త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SIP | రూ.10వేల సిప్‌తో రూ.7 కోట్లు.. ఆదిత్య బిర్లా స్కీమ్ అద్భుతం..

SIP | మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో సిస్ట‌మాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ లేదా ఎస్ఐపీ (సిప్‌) అంటే చాలా మంది ఒక‌ప్పుడు ప్ర‌తికూల భావాల‌ను క‌లిగి ఉండేవారు. కానీ ఇప్పుడు ప‌రిస్థితి మారింది. టెక్నాల‌జీ మారుతున్న కొద్దీ స్టాక్ మార్కెట్ల గురించి ప్ర‌జ‌లు విరివిగా తెలుసుకుంటున్నారు. స్టాక్ మార్కెట్ల‌లో స్టాక్స్ లేదా మ్యుచువ‌ల్ ఫండ్స్ ఏవైనా స‌రే దీర్ఘ‌కాలంలోనే సంప‌ద‌ను సృష్టిస్తాయ‌ని చాలా మంది అర్థం చేసుకుంటున్నారు.

S

Business | Published On Sep 5, 2026, 1.31 pm IST

SIP | రూ.10వేల సిప్‌తో రూ.7 కోట్లు.. ఆదిత్య బిర్లా స్కీమ్ అద్భుతం..
Advertisement

SIP | మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో సిస్ట‌మాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ లేదా ఎస్ఐపీ (సిప్‌) అంటే చాలా మంది ఒక‌ప్పుడు ప్ర‌తికూల భావాల‌ను క‌లిగి ఉండేవారు. కానీ ఇప్పుడు ప‌రిస్థితి మారింది. టెక్నాల‌జీ మారుతున్న కొద్దీ స్టాక్ మార్కెట్ల గురించి ప్ర‌జ‌లు విరివిగా తెలుసుకుంటున్నారు. స్టాక్ మార్కెట్ల‌లో స్టాక్స్ లేదా మ్యుచువ‌ల్ ఫండ్స్ ఏవైనా స‌రే దీర్ఘ‌కాలంలోనే సంప‌ద‌ను సృష్టిస్తాయ‌ని చాలా మంది అర్థం చేసుకుంటున్నారు. దీంతో వాటిల్లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. అయితే ఇప్ప‌టికే మార్కెట్‌లో కొన్ని వంద‌ల మ్యుచువ‌ల్ ఫండ్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. దీంతో వాటిల్లో స‌రైన ఫండ్‌ను ఎంచుకోవ‌డం క‌ష్టంగా మారింది. కానీ నిపుణులు మాత్రం ఓ ప‌ర్‌ఫెక్ట్ ఫండ్‌ను సూచిస్తున్నారు. ఇందులో రూ.10వేల చొప్పున పెట్టుబ‌డి పెట్టిన వారికి స‌గ‌టున 17.92 శాతం మేర రాబ‌డులు వ‌చ్చాయి. 28 ఏళ్ల‌లో రూ.7 కోట్ల మేర కార్ప‌స్‌ను ఈ ఫండ్ సృష్టించింది. అదే ఆదిత్య బిర్లాకు చెందిన ఆదిత్య బిర్లా స‌న్ లైఫ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్‌.

28 ఏళ్ల‌లో రూ.7.25 కోట్ల కార్ప‌స్‌..

ఈ ఫండ్‌ను 1998 ఆగ‌స్టు 27న లాంచ్ చేశారు. అప్ప‌టి నుంచి చూస్తే దీర్ఘ‌కాల ప్రాతిప‌దిక‌న ఈ ఫండ్ స‌గ‌టు రిట‌ర్న్స్ 17.92 శాతంగా ఉన్నాయి. అంటే ఏడాదికి ఏకంగా దాదాపు 18 శాతం మేర లాభాల‌ను అందించింద‌న్న‌మాట‌. సాధార‌ణంగా మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో వార్షిక రాబ‌డుల‌ను స‌గ‌టున 12 శాతం మేర లెక్కిస్తారు. దీంతో ఏదైనా ఫండ్ దీర్ఘ‌కాలంలో ఆ శాతం మేర ఎంత మొత్తంలో రాబ‌డుల‌ను అందించిందో ఉజ్జాయింపుగా లెక్కిస్తారు. అయితే ఈ ఫండ్ మాత్రం అంత‌కు మించిన ప్ర‌ద‌ర్శ‌న చేసిన‌ట్లు స్ప‌ష్ట‌మవుతోంది. ఇది పెట్టుబ‌డిదారుల‌కు భారీ మొత్తంలో రాబ‌డుల‌ను అందించింది. ఇందులో అప్ప‌ట్లో రూ.10వేల‌ను నెల‌కు సిప్ కింద పెట్టుబ‌డి పెట్టి ఉంటే 28 ఏళ్ల‌లో ఇప్ప‌టి వ‌ర‌కు రూ.7.25 కోట్ల కార్ప‌స్ జ‌మ అయ్యి ఉండేది. మొత్తం పెట్టుబ‌డి రూ.33.50 ల‌క్ష‌లే. కానీ వ‌డ్డీ రూపంలోనే రూ.7 కోట్లు వ‌చ్చిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇక అప్ప‌ట్లో ఈ ఫండ్‌లో లంప్స‌మ్ పెట్టి ఉంటే ఇది 198 రెట్ల మేర సంప‌ద‌ను సృష్టించి ఉండేద‌ని నిపుణులు చెబుతున్నారు. అప్ప‌ట్లో రూ.1 ల‌క్ష పెట్టిన పెట్టుబ‌డి ఇప్పుడు రూ.1.98 కోట్లుగా మారి ఉండేదని అంటున్నారు.

