Revanth Reddy | సర్‌పై మరింత అప్రమత్తంగా ఉండండి.. అలాంటి వారిపై చర్యలు తప్పవు: సీఎం రేవంత్
Revanth Reddy | ప్రత్యేక సమగ్ర సర్వే (SIR)పై ప్రతిఒక్కరు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సూచించారు. ఇది చాలా సీరియస్ అంశమని చెప్పారు.
Revanth Reddy | త్రినేత్ర.న్యూస్: ప్రత్యేక సమగ్ర సర్వే (SIR)పై ప్రతిఒక్కరు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సూచించారు. ఇది చాలా సీరియస్ అంశమని చెప్పారు. అయినప్పటికీ కొందరు నేతలు సర్‌పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. పార్టీ నాయలతో సర్‌పై సీఎం రేవంత్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. సర్‌పై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. పార్టీకి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊర్కొనేది లేదని హెచ్చరించారు. సర్ అవగాహన సదస్సులపై జిల్లాల వారీగా తన వద్ద నివేదిక ఉందని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ తరుపున సర్‌పై మరిన్ని అవగాహన సదస్సులు జరగాలని సూచించారు. ఇన్‌చార్జి మంత్రుల మరింత బాధ్యతాయుతంగా వ్యవహారించాలన్నారు. సర్ విషయంలో సరిగా వ్యవహారించకపోతే పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. పేదల ఓట్లు పోతే వాళ్ల ఆధార్ కార్డు, రేషన్ కార్డు పోతుందని, వాళ్లకు అన్యాయం జరగనివ్వొద్దని తెలిపారు.
సర్ పై పార్టీ ఆదేశాలను ఎవరైనా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. పట్టించుకోని వారిని గుర్తించి వారి స్థానంలో మరొక ఇన్‌చార్జిని నియమిస్తామని చెప్పారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని క్షమించేది లేదన్నారు. పని చేయకుండా పార్టీకి నష్టం కల్గిస్తామంటే చూస్తూ ఉర్కునేది లేదని వెల్లడించారు. పార్టీ సర్పంచ్‌లతో సర్ పై గ్రామాల్లో ప్రచారం చేయించి అవగాహన కల్పించాలని చెప్పారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Google Chrome | గూగుల్ క్రోమ్‌లో భారీ అప్డేట్.. పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు కూడా ఆటోఫిల్..
- ●Gautam Adani | కంపెనీ భవిష్యత్తుకు అదానీ బ్లూప్రింట్.. ఏజీఎంలో భారీ ప్రణాళికలు వెల్లడి..
- ●Harish Rao | తెలంగాణ ప్రయోజనాలను పక్క రాష్ట్రాలకు తాకట్టు పెడుతున్న కాంగ్రెస్ సర్కార్: హరీశ్ రావు
- ●Indian Embassy in Tehran | ఇరాన్‌కు ప్రయాణాలు చేయొద్దు.. భారతీయులకు ఎంబసీ కీలక సూచన
- ●TG TET | తెలంగాణ టెట్ ఫలితాలు ఎప్పుండంటే?.. సర్కార్ బడుల్లో ఖాళీగా 14 వేల టీచర్ పోస్టులు!
- ●CM family Land Scam | సీఎం కుటుంబం వందల ఎకరాల భూ స్కామ్.. సంచలనం రేపుతున్న నివేదిక

Google Chrome | గూగుల్ క్రోమ్‌లో భారీ అప్డేట్.. పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు కూడా ఆటోఫిల్..

Gautam Adani | కంపెనీ భవిష్యత్తుకు అదానీ బ్లూప్రింట్.. ఏజీఎంలో భారీ ప్రణాళికలు వెల్లడి..

Harish Rao | తెలంగాణ ప్రయోజనాలను పక్క రాష్ట్రాలకు తాకట్టు పెడుతున్న కాంగ్రెస్ సర్కార్: హరీశ్ రావు

Indian Embassy in Tehran | ఇరాన్‌కు ప్రయాణాలు చేయొద్దు.. భారతీయులకు ఎంబసీ కీలక సూచన





