ప్రవేశించిన రుతుపవనాలు.. ప్రకటించిన వాతావరణశాఖ

Bhagyashri Borse | ట్రెడిషనల్ లుక్‌లో లెనిన్ హీరోయిన్ - చీరలో అందాలు అదుర్స్