బెంచ్ మార్క్ సూచీ క‌న్నా అధిక రాబ‌డి..

ఈ ఫండ్ బెంచ్ మార్క్ ఇండెక్స్ నిఫ్టీ500కి టీఆర్ఐగా ఉంది. బెంచ్ మార్క్ సూచీ 28 ఏళ్ల రాబ‌డి 15.29 శాతంగా ఉంటే, ఈ ఫండ్ రాబ‌డి అంత‌క‌న్నా ఎక్కువ‌గా 17.92 శాతంగా ఉండ‌డం విశేషం. అంటే ప్ర‌ధాన బెంచ్ మార్క్ సూచీ క‌న్నా ఎక్కువ‌గానే రాబ‌డిని అందించింద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇక సిప్ సీఏజీఆర్ ప్ర‌కారం చూసుకుంటే ఏకంగా 20.77 శాతం మేర ఈ ఫండ్ రాబ‌డుల‌ను అందించింది. అంటే అప్ప‌ట్లో ఇందులో పెట్టుబ‌డులు పెట్టిన ఇన్వెస‌ర్ల‌పై ఇప్పుడు ఈ ఫండ్ కాసుల వ‌ర్షం కురిపిస్తుంద‌న్న‌మాట‌. మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో క్ర‌మ‌శిక్ష‌ణ‌తో కూడిన పెట్టుబ‌డుల‌కు దీర్ఘ‌కాలంలో ఎంత పెద్ద భారీ సంప‌ద జ‌మ అవుతుందో ఈ ఫండ్ ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తోంది.

రీబ్యాలెన్స్ అవుతున్న పోర్ట్‌ఫోలియో..

ఇక ఇందులోని ఫండ్స్‌ని 60 నుంచి 75 శాతం మేర లార్జ్ క్యాప్స్‌లో పెట్టుబ‌డులు పెడుతుండ‌గా, గ‌త 18 నెల‌ల కాలానికి గాను ఈ ఫండ్ త‌మ పోర్ట్‌ఫోలియోను రీబ్యాలెన్స్ చేస్తూ వ‌స్తోంది. ఇటీవ‌లి కాలంలో మార్కెట్ల‌లో తీవ్ర ఒడిదుడుకులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఫండ్ మేనేజ‌ర్లు నిధుల‌ను మిడ్‌, స్మాల్ క్యాప్ స్టాక్‌ల‌లో పెట్టుబ‌డులు పెడుతున్నారు. దీని వ‌ల్ల పెట్టుబ‌డిదారుల‌కు ఉండే రిస్క్ చాలా వ‌ర‌కు త‌గ్గుతుంద‌ని నిపుణుల అభిప్రాయం. కాగా గ‌త ఆగ‌స్టు 31 వ‌ర‌కు ఈ ఫండ్ ఆస్తుల విలువ రూ.29,044 కోట్లుగా ఉంది. ఆదిత్య బిర్లా స‌న్ లైఫ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 3 ద‌శాబ్దాల చ‌రిత్ర కలిగి ఉండ‌డ‌మే కాకుండా పెట్టుబ‌డిదారుల న‌మ్మ‌కాన్ని చూర‌గొంది. దీర్ఘ‌కాలంలో మెరుగైన రాబ‌డుల‌ను అందిస్తున్నందున పెట్టుబ‌డిదారులు ఇలాంటి ఫండ్స్‌ను ప‌రిశీలించాల్సి ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. పోర్ట్ ఫోలియోను మెరుగ్గా నిర్వ‌హిస్తుండ‌డం, క్ర‌మ‌బ‌ద్ద‌మైన పెట్టుబ‌డి కేటాయింపులు ఈ ఫండ్‌కు బ‌లంగా ఉన్నాయి. అయితే మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డులు పెట్టే ముందు డాక్యుమెంట్ల‌ను త‌ప్ప‌నిస‌రిగా చ‌ద‌వ‌డంతోపాటు నిపుణుల స‌ల‌హా తీసుకోవ‌డం మంచిది.

Advertisement
Advertisement