త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Monsoom | తెలంగాణలోకి ప్ర‌వేశించిన రుతుప‌వ‌నాలు.. ప్ర‌క‌టించిన వాతావ‌ర‌ణ‌శాఖ‌

Monsoom | తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ప్ర‌వేశించిన‌ట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 4న కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు దక్షిణ భారత రాష్ట్రాల మీదుగా క్రమంగా ముందుకు సాగి క‌ర్నాట‌క‌, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలను దాటి తెలంగాణలోకి చేరాయి.

P

Telangana | Published On Jun 8, 2026, 8.39 pm IST

Monsoom | తెలంగాణలోకి ప్ర‌వేశించిన రుతుప‌వ‌నాలు.. ప్ర‌క‌టించిన వాతావ‌ర‌ణ‌శాఖ‌
Advertisement

Monsoom | తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ప్ర‌వేశించిన‌ట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 4న కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు దక్షిణ భారత రాష్ట్రాల మీదుగా క్రమంగా ముందుకు సాగి క‌ర్నాట‌క‌, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలను దాటి తెలంగాణలోకి చేరాయి. ప్రస్తుతం అనుకూల వాతావరణ పరిస్థితులు నెలకొనడంతో రాబోయే రెండు నుంచి మూడు రోజుల్లో రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు వీటి విస్తరించే అవకాశముందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన అంచనాల ప్రకారం.. జూన్ 11 నుంచి 12 మధ్య గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రుతుపవనాల ప్రభావం స్పష్టంగా కనిపించనుంది.

అనంతరం జూన్ 15 నుంచి 18వ తేదీల మధ్య మధ్య, ఉత్తర తెలంగాణ జిల్లాలన్నింటికీ రుతుపవనాలు పూర్తిస్థాయిలో వ్యాపించే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా, రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సోమ‌, మంగ‌ళ‌వారాల్లో తేదీల్లో వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవడంతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చని తెలిపింది. రుతుపవనాల రాకతో ఖరీఫ్ సీజన్‌కు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల కోసం సన్నద్ధమవుతున్నారు.

Advertisement
Advertisement