Bakka Judson | ఉద్యోగాల భర్తీపై పూర్తి వివరాలు వెల్లడించాలి : బక్క జడ్సన్
Bakka Judson | రాష్ట్రంలో 67,760 ఉద్యోగాలు భర్తీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రకటనలకు సంబంధించి పూర్తి వివరాలను బహిరంగపరచాలని మాజీ ఏఐసీసీ సభ్యుడు, మాజీ ఏపీవీసీసీ చైర్మన్ బక్క జడ్సన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కార్యాలయం ఎదుట ఆయన నిరసన చేపట్టారు.
Bakka Judson | రాష్ట్రంలో 67,760 ఉద్యోగాలు భర్తీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రకటనలకు సంబంధించి పూర్తి వివరాలను బహిరంగపరచాలని మాజీ ఏఐసీసీ సభ్యుడు, మాజీ ఏపీవీసీసీ చైర్మన్ బక్క జడ్సన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కార్యాలయం ఎదుట ఆయన నిరసన చేపట్టారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన గణాంకాలు, నోటిఫికేషన్లు, నియామక ప్రక్రియలు, నియామక ఉత్తర్వుల వివరాలను తేదీల వారీగా వెల్లడించాలని డిమాండ్ చేస్తూ మూడు గంటలపాటు ఆందోళన నిర్వహించినట్లు తెలిపారు. అయితే తమ నిరసనకు స్పందించకుండా పోలీసులు తనను అదుపులోకి తీసుకుని గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారని ఆరోపించారు. ఈ సందర్భంగా బక్క జడ్సన్ మాట్లాడుతూ ప్రభుత్వం చెబుతున్న ఉద్యోగాల సంఖ్యకు స్పష్టమైన ఆధారాలు ప్రజల ముందుంచాల్సిన బాధ్యత ఉందన్నారు. టీజీపీఎస్సీ ద్వారా విడుదలైన నోటిఫికేషన్లు, భర్తీ అయిన పోస్టుల సంఖ్య, నియామక ప్రక్రియ పూర్తయిన ఉద్యోగాల వివరాలను అధికారికంగా ప్రకటించాలని కోరారు.
నిరసన కార్యక్రమంలో భాగంగా ఇటీవల ఉద్యోగ అవకాశాలు లేక ఆత్మహత్యలకు పాల్పడిన ఆరుగురు నిరుద్యోగ యువత ఫొటోలను ప్రదర్శించారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి భిన్నంగా, నిరుద్యోగ సమస్య కారణంగా యువత తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలపై ఇప్పటికే జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతి హామీ ఇప్పటికీ అమలులోకి రాకపోవడం యువతలో నిరాశను పెంచుతోందని విమర్శించారు. ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలమవుతోందని ఆరోపించారు. టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద మొత్తం 13,943 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు, వాటి విడుదల తేదీలు, భర్తీ స్థితిగతులను ప్రదర్శించినట్లు తెలిపారు.
తెలంగాణలో నిరుద్యోగిత రేటు 8.9 శాతంగా ఉందని పేర్కొంటూ, ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం చెబుతున్నదానికి వాస్తవ పరిస్థితులకు మధ్య వ్యత్యాసం ఉందన్నారు. నిరుద్యోగుల సమస్యలపై ఉద్యమాలు ప్రారంభమైన ప్రతిసారీ కొన్ని కోచింగ్ సెంటర్లు, వాటికి అనుబంధంగా ఉన్న సంఘాల ద్వారా అసలు ఉద్యమాలను బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. యువత అలాంటి ప్రభావాలకు లోనుకాకుండా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని బక్క జడ్సన్ స్పష్టం చేశారు. అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత విస్తరిస్తామని హెచ్చరించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Hyderabad Police | పాత వాహనాల క్రయవిక్రయాలపై సిటీ పోలీసుల నజర్.. సీపీ సజ్జనర్ కీలక అడ్వైజరీ
జూన్ 8, 2026

Monsoom | తెలంగాణలోకి ప్రవేశించిన రుతుపవనాలు.. ప్రకటించిన వాతావరణశాఖ
జూన్ 8, 2026

CM Revanth Reddy | గాజులరామారంలో 100 ఎకరాల్లో అంతర్జాతీయ బస్ టెర్మినల్ : సీఎం రేవంత్ రెడ్డి
జూన్ 8, 2026
తాజావార్తలు
- ●Andhra Pradesh Natural Farming | ప్రపంచ వేదికపై ఏపీ రైతుల సత్తా.. 'ఫుడ్ ప్లానెట్ ప్రైజ్-2026' గెలుచుకున్న ఆంధ్రప్రదేశ్!
- ●Hyderabad Police | పాత వాహనాల క్రయవిక్రయాలపై సిటీ పోలీసుల నజర్.. సీపీ సజ్జనర్ కీలక అడ్వైజరీ
- ●Monsoom | తెలంగాణలోకి ప్రవేశించిన రుతుపవనాలు.. ప్రకటించిన వాతావరణశాఖ
- ●Bhagyashri Borse | ట్రెడిషనల్ లుక్లో లెనిన్ హీరోయిన్ - చీరలో అందాలు అదుర్స్
- ●CM Revanth Reddy | గాజులరామారంలో 100 ఎకరాల్లో అంతర్జాతీయ బస్ టెర్మినల్ : సీఎం రేవంత్ రెడ్డి
- ●CM Revanth Reddy | సిలికాన్ వ్యాలీ మాదిరి సైబరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి

Andhra Pradesh Natural Farming | ప్రపంచ వేదికపై ఏపీ రైతుల సత్తా.. 'ఫుడ్ ప్లానెట్ ప్రైజ్-2026' గెలుచుకున్న ఆంధ్రప్రదేశ్!

Hyderabad Police | పాత వాహనాల క్రయవిక్రయాలపై సిటీ పోలీసుల నజర్.. సీపీ సజ్జనర్ కీలక అడ్వైజరీ

Monsoom | తెలంగాణలోకి ప్రవేశించిన రుతుపవనాలు.. ప్రకటించిన వాతావరణశాఖ

Bhagyashri Borse | ట్రెడిషనల్ లుక్లో లెనిన్ హీరోయిన్ - చీరలో అందాలు అదుర్స్



